డ్యూయెల్ కెమెరా స్మార్ట్‌ఫోన్ వెంట పడే ముందు ఈ నిజాలు తెలుసుకోండి !

ఈ రోజుల్లో కెమెరాతో వచ్చే స్మార్ట్‌ఫోన్లు చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంటున్నాయి.కొత్త కొత్త ఫీచర్లతో కెమెరా రివల్యూషన్ రోజురోజుకు వేగంగా పరిగులు పెడుతోంది.

|

ఈ రోజుల్లో కెమెరాతో వచ్చే స్మార్ట్‌ఫోన్లు చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంటున్నాయి. కొత్త కొత్త ఫీచర్లతో కెమెరా రివల్యూషన్ రోజురోజుకు వేగంగా పరుగులు పెడుతోంది. మార్కెట్లోకి సింగిల్ కెమెరానుండి డ్యూయెల్ కెమెరా వైపు మొబైల్స్ పరిగెడుతున్నాయి. ఈ నేపధ్యంలోనే కంపెనీలు డ్యూయెల్ కెమెరాలతో స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేస్తున్నాయి. అయితే దాని వల్ల ఉపయోగాలు ఏంటి.. ప్రతి కూలతలు ఏంటీ అనే విషయం తెలియకుండానే చాలామంది డ్యూయెల్ కెమెరాల మీద తెగ ఆసక్తిని ప్రదర్శిస్తుంటారు. అయితే అలాంటి వారి కోసం డ్యూయెల్ కెమెరాను ఎందుకు వాడాలి, ఎందుకు వాడకూడదు అనేదానిపై కొన్ని కొన్ని నిజాలను అందిస్తున్నాం. ఓ స్మార్ట్ లుక్కేయండి.

కీబోర్డులో ALT కీ షార్ట్‌కట్‌ ద్వారా సింబల్స్ తెప్పించడం ఎలా, సీక్రెట్ ట్రిక్స్ మీకోసం !కీబోర్డులో ALT కీ షార్ట్‌కట్‌ ద్వారా సింబల్స్ తెప్పించడం ఎలా, సీక్రెట్ ట్రిక్స్ మీకోసం !

డ్యూయెల్ కెమెరా అంటే ఏంటి..?

డ్యూయెల్ కెమెరా అంటే ఏంటి..?

డ్యుయల్ కెమెరా ఫోన్ అంటే ముందు, వెనుకా ఫోన్ ఉన్నదని కాదు అర్థం. వెనుక లేదా ముందు భాగంలోనే రెండు కెమెరాలతో ఉన్న ఫోన్ అని అర్థం.అంటే రెండు లెన్స్, సెన్సార్ లున్న కెమెరాగా అర్థం చేసుకోవాలి. దీన్నే స్టీరియో ఫొటోగ్రఫీగా చెబుతుంటారు. ఈ రెండు కెమెరాలతో ఫోటోలు షార్ప్ నెస్, మరింత స్పష్టత, వివరాలతో క్లిక్ చేయవచ్చు.

సింగిల్ కెమెరా, డ్యూయెల్ కెమెరా తేడాలు

సింగిల్ కెమెరా, డ్యూయెల్ కెమెరా తేడాలు

ఒకే లెన్స్ ఉన్న కెమెరాతో తీస్తున్న ఫోటోలను గమనించి చూస్తే వాటిలో ఫేస్ లేదా ప్రధాన వస్తువు స్పష్టంగా ఉండడం, మిగిలిన భాగం స్పష్టంగా లేకపోవడాన్ని గుర్తించొచ్చు.అదే డ్యూయెల్ కెమెరాలో బైనాక్యులర్ తరహాలు మంచి క్వాలిటి ఫోటోలు తీయవచ్చు. రెండో కెమెరా కన్ను వల్ల స్పష్టత, ఫోటో తీసే ఏరియా పెరుగుతుంది.

