Home
How to

Windows PC డివైస్ లో IP చిరునామాను కనుగొనడం ఎలా?

ప్రస్తుత సమయాలలో స్మార్ట్ వస్తువుల వినియోగం అధికంగా ఉంది. అంటే దాదాపుగా 10 మందిలో 8 మంది ఎదో ఒక స్మార్ట్ డివైస్ ను వాడుతున్నారు. అది స్మార్ట్ ఫోన్, లాప్టాప్, స్మార్ట్ వాచ్, డెస్క్ టాప్, మొబైల్ వంటివి చాలానే ఉన్నాయి. సాధారణంగా ఇంటర్నెట్‌ కోసం ఉపయోగించే వీటిని పొరపాటున ఎక్కడైనా పోగుట్టుకుంటే అప్పుడు ఎలా?? తక్కువ ధరను కలిగిన వాటి గురించి పట్టించుకోకపోవచ్చు కానీ అధిక ధర వద్ద ఇష్టపడి కొన్న వాటిని సాధారణంగా ఎవ్వరు వదలరు. అవి పోయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేయడం వంటివి చేస్తూ ఉంటారు. ఆలా చేసినప్పుడు వారు మీ యొక్క స్మార్ట్ డివైస్ యొక్క IP అడ్రస్ సాయంతో వాటిని ట్రాక్ చేస్తూ ఉంటారు.

Easy Way to Find Out Your IP Address on Windows PC Device

ఇంటర్నెట్‌కు కనెక్ట్ చేయబడిన చాలా డివైస్లు మీ యొక్క సిస్టమ్‌కు ఇచ్చిన పేరుతో గుర్తించవు. వారు సాధారణంగా IP చిరునామా అనే ప్రత్యేకమైన ఐడెంటిఫైయర్‌ను కేటాయిస్తారు. IP అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్. ఇంటర్నెట్‌కు అనుసంధానించబడిన ప్రతి డివైస్ కు ప్రత్యేకమైన వేరే వేరే IP చిరునామాను కేటాయించబడుతుంది. ఇది అనేక ఆందోళనలను మరియు నెట్‌వర్క్ సంబంధిత పనులను పరిష్కరించడానికి వీలు కల్పిస్తుంది. ఇంటర్నెట్‌కు కనెక్ట్ చేయబడిన మీ విండోస్ మెషీన్ యొక్క IP చిరునామాను ఎలా కనుగొనాలో అని ఆలోచిస్తున్నారా? కింద ఉన్న దశల వారీని అనుసరించి సులభంగా కనుగొనవచ్చు.

Easy Way to Find Out Your IP Address on Windows PC Device

మెథడ్ 1: గూగుల్ సెర్చ్ ను ఉపయోగించడం

IP చిరునామాను పొందడానికి అన్నిటికంటే సరళమైన విధానం గూగుల్ సెర్చ్ ను ఉపయోగించడం. గూగుల్ సెర్చ్ లోకి వెళ్లి 'వాట్స్ మై IP అడ్రస్' టైప్ చేయడంతో మీ యొక్క ఆండ్రాయిడ్ డివైస్ IP చిరునామాను పొందవచ్చు. Google సెర్చ్ లో నా IP ఏమిటో టైప్ చేయండి అది మీ IP చిరునామాను తిరిగి ఇస్తుంది.

మెథడ్ 2: విండోస్‌లో కమాండ్ ప్రాంప్ట్‌ను ఉపయోగించడం

విండోస్ మెషీన్‌లో CMD ను ఓపెన్ చేసి, 'ipconfig' అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. ఇది IP4 చిరునామా, సబ్‌నెట్ మాస్క్ మరియు డిఫాల్ట్ గేట్‌వే వంటి అనేక వివరాలను అందిస్తుంది. మీరు ఈథర్నెట్ అడాప్టర్ మరియు వైర్‌లెస్ LAN అడాప్టర్ Wi-Fi సమాచారాన్ని కూడా కనుగొంటారు.

Easy Way to Find Out Your IP Address on Windows PC Device

మెథడ్ 3: కనెక్ట్ చేయబడిన నెట్‌వర్క్ ప్రాపర్టీస్ లను ఉపయోగించడం

టాస్క్‌బార్ నుండి Wi-Fi నెట్‌వర్క్‌ను ఎంచుకోండి -> మీరు కనెక్ట్ చేసిన Wi-Fi నెట్‌వర్క్‌పై రైట్ క్లిక్ చేయండి -> ప్రాపర్టీస్

ప్రాపర్టీస్ కింద IPv4 చిరునామా పక్కన జాబితా చేయబడిన మీ IP చిరునామా కోసం చూడండి.

Best Mobiles in India

English summary
Easy Way to Find Out Your IP Address on Windows PC Device
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X