Home
How to

ఫొటోషాప్ యూజర్లకు పండగే.. క్రోమ్ ఎక్స్‌టెన్షన్‌తో ఏడాది పాటు ఫ్రీ యాక్సెస్.. ఈ ఆఫర్ ఎలా పొందాలో చూడండి!

Adobe Photoshop Chrome Extension సాధారణంగా ఫొటో ఎడిటింగ్ అంటేనే పెద్ద సాఫ్ట్‌వేర్లు, ఖరీదైన కంప్యూటర్లు కావాలని భావిస్తుంటాం. ఏదైనా చిన్న మార్పు చేయాలన్నా.. సాఫ్ట్‌వేర్ ఓపెన్ అయ్యే వరకు ఎదురుచూడాల్సి వచ్చేది. అయితే టెక్నాలజీలో అనేక మార్పులు వస్తున్నాయి. ఇప్పుడు బ్రౌజర్‌లోనే ప్రొఫెషనల్ ఎడిటింగ్ చేసుకునే రోజులు వచ్చేశాయి. ప్రముఖ ఎడిటింగ్ దిగ్గజం అడోబ్ (Adobe) సరికొత్త క్రోమ్ ఎక్స్‌టెన్షన్‌తో ఈ పని మరింత సులభం కానుంది.

అసలేంటి ఈ కొత్త ఎక్స్‌టెన్షన్?
అడోబ్ తాజాగా గూగుల్ క్రోమ్ కోసం ఒక ఎక్స్‌టెన్షన్‌ను విడుదల చేసింది. దీని ద్వారా మీరు ఫొటోషాప్ వెబ్ (Photoshop Web) వెర్షన్‌ను నేరుగా యాక్సెస్ చేయొచ్చు. అంటే, మీ కంప్యూటర్‌లో ఫోటోషాప్ సాఫ్ట్‌వేర్ ఓపెన్ చేయాల్సిన పని లేకుండానే, బ్రౌజర్‌లోనే ఆన్‌లైన్ ఇమేజ్‌లను ఎడిట్ చేసుకోవచ్చు.

Adobe Photoshop Chrome Extension

ప్రెజెంటేషన్లు, సోషల్ మీడియా పోస్టుల కోసం అర్జెంట్‌గా ఫోటోలను ఎడిట్ చేయాలనుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్. ఇది పూర్తి స్థాయి ఫొటోషాప్ సాఫ్ట్‌వేర్‌కు ప్రత్యామ్నాయం కాకపోయినా, చిన్న చిన్న పనులకు చాలా స్పీడ్‌గా పనిచేస్తుంది. తద్వారా చాలా సమయం ఆదా చేసుకోవచ్చు.

ఏడాది పాటు ఉచితం..
అడోబ్ ఇస్తున్న బంపర్ ఆఫర్ ఏంటంటే.. ఎవరైతే ఈ ఎక్స్‌టెన్షన్‌ను డిసెంబర్ 8వ తేదీ లోపు ఇన్‌స్టాల్ చేసుకుంటారో, వారికి ఫొటోషాప్ వెబ్ వెర్షన్‌కు 12 నెలల పాటు ఉచిత యాక్సెస్ లభిస్తుంది. పైసా ఖర్చు లేకుండా ఏడాది పాటు అడోబ్ ప్రీమియం టూల్స్‌ను వినియోగించుకోవచ్చు.

ఇన్‌స్టాలేషన్, ఎడిటింగ్ ప్రాసెస్
ముందుగా క్రోమ్ వెబ్ స్టోర్ కి వెళ్లి Adobe Photoshop ఎక్స్‌టెన్షన్‌ను మీ బ్రౌజర్‌కు యాడ్ చేసుకోండి. ఇన్‌స్టాల్ అయ్యాక, ఎడిటింగ్ చేయడం చాలా సులభం. మీరు ఇంటర్నెట్‌లో ఏదైనా ఇమేజ్‌ని ఎడిట్ చేయాలనుకుంటే, ఆ ఫోటోపై రైట్ క్లిక్ (Right Click) చేయండి.

మెనూలో మీకు కొత్తగా ఎడిట్ ఇన్ ఫోటోషాప్ (Edit in Photoshop) అనే ఆప్షన్ కనిపిస్తుంది. లేదా కొన్ని వెబ్‌సైట్లలో ఇమేజ్‌ పైనే చిన్న ఫొటోషాప్ ఐకాన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసినా చాలు, ఆ ఫోటో నేరుగా ఫొటోషాప్ వెబ్ ఇంటర్‌ఫేస్‌లో ఓపెన్ అవుతుంది.

అదిరిపోయే ఫీచర్లు.. ఒక్క క్లిక్‌తో..
ఈ ఎక్స్‌టెన్షన్ ద్వారా ఓపెన్ అయ్యే workspace చాలా పవర్ ఫుల్ టూల్స్ ఉన్నాయి. వాటిలో హైలైట్ ఫీచర్ బ్యాక్‌గ్రౌండ్ రిమూవల్. ఇది ఒక్క క్లిక్‌తో ఫోటో వెనుక ఉన్న బ్యాక్‌గ్రౌండ్‌ ను తొలగించి, సబ్జెక్ట్‌ ను క్లీన్‌గా కట్ చేస్తుంది. అలాగే ఫోటోలో బ్రైట్‌నెస్, కలర్, ఎక్స్‌పోజర్ వంటి వాటిని సరిచేసుకోవడానికి బేసిక్ టూల్స్ అందుబాటులో ఉంటాయి.

క్రాపింగ్ టూల్‌ కూడా అందించారు. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, యూట్యూబ్ వంటి ప్లాట్‌ఫామ్స్‌కు తగినట్లుగా ఫోటోను క్రాప్ చేసుకోవడానికి ఇందులో ప్రీసెట్స్ (Presets) కూడా ఉన్నాయి.

ఎడిటింగ్ పూర్తయ్యాక, ఫైల్ ట్రాన్స్‌ఫర్ నేరుగా అక్కడే ఎక్సపోర్ట్ (Export) లేదా డౌన్‌లోడ్ (Download) బటన్ నొక్కితే చాలు. ఎడిట్ చేసిన ఫోటో మీ కంప్యూటర్‌ లో సేవ్ అయిపోతుంది. ఇమేజ్ సెర్చ్‌ నుంచి, ఎడిట్ చేసి సేవ్ చేయడం వరకు అన్నీ క్రోమ్ బ్రౌజర్‌లోనే జరిగిపోతాయి.

ఎవరికి ఉపయోగం?
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, డిజిటల్ మార్కెటర్లు, స్టూడెంట్స్, మరియు బ్లాగర్లకు ఈ టూల్ ఒక వరమని చెప్పొచ్చు. అడోబ్ భవిష్యత్తులో ఇందులో మరిన్ని కొత్త ఫీచర్లు యాడ్ చేస్తామని చెబుతోంది. కాబట్టి, డిసెంబర్ 8 డెడ్‌లైన్ లోపు ఇన్‌స్టాల్ చేసుకుని, ఈ ఫ్రీ ఆఫర్‌ను సొంతం చేసుకోండి.

More from GizBot

Best Mobiles in India

English summary
Edit Images in Chrome with Adobe Photoshop’s New Extension and Get Free One-Year Access
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X