వేసవి కాలంలో మీ స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్ వేగం తగ్గిందా.. కారణం ఏంటో తెలుసా ?
వేసవి కాలంలో స్మార్ట్‌ఫోన్ల (Smartphone Charging) పనితీరులో కొన్ని మార్పులను గమనించవచ్చు. కొంత సమయమే వినియోగించినా త్వరగా వేడెక్కడం, ఛార్జింగ్ సమయంలోనూ గతం కంటే ఫోన్ వేడెక్కడం గమనించవచ్చు. అయితే ఫోన్ వేడెక్కడం వల్ల ఛార్జింగ్ వేగం కూడా తగ్గుతుంది. అయితే కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా ఛార్జింగ్ వేగాన్ని సరిచేయవచ్చు.
గత మోడల్ స్మార్ట్‌ఫోన్లతో పోలిస్తే ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. ఫలితంగా ఫోన్ ఛార్జింగ్ చేసే సమయం భారీగా తగ్గింది. దీంతోపాటు తక్కువ సమయంలో ఎక్కువ విద్యుత్ ప్రసారం కారణంగా ఫోన్ వేడెక్కుతోంది. అయితే ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లలో ప్రత్యేక మెకానిజం అందుబాటులో ఉంది.

ఫలితంగా ఛార్జింగ్ సమయంలో స్మార్ట్ ఫోన్ వేడెక్కితే ఈ మెకానిజం కారణంగా ఛార్జింజ్ నిలిచిపోవడం లేదా ఛార్జింగ్ స్పీడ్ తగ్గుతుంది. ఫోన్ సాధారణ ఉష్ణోగ్రతకు చేరుకున్నాక మాత్రమే ఛార్జింగ్ కానుంది. వేసవిలో ఛార్జింగ్ వేగం పై అనేక అంశాలు ప్రభావితం చేస్తాయి.
అయితే ఈ వేసవి కాలంలో ఛార్జింగ్ చేస్తున్న సమయంలో ముఖ్యంగా ఫోన్ కేస్‌ను తీసివేసి ఛార్జింగ్ చేయడం ఉత్తమం. ఫలితంగా ఫోన్ వేడెక్కే అవకాశం తక్కువగా ఉంటుంది. వైర్‌లెస్ ఛార్జర్ ఎక్కువ వేడిని ఉత్పత్తి చేస్తుంది.. మీరు వైర్‌లెస్ ఛార్జర్ ను వినియోగిస్తున్నట్లయితే.. వైర్ ఛార్జర్‌ను వినియోగించండి.
ముఖ్యంగా ఫోన్ ఛార్జింగ్ సమయంలో గేమ్స్‌ను ఆడకపోవడం ఉత్తమం. కొన్ని స్మార్ట్‌ఫోన్‌లలో బైపాస్ ఛార్జింగ్ ఫీచర్ అందుబాటులో ఉన్నా.. గేమింగ్ సమయంలో ఫోన్ వేడెక్కే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బైపాస్ ఛార్జింగ్ అంటే ప్రాసెసర్‌కు నేరుగా పవర్ సప్లై జరిగేలా మెకానిజం ఉంటుంది.
దీంతోపాటు స్మార్ట్‌ఫోన్‌ను ఎక్కువ రోజుల నుంచి వినియోగిస్తున్నా.. త్వరగా వేడెక్కే అవకాశం ఉంటుంది. ఫలితంగా ఛార్జింగ్ వేగం తగ్గుతుంది. బ్యాటరీ పనితీరు సక్రమంగా లేకుంటే.. ప్రాసెసర్‌కు అవసరం అయిన విద్యుత్ శక్తిని అందించలేదు. మీకు స్మా్ర్ట్‌ఫోన్ మార్చేందుకు ఇష్టం లేకుంటే కొత్త బ్యాటరీని అమర్చుకొని వినియోగించుకోవచ్చు.
అయితే ఫోన్ సక్రమంగా వినియోగించడం ఎలా..
సాధ్యమైనంత వరకు సంస్థ అందించిన ఛార్జర్‌లను వినియోగించడం ఉత్తమం. దీంతోపాటు బ్యాటరీ పూర్తిగా డిశ్చార్జి అయ్యేంత వరకు ఫోన్‌ను వినియోగించకూడదు. ఎప్పుడైనా ఛార్జింగ్ చేస్తున్నా లేదా వినియోగిస్తున్న సమయంలో ఫోన్ వేడెక్కడాన్ని గమనిస్తే కాస్త విరామం ఇవ్వడం ఉత్తమం. ఫోన్ వేడెక్కిన సమయంలో కొంత సమయం వరకు కేస్‌ను తీసివేయాలి.
దీంతోపాటు స్మార్ట్ ఫోన్‌కు ఎటువంటి ఫిజికల్ డ్యామేజీ లేకుండా చూసుకోవాలి. స్మార్ట్ ఫోన్‌పైన ఎటువంటి ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. ఫోన్ పొరపాటున నీటిలో పడినా లేదా నీరు తగిలినా... పూర్తిగా ఫోన్ నుంచి నీరు బయటకు వచ్చేంత వరకు ఛార్జింగ్ చేయకూడదు.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications