Home
How to

స్మార్ట్‌ఫోన్‌ చాటుగా మీ మాటలు వింటోందా.. మీ సీక్రెట్స్‌ ఫోన్‌కు తెలియకూడదంటే ఏం చేయాలి..?

గత పదేళ్ల కాలంలో భారత్‌ లో స్మార్ట్‌ఫోన్ల వినియోగం భారీగా పెరిగింది. కొత్త ఫీచర్‌లు, టెక్నాలజీతో స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి వస్తున్నాయి. అయితే టెక్నాలజీతో ఎన్ని లాభాలున్నాయో, సుమారుగా అదే స్థాయిలో ప్రైవసీ సమస్యలు (Smartphone Privacy) కూడా ఉన్నాయి. అంటే సెర్చ్ ఇంజిన్‌ లో ఏదైనా వస్తువు కోసం మీరు సెర్చ్‌ చేస్తే.. అనంతరం మీ సోషల్‌ మీడియా ఖాతాల్లో ఆ వస్తువుకు సంబంధించిన యాడ్స్‌ కనిపిస్తుంటాయి.

మీ మాటలకు అనుగుణంగా :
ఇలాంటి అనుభవం మీకు ఎప్పుడైనా ఎదురైందా అంటే.. చాలా మంది అవును అదే సమాధానం ఇస్తుంటారు. దీంతోపాటు మీరు ఫోన్‌లో ఏదైనా అంశం కోసం మాట్లాడితే, ఆ వస్తువుకు సంబంధించిన యాడ్స్‌ను కూడా మీ బ్రౌజర్, సోషల్‌ మీడియా ఖాతాల్లో కనిపిస్తుంటాయి.

does your smartphone listening your words

మీ మాటలను స్మార్ట్‌ఫోన్‌ వింటోందా?
ఇలాంటి సందర్భాల్లో మీ మాటలను స్మార్ట్‌ఫోన్‌ వింటోందా.. అంటే అవును అనే సమాధానం వస్తోంది. దీంతో అనేక మంది ప్రైవసీ పై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇలాంటి పరిస్థితి ఆండ్రాయిడ్ ఫోన్‌లలో ఎక్కువగా కనిపిస్తుంది. గూగుల్‌ తీసుకొచ్చిన ప్రత్యేక ఫీచర్‌ ఇందుకు కారణమని తెలుస్తోంది.

సెట్సింగ్స్‌లో ఎలాంటి మార్పులు చేయాలి?
మీరు మాట్లాడిన మాటలు స్మార్ట్‌ఫోన్‌ వినకూడదు అంటే ఏం చేయాలి. ఇందు కోసం గూగుల్‌ సెట్టింగ్స్‌లో కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది. దీంతోపాటు కొత్త యాప్స్‌ను ఇన్‌స్టాల్‌ చేసే సమయంలో.. అనేక మంది కొన్ని తప్పులు చేస్తుంటారు.

కొన్ని యాప్స్‌ ఇన్‌స్టాల్‌ చేసే సమయంలో అనేక అనుమతులు అడుగుతుంటాయి. లొకేషన్‌, స్టోరేజీ సహా ఇతర అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే కొన్ని యాప్స్‌ మాత్రం అవసరం లేని యాక్సెస్‌ను అడుగుతుంటాయి. కాంటాక్ట్స్‌, లొకేషన్‌, కెమెరా, సహా మైక్రోఫోన్‌ వంటి అనుమతులు ఇచ్చే సమయంలో జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది.

స్మార్ట్‌ఫోన్‌లో కొన్ని యాప్స్‌ కోసం మైక్రోఫోన్‌ అనుమతి ఇస్తుంటాం. ఈ మైక్రోఫోన్‌ చాలా సంభాషణలను వింటుంది. ఫలితంగా అందుకు సంబంధించిన యాడ్స్‌ మనకు కనిపిస్తాయి. అయితే ఈ సెట్టింగ్స్‌లో మార్పులు చేసుకొనేందుకు ప్రస్తుతం అవకాశం ఉంది. దీంతోపాటు ప్రైవసీ పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

మీ స్మార్ట్‌ఫోన్‌ మీ ప్రైవేట్‌ సంభాషణ వినకూడదు అంటే ఏం చేయాలి?
- ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ సెట్సింగ్స్‌లోకి వెళ్లాలి.
- అనంతరం గూగుల్‌ ఆప్షన్‌ పైన క్లిక్‌ చేయాలి.
- అక్కడ 'Manage your Data and Privacy' పైన క్లిక్‌ చేయాలి.
- అనంతరం 'Web and App Activity' పైన క్లిక్‌ చేయాలి.
- అనంతరం Voice and audio activity ఆప్షన్‌ను గుర్తించాలి.
- ఈ ఆప్షన్ పైన అన్‌ టిక్‌ చేయాల్సి ఉంటుంది.

ఇలా గూగుల్ సెట్టింగ్స్‌ లో మార్పులు చేసుకుంటే మీ వ్యక్తిగత సంభాషణలను మీ స్మార్ట్‌ఫోన్‌ వినే అవకాశం ఉండదు. వ్యక్తిగత భద్రతపై మీరు ఎక్కువగా శ్రద్ధ చూపిస్తుంటే మాత్రం పైన చెప్పిన విధంగా గూగుల్ సెట్టింగ్స్‌లో మార్పులు చేసుకోవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
does your smartphone listening your words, these are the settings you need to change
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X