వేసవిలో మీ స్మార్ట్‌ఫోన్ వేడెక్కుతోందా.. ఎందుకో తెలుసా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!!
వేసవి కాలంలో ప్రస్తుతం భారీ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఫలితంగా స్మార్ట్ ఫోన్లు ( Smartphone Overheat ) కూడా వేడెక్కుతున్నాయి. ఫలితంగా హ్యాండ్ సెట్ పనితీరుపై ప్రభావం చూపిస్తుంది. కొన్ని సార్లు బ్యాటరీ లీకేజీ జరిగే ప్రమాదం ఉంది. అయితే కొన్ని చిట్కాల ద్వారా వేసవిలో ఫోన్ వేడెక్కకుండా కాపాడుకోవచ్చు.
కాస్త బ్రేక్ తీసుకోండి :
స్మార్ట్ ఫోన్‌ను ఎక్కువ సమయంలో జేబులో పెట్టుకోవచ్చు. శరీర ఉష్ణోగ్రత, బయట ఉష్ణోగ్రత కారణంగా ఫోన్ వేడెక్కే అవకాశం ఉంది. అందువల్ల స్మార్ట్ ఫోన్ శరీరానికి అంటిపెట్టుకోకుండా దూరంగా ఉండేలా చూడాలి. దీంతోపాటు ఫోన్‌ను ఎక్కువ సమయం ఉపయోగించడం వల్ల కూడా వేడెక్కుతుంది. అందువల్ల కాస్త బ్రేక్ తీసుకొని వినియోగించడం ఉత్తమం.

సూర్యకాంతి నేరుగా ప్రసారం కాకుండా :
దీంతోపాటు ముఖ్యంగా వేసవి కాలంతోపాటు ఇతర సమయాల్లోనూ సూర్యకాంతి నేరుగా స్మార్ట్ ఫోన్ పైన ప్రసారం కాకుండా చూడాల్సి ఉంటుంది. దీని వల్ల స్మార్ట్ ఫోన్ వేడెక్కే అవకాశం ఉంటుంది. ఎప్పుడు కూడా ఫోన్‌ను తక్కువ వెలుగు ఉండే ప్రాంతంలో ఉండనివ్వండి.
ఫోన్ ఉష్ణోగ్రత పెరిగిన వెంటనే..
స్మార్ట్ ఫోన్‌లో ఎక్కువ సమయం గేమ్స్ ఆడినా లేదా ఎక్కువ సమయం వినియోగించినా, ఎక్కువ యాప్‌లు ఒకేసారి వినియోగించినా.. త్వరగా వేడెక్కేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఫోన్ ఉష్ణోగ్రత పెరిగిన వెంటనే Airplane Mode లో ఉంచేందుకు ప్రయత్నం చేయడం ఉత్తమం.
కారులో స్మార్ట్ ఫోన్ విడిచిపెట్టేస్తున్నారా..?
కారును రోడ్లు సహా ఇతర ప్రాంతాల్లో పార్కింగ్ చేసిన సమయంలో వాహనాల్లో స్మార్ట్ ఫోన్‌ను వదిలి వెళ్లకూడదు. ఇలా చేస్తే ఫోన్ డ్యామేజీ అయ్యే అవకాశం ఉంటుంది. దీంతోపాటు ఫోన్‌ను ఛార్జింగ్ చేస్తున్న సమయంలో దానిపై ఎటువంటి వస్తువులను పెట్టేందుకు ప్రయత్నం చేయకూడదు. ఛార్జింగ్ సమయంలో ఉత్పన్నం అయ్యే ఉష్ణోగ్రత కారణంగా డ్యామేజీ జరిగే అవకాశం ఉంది.
ఎట్టి పరిస్థితుల్లోనూ :
దీంతోపాటు ముఖ్యంగా ఫోన్ ఉష్ణోగ్రత పెరిగిన సమయంలో ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రీజర్‌లో ఉంచేందుకు ప్రయత్నం చేయకూడదు. తక్కువ సమయంలో ఉష్ణోగ్రత మార్పుల కారణంగా ఫోన్ డ్యామేజీ అయ్యే అవకాశం ఉంది. ఇందుకు బదులుగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం ఉత్తమం.
ఇతర కాలాలతో పోలిస్తే వేసవి కాలంలో స్మార్ట్ ఫోన్‌ను జాగ్రత్తగా కాపాడుకోవాల్సి ఉంటుంది. వేసవిలో భారీ ఉష్ణోగ్రత కారణంగా స్మార్ట్ ఫోన్లు వేగంగా డ్యామేజీ అయ్యే అవకాశం ఉంది. ఛార్జింగ్ సహా ఇతర సమయాల్లో అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. ప్రయాణ సమయాల్లోనూ ఫోనే వేడెక్కకుండా చూడాల్సి ఉంటుంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్ సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరి కొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








