మీకు మెయిల్ అకౌంట్ ఉందా..? ఇవి తప్పక తెలుసుకోండి
సమాచారాన్ని షేర్ చేసుకునే క్రమంలో మనలో చాలా మంది Email అకౌంట్‌లను కలిగి ఉండటం విశేషం. అయితే, డేటా లీకేజ్ అనేది ప్రధానంగా ఈ-మెయిల్స్ హ్యాక్ అవటం ద్వారానే జరుగుతోందని పలు సంస్థలు హెచ్చరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మీ ఈమెయిల్ అకౌంట్‌ను సెక్యూర్‌గా ఉంచుకునేందుకు ముఖ్యమైన సూచనలు...
Read More : Opera బ్రౌజర్ ఎందుకంత బెస్ట్..?

టిప్ 1
శక్తివంతమైన పాస్‌వర్డ్‌లను సెట్ చేసి శక్తివంతమైన పాస్‌వర్డ్‌లను సెట్ చేసి వాటిని తరచూ మారుస్తూ ఉండటం ద్వారా ఈ ఈమెయిల్ అకౌంట్ లను పూర్తి సెక్యూర్ గా ఉంచుకోవచ్చు.

టిప్ 2
మీ మెయిల్ ఐడీని నమ్మకమైన వ్యక్తులకు మాత్రమే షేర్ చేయండి.

టిప్ 3
ఇతర వ్యక్తుల నుంచి వచ్చిన అటాచ్‌మెంట్స్, డౌన్‌లోడింగ్ ఫైల్స్‌ను ఓపెన్ చేసేముందు ఒకటికి రెండు సార్లు క్రాస్ చెక్ చేసుకోండి. వాటి పై ఓ నిర్థారణకు వచ్చాక మాత్రమే ఓపెన్ చేయండి.

టిప్ 4
స్పామ్ మెయిల్స్‌కు రిప్లై ఇవ్వకండి. వీటిలో ప్రమాదకర మాల్వేర్లు దాగి ఉండే అవకాశముంది.

టిప్ 5
వివిధ ఆఫర్లను ఎరవేసే మోసూపూరిత మెయిల్స్‌ను ఏ మాత్రం విశ్వసించకండి. అలాంటి మెయిల్స్ జోలికి వెళ్లొద్దు.

టిప్ 6
ఈమెయిల్ కంటెంట్ మానిటరింగ్ ఫీచర్‌ను ఉపయోగించుకోవటం ద్వారా మీకొచ్చే ప్రతి మెయిల్‌ను ఫిల్టర్ చేసుకోవచ్చు.

టిప్ 7
యాంటీ మాల్వేర్ ప్రోగ్రామ్‌లను ఇన్‌స్టాల్ చేసుకోవటం ద్వారా మీ అకౌంట్ కు త భద్రతను మరింతగా పెంచుకోవచ్చు.

టిప్ 8
ఈమెయిల్ దాడులను సమర్థవంతంగా ఎదుర్కొగిలగే సామర్థ్యం యాంటీ స్పామ్, యాంటీ వైరస్, కంటెంట్ ఫిల్టరింగ్ వంటి ఫీచర్లకు ఉంది. కాబట్టి మీ డివైస్‌లో ఇవి తప్పనిసరిగా ఉండాలి.


Click it and Unblock the Notifications








