Home
How to

యూట్యూబ్ ద్వారా డబ్బు సంపాదించండిలా! (సింపుల్ ట్రిక్స్)

By Sivanjaneyulu Bommu

ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక డబ్బులు సంపాదించేందుకు బోలెడన్ని ఆన్‌లైన్ మార్గాలు అందుబాటులోకి వచ్చేసాయి. వాటిలో యూట్యూబ్ ఒకటి.

యూట్యూబ్ ద్వారా డబ్బు సంపాదించండిలా! (సింపుల్ ట్రిక్స్)

Read More : మీరు స్మార్ట్‌ఫోన్ వాడుతున్నారా..? ఇవి తప్పనిసరిగా తెలుసుకోండి!

మీకు ఎక్కువ మంది ఆన్‌లైన్ ఫ్రెండ్స్ ఉన్నట్లయితే యూట్యూబ్ వీడియోల ద్వారా మీ సంపాదనను వేగవంతంగా పెంచుకోవచ్చు. యూట్యూబ్ ద్వారా మీరు కూడా డబ్బు సంపాదించాలనుకుంటున్నారా..? అయితే, ఈ గైడ్‌ఫాలో అవ్వండి...

ముందుగా మీ యూట్యూబ్ ఛానల్‌ను సెటప్ చేసుకోండి

ముందుగా మీ యూట్యూబ్ ఛానల్‌ను సెటప్ చేసుకోండి

ముందుగా మీ యూట్యూబ్ ఛానల్‌ను సెటప్ చేసుకోండి. ప్రతి యూట్యూబ్ అకౌంట్‌కు ఒక చానల్ అటాచ్ అయి ఉంటుంది. యూట్యూబ్ అకౌంట్ కూడా గూగుల్ అకౌంట్ లాంటిదే. మీరు యూట్యూబ్ అకౌంట్ ను క్రియేట్ చేయటం ద్వారా అన్ని గూగుల్ ప్రొడొక్ట్స్ లోకి మీకు యాక్సిస్ లభిస్తుంది.

అకౌంట్‌ను క్రియేట్ చేసిన తరువాత

అకౌంట్‌ను క్రియేట్ చేసిన తరువాత

మీ యూట్యూబ్ అకౌంట్‌ను క్రియేట్ చేసిన తరువాత మీ ఛానల్‌ను సులువుగా గుర్తించేందుకు ‘కీవర్డ్స్' (keywords)ను జత చేయండి. మీరిచ్చే keywords కంటెంట్‌కు సూట్ అయ్యేవిగా ఉండాలి.

యూజర్ నేమ్ చాలా సింపుల్‌గా ఉండాలి

యూజర్ నేమ్ చాలా సింపుల్‌గా ఉండాలి

మీ యూట్యూబ్ ఛానల్‌కు సంబంధించిన యూజర్ నేమ్ చాలా సింపుల్‌గా అదే సమయంలో సలువుగా గుర్తుంచుకునే విధంగా ఉండేలా చూసుకోండి.

హైక్వాలిటీ కంటెంట్‌కు ప్రాధాన్యతనివ్వండి..

హైక్వాలిటీ కంటెంట్‌కు ప్రాధాన్యతనివ్వండి..

మీ యూట్యూబ్ అకౌంట్‌లో హైక్వాలిటీ కంటెంట్‌ను అప్‌లోడ్ చేయటం ప్రారంభించండి.

 కంటెంట్ కొత్దదిగాను అదే సమయంలో ఆకర్షణీయంగా ఉండాలి

కంటెంట్ కొత్దదిగాను అదే సమయంలో ఆకర్షణీయంగా ఉండాలి

మీరిచ్చే కంటెంట్ కొత్దదిగాను అదే సమయంలో ఆకర్షణీయంగా ఉండాలి. వీడియోల చిత్రీకరణలో భాగంగా క్వాలిటీ కెమెరాలను వాడండి. కంటెంట్‌కు హైక్వాలిటీ ఎడిటింగ్ ఇంటా టెక్నిక్‌లను జోడించి మీ ఆడియన్స్‌ను ఆకట్టుకోండి.

