ఫేస్‌బుక్ ద్వారా మొబైల్ రీఛార్జ్, ఎలా చేయాలో తెలుసుకోండి

|

సోషల్ మీడియాలో దూసుకుపోతున్న దిగ్గజం ఫేస్‌బుక్ ఈ మధ్య అనేక విమర్శలను మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. యూజర్ల డేటాను అక్రమంగా కేంబ్రిడ్జ్‌ అనలిటికాకు షేర్‌చేసిందనే వార్తలతో ఫేస్‌బుక్ భారీ నష్టాలను చవిచూసి అనేక విమర్శలను మూటగట్టుకుంది. కాగా ఈ విమర్శలపై స్పందించిన ఫేస్‌బుక్‌ సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ క్షమాపణ కూడా చెప్పారు.అయితే ఇలాంటి ఆరోపణలు విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఫేస్‌బుక్ సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. సెక్యూరిటీకి అత్యంత పెద్ద పీట వేస్తామని చెబుతూ ఫేస్‌బుక్‌ తన ప్లాట్‌ఫామ్‌పై సరికొత్త ఫీచర్‌ను సైతం లాంచ్‌ చేసింది. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు తమ ఫేస్‌బుక్‌ ఖాతా నుంచే మొబైల్ నంబర్లకు రీఛార్జ్ చేసుకోవచ్చు.

 

శాంసంగ్ 20-20 కార్నివాల్, డిస్కౌంట్లు, ముంబై ఇండియన్స్‌ జెర్సీ మీ సొంతం !

టాప్‌లో కుడివైపు..

టాప్‌లో కుడివైపు..

ఫేస్‌బుక్‌ తీసుకొచ్చిన సరికొత్త ఫీచర్ ద్వారా ఇకపై యూజర్లు తమ ప్రీపెయిడ్‌ మొబైల్‌ నెంబర్‌కు రీఛార్జ్‌ చేసుకోవచ్చట. ఆండ్రాయిడ్‌ వెర్షన్‌ 167.0.0.42.94పై ఇప్పటికే ఈ ఫీచర్‌ స్పాట్‌ అయింది. టాప్‌లో కుడివైపు ‘మొబైల్‌ రీఛార్జ్‌' అనే ఆప్షన్‌ను ఆండ్రాయిడ్‌ యూజర్లకు కనిపిస్తుందని, ఒకవేళ అక్కడ కనిపించకపోతే, ‘సీ మోర్‌'లో ఈ ఫీచర్‌ ఉంటుందని తెలిపింది.

ట్యాప్‌ చేసిన అనంతరం..

ట్యాప్‌ చేసిన అనంతరం..

ఇలా ఈ ఆప్షన్లను ట్యాప్‌ చేసిన అనంతరం ఓ వెల్‌కమ్‌ స్క్రీన్‌ వస్తుంది. దానిలో ప్లాన్‌ను ఎంపిక చేసుకోండి, మీ డెబిట్‌ లేదా క్రెడిట్‌ కార్డు ద్వారా సెక్యుర్‌గా, ఫ్రీగా, చాలా వేగంగా చెల్లించుకోండి అనే సందేశం వస్తోంది.

ప్లాన్లను బ్రౌజ్‌ చేసుకునే ఆప్షన్‌..
 

ప్లాన్లను బ్రౌజ్‌ చేసుకునే ఆప్షన్‌..

‘రీఛార్జ్‌ నౌ' అనే దాన్ని ట్యాప్‌ చేస్తే, అది మీ నెంబర్‌, ఎంపిక చేసుకునే ఆపరేటర్‌, ప్లాన్లను బ్రౌజ్‌ చేసుకునే ఆప్షన్‌ అన్నీ ఉండే పేజీలోకి తీసుకెళ్తోంది. ఒక్కసారి నెంబర్‌ ఎంటర్‌ చేస్తే, ఫేస్‌బుకే ఆటోమేటిక్‌గా ఆపరేటర్‌ను ఎంపిక చేస్తుంది. ఒకవేళ సర్కిల్‌ మార్చాలనుకుంటే, ప్రస్తుత ఆపరేటర్‌ను ఎంపిక చేసుకోవాలి.

 ఓటీపీని లేదా 3డీ సెక్యుర్‌ పాస్‌వర్డ్‌ను..

ఓటీపీని లేదా 3డీ సెక్యుర్‌ పాస్‌వర్డ్‌ను..

ప్లాన్‌ ఎంపిక చేసుకుంటే, అది ఆర్డర్‌ వివరాలున్న పేజీలకి తీసుకెళ్తోంది. అక్కడ ఆర్డర్‌ వివరాలన్నీ నమోదుచేస్తే, యాప్‌ ద్వారా రీఛార్జ్‌ చేసుకోవడానికి ఓటీపీని లేదా 3డీ సెక్యుర్‌ పాస్‌వర్డ్‌ను అడుగుతోంది. ఇలా యూజర్లు మీ ప్రీపెయిడ్‌ మొబైల్‌ నెంబర్లకు ఫేస్‌బుక్‌ ద్వారా రీఛార్జ్‌ చేసుకోవచ్చు.

పలు ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్లలో..

పలు ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్లలో..

పలు ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్లలో ఈ ఫీచర్‌ స్పాట్‌ అయింది. కానీ ఆపిల్‌ ఐఫోన్లలో ఇంకా ఈ ఫీచర్‌ అందుబాటులోకి రాలేదు. అయితే ఈ ఫీచర్‌ కూడా ప్రస్తుతం ప్రీపెయిడ్‌ నెంబర్లకు మాత్రమే అందుబాటులోకి వచ్చింది.

పోస్టు పెయిడ్‌ బిల్లులను చెల్లించుకునే వీలులేదు.

పోస్టు పెయిడ్‌ బిల్లులను చెల్లించుకునే వీలులేదు.

గమనించాల్సిన విషయం ఏంటంటే పోస్టు పెయిడ్‌ బిల్లులను చెల్లించుకునే వీలులేదు. కేవలం డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల ద్వారా పేమెంట్‌ చేసుకోవచ్చు. నెట్‌బ్యాంకింగ్‌, యూపీఐ, లేదా ఇతర పేమెంట్‌ మార్గాలతో పేమెంట్లు చేసుకోవడానికి వీలులేదు.

వాట్సప్‌ కూడా రెండు నెలల క్రితమే..

వాట్సప్‌ కూడా రెండు నెలల క్రితమే..

ఫేస్‌బుక్‌ సొంతమైన వాట్సప్‌ కూడా రెండు నెలల క్రితమే తన ప్లాట్‌ఫామ్‌పై పేమెంట్‌ ఆప్షన్‌ను తీసుకొచ్చిన సంగతి విదితమే.

Most Read Articles
Best Mobiles in India

English summary
Facebook for Android Now Lets You Recharge Your Mobile Number: Here's How to Do It More news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X