రెండు కెమెరాలు ఎలా పనిచేస్తాయి
 

రెండు కెమెరాలు ఎలా పనిచేస్తాయి

మొదటి కెమెరా ఫోటోలు తీసే పనిని చూస్తుంది. ఇక రెండో కెమెరా స్పష్టతను పెంచేందుకు జూమ్ కోసం ఉపయోగపడేలా ఏర్పాటు ఉంటుంది. మొదటి కెమెరా చేయని పనులను రెండో కెమెరా చేస్తేంది. సింగిల్ రియర్ కెమెరాల్లో జూమ్ చేస్తే ఇమేజ్ క్వాలిటీ తగ్గుతుంది. కానీ, డ్యుయల్ కెమెరా ఫోన్లలో జూమ్ చేసినా పిక్చర్ క్వాలిటీ దెబ్బతినదు. డ్యుయల్ లెన్స్ లు ఉండడం వల్ల ఎక్కువ వెలుగును తీసుకుని వెలుగు తక్కువ ఉన్న చోట కూడా మంచి ఫొటోలు తీయడం సాధ్యమవుతుంది. షేక్ అవడం వల్ల ఇమేజ్ బ్లర్ అవుతుందన్న భయం ఉండదు.

 ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా..?

ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా..?

డ్యుయెల్ కెమెరా ఫోన్లు అధిక బ్యాటరీ శక్తిని వినియోగించుకుంటాయి. పైగా డ్యుయల్ కెమెరా ఫోన్ కు ఎక్కువ ధర వెచ్చించాల్సి ఉంటుంది. డ్యుయల్ కెమెరా ఫోన్లలో నాణ్యమైన కెమెరాలను ఏర్పాటు చేయకపోతే ఫోటోలు అంత మంచిగా రావు. డ్యుయల్ కెమెరాలతో తీసే ఫోటోలు ఎక్కువ స్పేస్ తీసుకుంటాయి. కనుక అధిక సామర్థ్యం ఉన్న బ్యాటరీ ఉండి ఉండాలి.

సామర్ధ్యం ఉన్నవి ఒకటి చాలు

సామర్ధ్యం ఉన్నవి ఒకటి చాలు

నాణ్యత లేని డ్యుయల్ కెమెరా ఫోన్ కు బదులు ఒక్క కెమెరా ఉన్నప్పటికీ మంచి సామర్థ్యం, నాణ్యత గల కెమెరా, రంగుల కచ్చితత్వం ఉన్న ఫోన్ తీసుకోవడం మంచిదన్నది నిపుణుల సూచన. ఎందుకంటే బ్యాటరీతో పాటు మిగతా ఫీచర్లు అంటే ర్యామ్, స్టోరేజ్ లాంటివి కూడా సేవ్ అయ్యే అవకాశం ఉంటుంది.

మార్కెట్లో ఏ ఫోన్లు ఉన్నాయి.

మార్కెట్లో ఏ ఫోన్లు ఉన్నాయి.

హెచ్ టీసీ ఎవో3డీ స్మార్ట్ ఫోన్ తొలి డ్యూయెల్ కెమెరా ఫోన్. ఆ తర్వాత చాల కంపెనీలు దీని మీద దృష్టి పెట్టాయి. హువాయి పీ9, ఎల్జీ జీ5, ఐఫోన్ 7ప్లస్, వివో వీ5 ప్లస్, లెనోవో వైబ్ ఎస్1, లెటెస్ట్ ఒప్పో మోడల్స్, వన్‌ప్లస్ మోడల్స్ అన్నీ డ్యూయెల్ కెమెరాలతో ఉన్నాయి. గెలాక్సీ ఎస్7, ఎస్7 ఎడ్జ్, గూగుల్ పిక్సల్, వన్‌ప్లస్ 3, ఎల్జీ జీ5, హెచ్ టీసీ 10 లాంటి ఫోన్లు అయితే తక్కువ వెలుగులోనూ మంచి ఫలితాలను ఇస్తాయి.

Best Mobiles in India

English summary
Dual cameras in smartphones: Everything you need to know More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X