కంటెంట్‌ను రెగ్యులర్‌గా అప్‌లోడ్ చేయాలి

కంటెంట్‌ను రెగ్యులర్‌గా అప్‌లోడ్ చేయాలి

కంటెంట్‌ను రెగ్యులర్‌గా అప్‌లోడ్ చేయటం వల్ల మీ ఆడియన్స్ సంఖ్య పెరుగుతూ వస్తుంది. కంటెంట్ అప్‌లోడ్‌లో భాగంగా ఓ షెడ్యుల్‌ను ఫాలో అవ్వండి.

వీడియోకు తగ్గట్టుగా కీవర్డ్స్‌ను ట్యాగ్ చేయాలి

వీడియోకు తగ్గట్టుగా కీవర్డ్స్‌ను ట్యాగ్ చేయాలి

వీడియోకు తగట్టుగా కీవర్డ్స్‌ను ట్యాగ్ చేయండి. ఇదే సమయంలో ఆ వీడియోకు సంబంధించి ఆకట్టుకునే వివరణను వీడియో క్రింద పోస్ట్ చేయండి.

 సోషల్ మీడియా ప్రమోషన్

సోషల్ మీడియా ప్రమోషన్

మీ యూట్యూబ్ కంటెంట్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఆడియన్స్‌లో మరింత ఆసక్తిని రేకెత్తించండి.

copyrighted కంటెంట్ ఉండకూడదు

copyrighted కంటెంట్ ఉండకూడదు

మీ యూట్యూబ్ వీడియోల ద్వారా డబ్బు సంపాదించే క్రమంలో monetizationను ఏనేబుల్ చేయవల్సి ఉంటుంది. ఇలా చేయటం వల్ల మీ వీడియాలలో యూట్యూబ్ వాణిజ్య ప్రకటనలను ప్లేస్ చేస్తుంది. ఇలా చేయాలంటే మీ వీడియోలలో ఏ విధమైన copyrighted కంటెంట్ ఉండకూడదు.

యాడ్ సెన్స్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి..

యాడ్ సెన్స్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి..

యాడ్ సెన్స్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి, మీ యూట్యూబ్ చానల్ అకౌంట్ పేరుతో ఓ అకౌంట్‌ను క్రియేట్ చేసుకోండి. అకౌంట్‌ను క్రియేట్ చేసే సమయంలో మీ వయసు 18 సంవత్సరాలకు మించి ఉండాలి. అలానే వాడుకులో ఉన్న మెయిల్ అడ్రస్‌‌తో కూడిన పేపాల్ లేదా బ్యాంక్ అకౌంట్ వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. యాడియన్స్ మీ వీడియోల పై ఏర్పాటు చేసిన యాడ్‌లసు క్లిక్ చేయటం ద్వారా లేదా చూడటం ద్వారా కొంత మొత్తం డబ్బు మీ అకౌంట్‌లో యాడ్ అవుతుంటుంది.

గూగుల్ ఆనాలిటిక్స్‌..

గూగుల్ ఆనాలిటిక్స్‌..

మీ ఛానెల్ మోనూలోని గూగుల్ ఆనాలిటిక్స్‌లోకి వెళ్లి మీ కంటెంట్ పనితీరును ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఫలితాలను మరింతగా మెరుగుపరుచుకునే క్రమంలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్రణాళికలను సెట్ చేసుకోండి.

యూట్యూబ్‌లో మాత్రమే కాదు...

యూట్యూబ్‌లో మాత్రమే కాదు...

మీ వీడియోలను కేవలం యూట్యూబ్‌లో మాత్రమే కాదు, బ్లాగ్ లేదా వెబ్ సైట్ ను క్రియేట్ చేసుకుని అక్కడ కూడా మీ వీడియోలను పోస్ట్ చేస్తూ మార్కెటింగ్ చేసుకోండి.

Best Mobiles in India

English summary
Earn Money on YouTube with these Simple Steps. Read More in Telugu Gizbot..
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X