స్మార్ట్‌ఫోన్ ఉపయోగిస్తున్నప్పుడు సడన్‌గా ఆగిపోతుందా.. ఇవే కారణాలు కావచ్చు..!
Smartphone Tips : స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగిస్తున్న సమయంలో కొన్ని సార్లు సడన్ గా పనిచేయడం ఆగిపోతుంటుంది. లేదా స్లో గా పనిచేస్తుంది. మల్టీ టాస్కింగ్, సినిమాలు చూస్తున్నప్పుడు లేదా గేమింగ్ సమయాల్లో ఇలా ఎక్కువగా జరుగుతుంటుంది. కొత్త ఫోన్‌లతో పోలిస్తే, పాత మోడల్స్‌లో ఎక్కువగా ఇటువంటి సమస్యను గుర్తించి ఉంటారు. అయితే చాలా మంది యూజర్లకు ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో అవగాహన ఉండడం లేదు.
* అప్‌డేట్స్ క్రమం తప్పకుండా ఇన్‌స్టాల్ చేసుకోవాలి :
స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలు కొన్ని సంవత్సరాల వరకు స్మార్ట్‌ఫోన్‌లకు ఆండ్రాయిడ్ OS సహా ఇతర అప్‌డేట్స్‌ను అందిస్తుంటాయి. ఈ అప్‌డేట్స్ ఇన్‌స్టాల్ చేసుకుంటే.. ఫోన్ సడన్ గా ఆగిపోవడం, స్లో కావడం, బగ్స్ వంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. దీంతోపాటు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను కూడా అందిస్తాయి. ఫోన్ భద్రత కోసం వీటిని కూడా తప్పకుండా ఇన్‌స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది.

* ఎక్కువ యాప్స్ ఒకేసారి ఉపయోగించడం వల్ల కూడా :
కొంత మంది యూజర్లు అనేక యాప్స్‌ను ఒకేసారి ఓపెన్ చేసి, ఉపయోగిస్తుంటారు. దీని కారణంగా స్మార్ట్‌ఫోన్ ప్రాసెసర్ పైన ఎక్కువ లోడ్ పడుతుంది. ఇలాంటి సందర్భాల్లోనూ ఫోన్ సడన్‌గా ఆగిపోయేందుకు అవకాశం ఉంది. ముఖ్యంగా ర్యామ్ తక్కువగా ఉండడం లేదా పాత ఫోన్‌లలో ఇలాంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.
* ఇలాంటి యాప్స్ వల్ల కూడా :
స్మార్ట్‌ఫోన్ యూజర్లు వివిధ అవసరాల కోసం యాప్స్‌ను ఇన్‌స్టాల్ చేస్తుంటారు. కొంత మంది ప్లే స్టోర్ నుంచి కాకుండా ఇతర ప్లాట్‌ఫాంల నుంచి యాప్స్‌ను యాప్స్‌ను డౌన్‌లోడ్ చేసుకొని ఇన్‌స్టాల్ చేస్తుంటారు. ఇలాంటి యాప్స్‌లో బగ్స్, మాల్‌వేర్ ఉండే అవకాశం ఉంటుంది. మాల్‌వేర్ కారణంగా ఫోన్ డేటా చోరీకి గురయ్యే అవకాశం ఉంటుంది.

ఇలాంటి యాప్స్ వల్ల ఫోన్ పనితీరు కూడా ప్రభావితం అవుతుంది. అంటే ఫోన్ బాగా స్లో గా పనిచేయడం లేదా ఉపయోగిస్తున్న సమయంలో సడన్‌గా ఆగిపోవడం వంటి సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అందువల్ల ఎప్పుడూ కూడా గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ స్టోర్ ద్వారా మాత్రమే యాప్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
* ఫోన్ క్యాచీ కూడా కారణమే :
స్మార్ట్‌ఫోన్ సడన్ గా పనిచేయడం ఆగిపోవడం లేదా స్లో గా పనిచేయడానికి ఫోన్‌లో Cache కూడా కారణం. అందువల్ల ఫోన్ Cache ని తరచూ డిలీట్ చేస్తుండాలి. ఫలితంగా మెమోరీ ఫ్రీ అవుతుంది. మరియు ఫోన్ సౌకర్యంగా పనిచేస్తుంది.
* ఓవర్ హీట్ కూడా :
కొంత మంది యూజర్లు ఫోన్ వేడెక్కుతున్నా, ఉపయోగిస్తునే ఉంటారు. అధిక ఉష్ణోగ్రత కారణంగా స్మార్ట్‌ఫోన్‌లోని అంతర్గత విభాగాలు డ్యామేజీ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఫలితంగా ఫోన్ స్లోగా పనిచేయడం లేదా సడన్‌గా నిలిచిపోవడం జరుగుతుంటుంది.
అందువల్ల ఫోన్ వేడెక్కుతున్న సమయంలో వినియోగానికి విరామం ఇవ్వాలి. ఛార్జింగ్ చేసే సమయాల్లోనూ ఫోన్ సాధారణంగా వేడెక్కుతుంటుంది. అయితే ఎక్కువగా వేడేక్కితే, ఫోన్ ఉష్ణోగ్రత సాధారణ స్థితికి చేరేంత వరకు ఛార్జింగ్‌ను నిలిపివేయాలి.


Click it and Unblock the Notifications








