Instagram లోని వీడియోలను స్మార్ట్‌ఫోన్‌లో డౌన్‌లోడ్ చేయడం ఎలా?

|

ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యక్తులు తమ ఇన్‌స్టాగ్రామ్‌లలో వేలాది వీడియోలు మరియు ఫోటోలను పోస్ట్ చేస్తూ ఉంటారు. కొన్ని కొన్ని సందర్భాలలో ప్రజలు కొన్ని వీడియోల మీద ఆసక్తిని పెంచుకుంటారు. అలాగే భవిష్యత్తులో వాటిని వారి యొక్క స్మార్ట్‌ఫోన్‌లలో చూడటానికి దాన్ని సేవ్ చేయాలనుకుంటున్నారు.

ఇన్‌స్టాగ్రామ్

మీరు ఇన్‌స్టాగ్రామ్ యొక్క పోస్ట్ లేదా స్టోరీస్ నుండి మీకు నచ్చిన ఏదైనా వీడియోను డౌన్‌లోడ్ చేసుకోవాలనుకుంటే వినియోగదారుల ఇన్‌స్టాగ్రామ్ యాప్ ను ఉపయోగించి రికార్డ్ చేసిన వారి స్వంత స్టోరీలను మాత్రమే సేవ్ చేయడానికి అనుమతిస్తుంది . ఏదేమైనా నిర్దిష్ట ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ నుండి వీడియో కంటెంట్‌ను సంగ్రహించి స్మార్ట్‌ఫోన్ లో సేవ్ చేయడానికి గల మార్గాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఇన్‌స్టాగ్రామ్‌ వీడియో డౌన్‌లోడ్

ఇన్‌స్టాగ్రామ్‌ వీడియో డౌన్‌లోడ్

ఇన్‌స్టాగ్రామ్‌లలో ఏదైనా వీడియో కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడానికి రెండు మార్గాలు ఉన్నాయి. వాటిలో ఒకటి ఆన్‌లైన్ వెబ్‌సైట్ టూల్స్ లను ఉపయోగించడం మరియు థైర్డ్ పార్టీ యాప్ లను ఉపయోగించడం. గోప్యత ఆందోళన కారణంగా థర్డ్ పార్టీ యాప్ ను ఉపయోగించడం ఉత్తమ పరిష్కారం కాదు కాబట్టి వెబ్ టూల్స్ ను ఉపయోగించడం చాలా మంచిది.

 

 

స్మార్ట్‌ఫోన్‌లో ఇన్‌స్టాగ్రామ్ వీడియోలను డౌన్‌లోడ్ చేయడం

స్మార్ట్‌ఫోన్‌లో ఇన్‌స్టాగ్రామ్ వీడియోలను డౌన్‌లోడ్ చేయడం

వినియోగదారులు ఇన్‌స్టాగ్రామ్ యొక్క వీడియోలను డౌన్‌లోడ్ చేయడానికి ప్రస్తుతం అనుమతించే అనేక వెబ్‌సైట్లు ఉన్నాయి. మీరు వాటిని గూగుల్ ద్వారా కూడా డౌన్‌లోడ్ చేయవచ్చు మరియు మీకు నచ్చిన వెబ్‌సైట్లను కూడా ఉపయోగించి డౌన్‌లోడ్ చేయవచ్చు.

*** మొదటగా మీ యొక్క స్మార్ట్‌ఫోన్‌లో ఇన్‌స్టాగ్రామ్ యాప్ ను ఓపెన్ చేయండి.

*** మీరు డౌన్‌లోడ్ చేయదలిచిన ఏదైనా వీడియో పోస్ట్ కోసం స్క్రోల్ చేయండి.


*** ఇప్పుడు పోస్ట్ యొక్క కుడివైపున గల మూలలో ఉన్న మూడు నిలువు చుక్కలపై నొక్కండి. అందులో గల కాపీ లింక్ ఎంపికను ఎంచుకోండి.


*** తరువాత వెబ్‌సైట్‌కు వెళ్లి లింక్‌ను పేస్ట్ చేసి డౌన్‌లోడ్ బటన్ మీద క్లిక్ చేయండి.


*** వెబ్ టూల్స్ ప్రైవేట్‌గా లేని అకౌంటుల నుండి వీడియోలను డౌన్‌లోడ్ చేయడానికి మాత్రమే అనుమతిస్తాయని గమనించండి.


***మీరు మీ స్మార్ట్‌ఫోన్‌లో ఏదైనా ఇన్‌స్టాగ్రామ్ వీడియో డౌన్‌లోడ్ యాప్ ను ఉపయోగించి డౌన్‌లోడ్ చేయాలనుకుంటే మాత్రం ప్లే స్టోర్‌కు వెళ్లి మీకు కావలసిన థర్డ్ పార్టీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న తరువాత డౌన్‌లోడ్ చేయడానికి పోస్ట్ లింక్‌ను అందులో పేస్ట్ చేయండి.

 

Best Mobiles in India

English summary
Download Instagram Videos on Smartphones Step by Step

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X