Home
How to

మీ స్మార్ట్‌ఫోన్‌ తరచూ వేడెక్కుతోందా.. కారణాలు ఏంటి.. ఎలా పరిష్కరించుకోవాలి..?

Smartphone Overheating : భారత్‌లో స్మార్ట్‌ఫోన్‌ వినియోగం గణనీయంగా పెరుగుతోంది. కాలింగ్‌, బ్రౌజింగ్, సోషల్‌ మీడియా సహా బ్యాంకింగ్ అవసరాల కోసం వినియోగించే వారి సంఖ్య పెరుగుతోంది. అయితే స్మార్ట్‌ఫోన్‌ వినియోగిస్తున్న సమయంలో తలెత్తే అనేక సమస్యలపై చాలా మంది యూజర్లకు అవగాహన ఉండడం లేదు. దీంతో ఫోన్‌ వేడెక్కినా ఆందోళన వ్యక్తం చేస్తుంటారు. అయితే స్మార్ట్‌ఫోన్‌ తరచూ ఎందుకు వేడెక్కుతుంటుంది. కారణాలు ఏంటి, పరిష్కారం ఏంటి..?

స్మార్ట్‌ఫోన్‌లు తరచూ వేడెక్కుతుంటాయి. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. వేసవి కాలంలో ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. ఫోన్‌ తరచూ వేడెక్కుతుంటే మాత్రం పరితీరుపై ప్రభావం చూపుతుంది. బ్యాటరీ కూడా త్వరగా డ్యామేజీ అవుతుంది. కొన్నిసార్లు ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది.

Smartphone overheating r

స్మార్ట్‌ఫోన్‌లు ఎందుకు వేడెక్కుతుంటాయి?
ఛార్జింగ్ సమయంలో ఫోన్‌ వేడెక్కుతుంటుంది. అయితే స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ అందించిన ఛార్జర్‌ కాకుండా ఇతర ఛార్జర్‌లను ఉపయోగిస్తుంటే.. ఫోన్‌ ఎక్కువ వేడెక్కుతుంది.

స్మార్ట్‌ఫోన్‌పై సూర్యకాంతి నేరుగా పడుతున్న సమయంలోనూ వేడెెక్కుతుంది. ముఖ్యంగా డెలివరీ ఏజెంట్స్‌ ఇలాంటి పరిస్థితలను ఎక్కువగా ఎదుర్కొంటారు. అనేక మంది వారి ఫోన్‌ను బైక్‌ హ్యాండిల్‌కు ఫిక్స్‌ చేస్తారు. నేవిగేషన్‌, కాల్స్‌ కోసం ఇలా చేస్తుంటారు. ఫలితంగా సూర్యకాంతి నేరుగా ఫోన్‌పై ప్రసరిస్తుంది. దీంతో ఫోన్ త్వరగా వేడెక్కుతుంది.

స్మార్ట్‌ఫోన్‌ వేడెక్కేందుకు స్క్రీన్ బ్రైట్‌నెస్‌ కూడా కారణం. ఫోన్‌లో అధిక బ్రైట్‌నెస్‌ ఎక్కువ ఛార్జింగ్‌ను ఉపయోగిస్తుంది. ఫలితంగా ఎక్కువ వేడి ఉత్పత్తి అవుతుంది. దీంతోపాటు ప్రాసెసర్‌ లోడ్‌ కూడా ఫోన్‌ వేడెక్కేందుకు కారణం. గేమింగ్‌, మల్టీ టాస్కింగ్‌ సమయంలో ప్రాసెసర్‌పై ఎక్కువ లోడ్ పడుతుంది. అలాంటి సమయాల్లోనూ ఫోన్‌ వేడెక్కుతుంది.

స్మార్ట్‌ఫోన్‌ను చాలా కాలంగా అప్‌డేట్‌ చేయకుండా ఉపయోగిస్తున్నప్పుడు కూడా వేడెక్కుతుంటుంది. దీంతోపాటు మాల్‌వేర్‌ ఉన్నా కూడా ఫోన్‌ వేడెక్కుతుంది. సరైన ఫోన్‌ కేస్‌ను ఎంపిక చేసుకోకున్నా.. ఫోన్ వేడెక్కేందుకు కారణం అవుతుంది.

Take a Poll

ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
* ఫోన్‌ ఛార్జింగ్ చేస్తున్న సందర్భం సహా ఇతర అన్ని సమయాల్లోను సూర్యకాంతి నేరుగా ఫోన్‌పై ప్రసరించకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి.

* కొంత మంది అధిక బ్రైట్‌నెస్‌తో ఫోన్‌ను ఉపయోగిస్తుంటారు. ఇలాంటి వారు ఆటో బ్రైట్‌నెస్‌ ఆప్షన్‌ను ఉపయోగించుకోవడం ద్వారా ఫోన్‌ వేడెక్కకుండా చూసుకోవచ్చు. లేదా మాన్యువల్‌ గాను బ్రైట్‌నెస్‌ను మేనేజ్‌ చేసుకోవచ్చు. వీలైనంత వరకు తక్కువ బ్రైట్‌నెస్‌తో ఫోన్‌ను ఉపయోగించాలి.

* స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలు అందించిన లేదా అనుమతించిన ఛార్జర్‌లను మాత్రమే ఉపయోగించాలి. దీని వల్ల ఛార్జింగ్‌ సమయంలో ఫోన్‌ వేడెక్కే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

* వివిధ అవసరాల కోసం ఫోన్‌లో అనేక యాప్స్‌ ఇన్‌స్టాల్‌ చేస్తుంటాం. అవసరం తీరాక వాటిని అన్‌ ఇన్‌స్టాల్‌ చేయడం మర్చిపోతుంటాం. ఇలాంటి యాప్‌ ఫోన్ ర్యామ్, స్టోరేజీపై ప్రభావం చూపుతాయి. ఫలితంగా ఫోన్‌ వేడెక్కుతుంది. మీకు అవసరం లేని యాప్స్‌ను ఫోన్‌ను డిలీట్‌ చేయాలి.

* స్మార్ట్‌ఫోన్‌ బ్లూటూత్‌, GPS వంటివి కూడా ఫోన్‌ వేడెక్కేందుకు కారణం. అందువల్ల అవసరం లేని సమయంలో వీటిని ఆఫ్‌ చేయాలి. మరియు స్మార్ట్‌ఫోన్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేస్తుండాలి. ఫలితంగా బగ్స్‌ వంటి సమస్యలు పరిష్కారం అవుతాయి.

* స్మార్ట్‌ఫోన్‌ను ఎక్కువ సమయం నుంచి ఉపయోగిస్తున్నా.. వేడెక్కుతుంది. ఇలాంటి సందర్భాల్లో స్మార్ట్‌ఫోన్‌ వినియోగానికి విరామం ఇవ్వాలి. మరియు ఫోన్ కేస్‌ తీసి వేస్తే, మరింత వేగంగా ఫోన్‌ చల్లబడుతుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Does your Smartphone overheating regularly here are the reasons and solutions
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X