Home
How to

మీ ఫోన్‌ స్లోగా పనిచేస్తుందా.. అయితే ఈ చిట్కాలు ఒకసారి ప్రయత్నం చేయండి..!

Smartphone Tips to Speedup : ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌ వినియోగం గణనీయంగా పెరిగింది. భారత్ కూడా స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థలకు అతి పెద్ద మార్కెట్‌ గా ఉంది. ప్రతి నెలలో వివిధ బ్రాండ్స్‌ నుంచి అనేక మోడల్స్‌ లాంచ్ అవుతున్నాయి. అయితే కొంత మంది వ్యక్తులు తరచూ ఫోన్‌లను మారుస్తుంటారు. అదే మరికొంత మంది ఒకే ఫోన్‌ను ఎక్కువ రోజులపాటు ఉపయోగిస్తుంటారు.

ఎక్కువ రోజులపాటు ఉపయోగిస్తుంటే కొన్నిసార్లు ఫోన్ (Smartphone) నెమ్మదిగా పనిచేసే అవకాశం ఉంటుంది. ఇలాంటి పరిస్థితి చాలా మంది యూజర్లు ఎదుర్కొని ఉంటారు. అయితే ఫోన్‌ ఎందుకు నెమ్మదిగా పనిచేస్తుందో అవగాహన ఉండదు. దీంతో ఆందోశన చెందుతుంటారు. అయితే చిన్న చిట్కాల ద్వారా ఫోన్‌ స్పీడ్‌ను పెంచుకొనేందుకు అవకాశం ఉంది.

Does Your smartphone working slow

స్మార్ట్‌ఫోన్‌ Cache :
స్మార్ట్‌ఫోన్‌లో యాప్స్‌ ఉపయోగిస్తున్నప్పుడు సాధారణంగా Cache క్రియేట్‌ అవుతుంది. ఎక్కువ రోజులపాటు క్యాచీ క్లియర్‌ చేయకుండా వదిలేయడం వల్ల ఫోన్‌ పనితీరు నెమ్మదిస్తుంది. అందువల్ల వీలున్నప్పుడల్లా యాప్‌ క్యాచీ క్లియర్‌ చేసుకోవాలి. దీని వల్ల ఫోన్‌ వేగం పెరుగుతుంది. సెట్టింగ్స్‌లోనూ మార్పులు చేసి అన్ని యాప్స్‌ క్యాచీ క్లియర్‌ అయ్యేలా చూడవచ్చు.

బ్యాగ్రౌండ్‌ యాప్స్‌ :
స్మార్ట్‌ఫోన్‌లో వివిధ అవసరాల కోసం అనేక యాప్స్‌ను ఇన్‌స్టాల్‌ చేస్తుంటాం. అయితే కొన్ని యాప్స్‌ బ్యాగ్రౌండ్‌లో పనిస్తుంటాయి. ఈ కారణంగా ఫోన్ నెమ్మదిస్తుంది. అందువల్ల బ్యాగ్రౌండ్‌ యాప్స్‌ను నియంత్రించాలి. దీంతోపాటు ఫోన్‌లో అవసరం లేని యాప్స్‌ను కూడా ఎప్పటికప్పుడు తొలగిస్తుండాలి.

ఫోన్‌లో అవసరాల కోసం కొన్ని యాప్స్‌ను ఉపయోగిస్తుంటాం. అయితే అవసరం తీరిపోయాక వాటిని అన్‌ఇన్‌స్టాల్‌ చేయడం మర్చిపోతుంటాం. ఇలాంటి యాప్స్‌ కూడా ఫోన్‌ ర్యామ్, స్టోరేజీపై ప్రభావం చూపుతాయి. అందువల్ల ఇలాంటి యాప్స్‌ ను ఎప్పటికప్పుడు డిలీట్‌ చేస్తుండాలి.

అప్‌డేట్స్‌ :
స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థలు.. హ్యాండ్‌సెట్ కొనుగోలు చేసి కొన్ని సంవత్సరాల వరకు ఆండ్రాయిడ్ OS, సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను అందిస్తుంటాయి. వాటిని ఎప్పటికప్పుడు ఇన్‌స్టాల్‌ చేసుకొని, ఫోన్‌ అప్‌ టూ డేట్‌గా ఉండేలా చూసుకోవాలి. కొన్నిసార్లు బగ్స్‌ సహా ఇతర టెక్నికల్‌ సమస్యల వల్ల స్మార్ట్‌ఫోన్‌ నెమ్మదిగా పనిచేస్తుంది.

అందువల్ల సెక్యూరిటీ అప్‌డేట్స్‌తోపాటు కొన్ని రకాల అప్‌డేట్స్‌ను స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలు అందిస్తుంటాయి. వాటిని ఇన్‌స్టాల్‌ చేసుకోవడం ద్వారా ఫోన్‌ స్పీడ్‌ ను పెంచుకొనేందుకు అవకాశం ఉంటుంది. ఈ అప్‌డేట్స్‌ కొన్నిసార్లు సైబర్‌ ప్రమాదాల నుంచి కూడా రక్షణ కల్పిస్తాయి. ఫోన్‌ అప్‌డేట్‌ ఆప్షన్‌ లో వచ్చే ఈ అప్‌డేట్స్‌ను తరచూ తనిఖీ చేస్తుండాలి.

బ్యాటరీ లెవల్స్ :
స్మార్ట్‌ఫోన్‌లో కొన్ని సెట్టింగ్స్‌ కూడా ఫోన్‌ నెమ్మదిగా పనిచేసేందుకు కారణం అవుతుంది. కొంత మంది యూజర్లు డిస్‌ప్లే బ్రైట్‌నెస్‌ను ఎక్కువగా ఉండేలా చూస్తారు. మరియు Always On Display ఫీచర్‌ను ఉపయోగిస్తుంటారు. దీని వల్ల ఫోన్‌ ప్రాసెసర్‌పై అధిక ప్రభావం పడుతుంది. ఈ కారణం వల్ల కూడా ఫోన్ నెమ్మదిగా పనిచేస్తుంది. అందువల్ల అవసరం లేని సమయాల్లో సాధారణ బ్రైట్‌నెస్‌ వద్ద ఉపయోగించుకోవడం ఉత్తమం.

Best Mobiles in India

English summary
Does Your smartphone working slow, here are the tips to speed up your handset
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X