Home
How to

Facebook లింక్‌ హిస్టరీ ఫీచర్‌ గురించి తెలుసా.. మీరు క్లిక్‌ చేసే లింక్స్‌ డేటా అంతా నిల్వ చేస్తుంది..!

ఫేస్‌బుక్‌.. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది వినియోగించే యాప్‌లో ఇది ఒకటి. భారత్‌లోనూ ఎక్కువ మంది ఫేస్‌బుక్‌ను (FaceBook) వినియోగిస్తున్నారు. గతంలో ఫేస్‌బుక్‌లో వ్యక్తిగత లేక ఇతర ఫోటోలు వీడియోలను మాత్రమే పోస్ట్‌ చేసేవారు. అయితే ప్రస్తుతం వ్యాపార ప్రకటనలు సహా ఇతర వాణిజ్య కలాపాలకు కూడా ఫేస్‌బుక్‌ను వినియోగిస్తున్నారు.

ఫేస్‌బుక్ లింక్ హిస్టరీ : అయితే మెటా నేతృత్వంలోని ఫేస్‌బుక్‌ వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా అనేక కొత్త ఫీచర్లను ఎప్పటికప్పుడు అందుబాటులోకి తీసుకొస్తుంది. అయితే ఈ ఫీచర్లలో లింక్‌ హిస్టరీ కూడా ఉంది. అయితే ఏంటీ లింక్ హిస్టరీ.. ఎలా పనిచేస్తుంది. వినియోగదారులకు ఉపయోగపడుతుందా లేక హాని చేస్తుందా వంటి వివరాలతో కూడిన పూర్తి కథనం మీకోసం.

Facebook launched link history feature

అనుమతిస్తే డేటా నిల్వ అవుతుంది : ప్రస్తుతం ఫేస్‌బుక్‌లో అనేక రకాలైన ప్రకటనలకు సంబంధించిన లింక్‌లు వస్తుంటాయి. ఇందులో అవసరమైనవి, అనవసరం రెండు ఉంటాయి. తెలిసి తెలియకుండా ఈ లింక్ పైన క్లిక్‌ చేస్తుంటాం. ఆ డేటా అంతా ఒకచోట భద్రపరచపడుతుంది. దీన్నే లింక్‌ హిస్టరీ అంటాం. ఇందులో వినియోగదారులు క్లిక్‌ చేసిన లింక్‌లు, వెబ్‌సైట్‌ వివరాలు వంటి డేటాను నిల్వ చేస్తుంది.

ఫీచర్‌ను ఆన్‌ లేదా ఆఫ్‌ చేయవచ్చు : ఆ కారణంగా పదేపదే వాటికి సంబంధించిన ప్రకటనలు మీకు కనిపిస్తుంటాయి. నిజానికి వినియోగదారుడు ఆసక్తి చూపే సమాచారాన్ని వీక్షించడానికి ఫేస్‌బుక్‌ ఈ ఫీచర్‌ను తీసుకొచ్చింది. అయితే ఈ ఫీచర్‌ను ఆన్‌ లేదా ఆఫ్‌ చేసే అవకాశం ఉంది. ఫలితంగా ఇందుకు సంబంధించిన యాడ్స్‌ను మనం నియంత్రించవచ్చు.

లింక్‌ హిస్టరీని ఎలా ఆఫ్‌ చేయాలి: ముందుగా వినియోగదారుడు తన ఫేస్‌బుక్‌ యాప్‌ అప్‌డేట్‌గా ఉందో లేదో చెక్‌ చేసుకోవాలి. అనంతరం యాప్‌ను కిందకు స్కోల్ చేయాలి. అక్కడ మీకు లింక్‌ హిస్టరీ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్‌ చేయాలి. అనుమతించమని ( Allow link history ) కోరుతుంది. అక్కడ క్లిక్ చేయడం ద్వారా సమాచారాన్ని చూడవచ్చు.

యాక్టివేట్ అయిన తర్వాత మీరు క్లిక్‌ చేసిన లింక్స్‌ అక్కడ కనిపిస్తాయి. అక్కడ మీ డేటాను చూడవచ్చు. సమాచారం నిల్వ చేయవద్దు అనిపిస్తే. అక్కడ రెండు ఆప్షన్లు కనిపిస్తాయి. ద్వాని ద్వారా ఆన్‌ లేదా ఆఫ్‌ చేసుకోవచ్చు. దాంతోపాటు పాత హిస్టరీని డిలీట్‌ చేయవచ్చు.

గత 30 రోజుల హిస్టరీని తొలగించవచ్చు. అందుకు కిందనే క్లియర్‌ హిస్టరీ అనే ఆప్షన్‌ కనిపిస్తుంది. దానిపైన క్లిక్‌ చేసి హిస్టరీని తొలగించవచ్చు. ఫలితంగా మీ ఫెస్‌బుక్‌ హిస్టరీ తొలగిపోవడం సహా మీకు అవసరం లేని యాడ్స్‌ వచ్చే అవకాశం ఇక ఉండదు.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌ సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Facebook introduced link history feature how does it works
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X