Home
How to

Wi-Fi చాలా స్లో గా వస్తోందా.. వారికి కాల్‌ చేయడం కంటే ముందు ఇలా చేయండి!

ప్రస్తుతం అనేక మంది ఇళ్లలో వైఫై రూటర్లు (WiFi) వినియోగిస్తున్నారు. మీకు తెలిసో, తెలియకో చేసిన చిన్న పొరపాట్ల కారణంగా వైఫై స్పీడ్ చాలా తక్కువగా ఉంటుంది. అయితే ఇంటర్నెట్‌ స్పీడ్‌ తగ్గిన అనంతరం చాలా మంది వెంటనే వారి సర్వీస్‌ ప్రొవైడర్‌ కు కాల్‌ చేసి, ఫిర్యాదు చేస్తుంటారు. అయితే వైఫై రూటర్‌ స్థానంలో చిన్న మార్పులు చేయడం ద్వారా మీరు ప్లాన్‌కు అనుగుణంగా స్పీడ్‌ ను పొందుతారు.

వైఫై రూటర్‌ లొకేషన్ :
చాలా మందికి సరైన అవగాహన లేకపోవడంతో వైఫై రూటర్‌ ను ఇంట్లో ఒక మూలన ఏర్పాటు చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల వైఫై స్పీడ్‌ తక్కువగా వస్తుంది. అందువల్ల వైఫై రూటర్‌ ను ఇంటి మధ్యలో ఏర్పాటు చేసుకోవాలి. ఫలితంగా అన్ని గదులకు సమాన వేగంతో ఇంటర్నెట్‌ వస్తుంది.

Does Your Wifi Slow here are the basic steps

దీంతోపాటు వైఫై రూటర్ అమర్చిన స్థలానికి అడ్డుగా గోడలు లేదా ఇతర అడ్డంకులు లేకుండా చూడాలి. మిడ్‌ సైజ్‌ ఇంటికి సింగిల్‌ వైర్‌లెస్‌ రూటర్‌ సరిపోతుంది. అదే ఎక్కువ అంతస్తులు ఉన్న ఇళ్లకు మెష్‌ రూటర్లను ఉపయోగించుకోవచ్చు. ఇలా చేయడం కారణంగా స్పీడ్‌ అధికంగా ఉంటుంది.

వైఫై రూటర్‌ ఎత్తు :
కొంత మంది యూజర్లు వైఫై రూటర్లను తక్కువ ఎత్తులో ఏర్పాటు చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల కూడా స్పీడ్‌ తక్కువగా ఉంటుంది. అందువల్ల ఇంట్లో మధ్య భాగంలో ఉన్న ఎత్తైన గోడలు లేదా బుక్‌షెల్ఫ్‌ వద్ద ఏర్పాటు చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల వైఫై స్పీడ్‌ అధికంగా ఉంటుంది.

* అనేక మంది యూజర్లు వైఫై రూటర్లను టీవీలు, ఫ్రిజ్‌ లేదా ఇతర ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలకు సమీపంలో లేదా వెనుక భాగంలో ఏర్పాటు చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల వైఫై స్పీడ్‌ తక్కువగా ఉంటుంది. టీవీలు వంటి ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్.. వైఫై సంకేతాలకు అవరోధం కలిగించే అవకాశం ఉంది.

Does Your Wifi Slow here are the basic steps

అందువల్ల ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలకు దూరంగా వైఫై రూటర్లను అమర్చాలి. ఇలా చేస్తే మీ ప్లాన్‌ కు తగిన విధంగా వైఫై స్పీడ్‌ ను పొందుతారు. పరిమితికి మించి డివైజ్‌లను కనెక్ట్‌ చేస్తున్నా.. మీ వైఫై స్పీడ్‌ తగ్గుతుంది. అందువల్ల మీకు సంబంధం లేదని డివైజ్‌లను డిస్‌కనెక్ట్‌ చేయండి.

* వైఫై రూటర్‌ ను మెరుగైన పనితీరు, వేగం కోసం నిరంతరం అప్‌డేట్ చేస్తుండాలి. అప్‌డేట్ చేయడం ద్వారా సరైన భద్రతను పొందవచ్చు. కొంత మంది ఎక్కువ సంవత్సరాల నుంచి ఒకే రూటర్‌ ను ఉపయోగిస్తుంటారు. పాత రూటర్‌ కారణంగా కూడా వైఫై స్పీడ్‌ తక్కువగా వచ్చే అవకాశం ఉంది.

కొన్ని సందర్భాల్లో సడెన్‌గా వైఫై స్పీడ్‌ తగ్గుతుంది. అన్ని సక్రమంగా ఉన్నట్లు అనిపించినా, స్పీడ్ సడెన్‌ గా తగ్గుతుంది. అలాంటి సమయాల్లో వైఫై రూటర్‌ ను ఒక 30 సెకన్ల నుంచి నిమిషం వరకు ఆఫ్‌ చేయాలి. టెక్నికల్‌ సమస్యలు ఏమీ లేకపోతే, వైఫై సరైన వేగాన్ని పొందుతుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Does Your Wifi Slow here are the basic steps to get your normal internet speed
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X