Home
How to

వేసవిలో స్మార్ట్‌ఫోన్‌లు వేడెక్కుతున్నాయా.. ఇలాంటి జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి..?

స్మార్ట్‌ఫోన్‌ లు సాధారణంగా ఛార్జింగ్‌, ఎక్కువ సమయం వినియోగిస్తున్నప్పుడు వేడెక్కుతుంటాయి. వర్షాకాలం, శీతాకాలంతో పోలిస్తే వేసవి కాలంలో ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. స్మార్ట్‌ఫోన్‌ ఎక్కువ సార్లు వేడెక్కుతుంటే, బ్యాటరీ త్వరగా డ్యామేజీ అయ్యే అవకాశం ఉంటుంది. దీంతోపాటు ఎక్కువ సమయం కాలింగ్‌, గేమింగ్‌ కూడా ఫోన్‌ వేడెక్కేందుకు (Smartphones Over heat) కారణాలు. వేసవి కాలంలో స్మార్ట్‌ఫోన్ ఉపయోగించే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.

* సూర్యకాంతి నేరుగా పడకుండా చూడాలి :
సాధారణంగా ఫోన్‌లు ఛార్జింగ్‌ చేస్తున్నప్పుడు వేడెక్కుతుంటాయి. దీంతోపాటు స్మార్ట్‌ఫోన్‌లను నేరుగా సూర్యకాంతి పడే ప్రాంతంలో పెట్టినా త్వరగా వేడెక్కుతాయి. తరచూ వేడెక్కడం వల్ల ఫోన్ పనితీరుపై ప్రభావం పడుతుంది. ఫోన్‌పై నేరుగా సూర్యకాంతి పడని ప్రదేశంలో స్మార్ట్‌ఫోన్‌ను పెట్టాలి.

does your smartphone getting over heat in summer

* అవసరం లేని ఫీచర్‌లను ఆఫ్ చేయాలి :
స్మార్ట్‌ఫోన్‌ లో అనేక ఫీచర్‌లు ఉంటాయి. బ్లూటూత్‌, లొకేషన్‌, వైఫై, మొబైల్ డేటా వంటి ఫీచర్‌లను ఎల్లప్పుడు ఆన్‌ చేసి ఉంచకూడదు. ఇలా ఆన్‌ చేసి ఉంచడం వల్ల బ్యాటరీ త్వరగా డిశ్చార్జీ కానుంది. మరియు ఫోన్ కూడా త్వరలో వేడెక్కే అవకాశం ఉంది. ఈ ఫీచర్‌లను ఉపయోగించకుంటే.. ఆఫ్‌ చేసుకోవాలి.

* అదే పనిగా ఉపయోగించకూడదు :
స్మార్ట్‌ఫోన్‌ లో గేమింగ్‌, వీడియో స్ట్రీమింగ్‌ సమయంలో ఫోన్‌ అధికంగా వేడెక్కుతుంది. వేసవిలో ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఫోన్‌ వేడిగా ఉన్న సమయంలో అదే పనిగా వినియోగించకూడదు. ఫోన్‌ సాధారణ ఉష్ణోగ్రతకు వచ్చేంత వరకు వినియోగానికి దూరంగా ఉండాలి.

* వాటిని అన్‌ ఇన్‌స్టాల్‌ చేయాలి :
ఫోన్‌ వినియోగిస్తున్న సమయంలో అనేక యాప్స్‌ను ఇన్‌స్టాల్‌ చేస్తుంటాం. ఆ యాప్స్‌తో అవసరం పూర్తయ్యాక, వాటికి తొలగించడం మర్చిపోతుంటాం. ఇలాంటి యాప్స్‌ చాలా వరకు బ్యాగ్రౌండ్‌లో రన్ అవుతుంటాయి. ఫలితంగా బ్యాటరీ వేగంగా డిశ్ఛార్జి కావడం సహా ఫోన్‌ వేడెక్కుతుంటుంది. అందువల్ల అవసరం లేని యాప్స్‌ను వెంటనే తొలగించాలి.

* అదే ఛార్జర్‌ను ఉపయోగించాలి :
ఏదైనా సందర్భంలో ఫోన్‌ వేడెక్కితే.. త్వరగా చల్లగా మారేందుకు ఫోన్‌ కేస్‌ను వెంటనే తొలగించాలి. మరియు చల్లగా ఉండే ప్రాంతంలో ఫోన్‌ను కాసేపు ఉంచాలి. దీంతోపాటు స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు సమయంలో అందించిన ఛార్జర్‌ను మాత్రమే వినియోగించాలి. ఒక వేళ ఆ ఛార్జర్‌ డ్యామేజీ అయితే అదే సంస్థకు చెందిన ఛార్జర్‌ను కొనుగోలు చేసి, ఉపయోగించాలి.

స్మార్ట్‌ఫోన్‌ ను కొంత మంది రాత్రంతా ఛార్జింగ్‌ పెట్టి వదిలేస్తుంటారు. ఇలా చేయడం వల్ల ఫోన్ బ్యాటరీ త్వరగా డ్యామేజీ కానుంది. కొన్నిసార్లు ఫోన్‌ భారీగా వేడెక్కి, పేలిపోయే ప్రమాదం కూడా ఉంది. వేసవి కాలంలో ఫోన్‌లు పేలిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతోపాటు ఫోన్‌ను 80 శాతం వరకే ఛార్జింగ్ చేసే అలవాటు చేసుకోవాలి.

ఇతర కాలాలతో పోలిస్తే వేసవి కాలంలో స్మార్ట్‌ఫోన్‌ను జాగ్రత్తగా ఉపయోగించాలి. వాతావరణంలో వేడి, లేదా ఛార్జింగ్‌, వినియోగం సమయంలో అధికంగా వేడెక్కితే పేలిపోయేందుకు ప్రమాదం ఉంటుంది. లేదా బ్యాటరీ డ్యామేజీ అయ్యే అవకాశం ఉంటుంది.

Best Mobiles in India

English summary
does your smartphone getting over heat in summer here are the best tips
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X