ఫేస్‌బుక్ రీల్స్‌ 'ఛాలంజెస్' ద్వారా నెలకు రూ.3.6 లక్షలు సంపాదించవచ్చు!! కానీ

|

ఇండియాలో ఒకప్పుడు టిక్‌టాక్‌కి గల ప్రత్యేక ఆదరణను దృష్టిలో ఉంచుకొని దానికి ప్రత్యర్థిగా ఫేస్‌బుక్‌లో షార్ట్-వీడియో మేకింగ్ పేరుతో ఫేస్‌బుక్ రీల్స్‌లను ప్రారంభించింది. క్రియేటర్‌లు సృష్టించే ఒరిజినల్ కంటెంట్ తో నెలకు రూ.3.6 లక్షలకు పైగా సంపాదించడానికి అవకాశం ఇస్తున్నది. అలాగే రీల్స్ ప్లే బోనస్ ప్రోగ్రామ్‌లో క్రియేటర్‌లకు సహాయపడడానికి కంపెనీ కొత్తగా తన ప్లాట్‌ఫారమ్లో "ఛాలెంజెస్"ని పరిచయం చేస్తోంది.

 
ఫేస్‌బుక్ రీల్స్‌ 'ఛాలంజెస్' ద్వారా నెలకు రూ.3.6 లక్షలు సంపాదించవచ్చు!

"ఫేస్‌బుక్‌లోని రీల్స్‌లో అధిక నాణ్యతతో ఒరిజినల్ కంటెంట్‌ను రూపొందించే సృష్టికర్తలకు రివార్డ్ లు అందించడం లక్ష్యంగా పెట్టుకున్నాము అలాగే పేమెంట్స్ ఎలా లెక్కించబడతాయో మేము సర్దుబాటు చేస్తున్నాము. అలాగే ఫేస్‌బుక్‌లో "ఛాలంజెస్" అనేది రీల్స్ ప్లే బోనస్ ప్రోగ్రామ్‌లోని సృష్టికర్తలు తమ కంటెంట్ నుండి ఒక నిర్దిష్ట నెలలో $4,000 వరకు సంపాదించడానికి కొత్త మార్గాలను అన్‌లాక్ చేయడంలో సహాయపడే కొత్త ప్రోత్సాహకం" అని మెటా కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

ఛాలంజెస్ పనిచేసే విధానం

ఫేస్‌బుక్ రీల్స్‌ 'ఛాలంజెస్' ద్వారా నెలకు రూ.3.6 లక్షలు సంపాదించవచ్చు!

** ప్రోగ్రామ్‌లోని ప్రతి సృష్టికర్త ప్రతి నెలా వరుసగా సంచిత ఛాలంజెస్ సిరీస్ లో పాల్గొనగలుగుతారు. ఉదాహరణకు మీ రీల్స్‌లో 5 ఒక్కొక్కటి 100 ప్లేలను చేరుకున్నప్పుడు $20 సంపాదించవచ్చు.

** సృష్టికర్త ఒక ఛాలంజెను పూర్తి చేసినప్పుడు తదుపరి ఛాలెంజ్ అన్‌లాక్ అవుతుంది. ఉదాహరణకు ఒక సృష్టికర్త పైన ఉన్న 5 రీల్ ఛాలెంజ్ ను పూర్తి చేసినప్పుడు వారు తదుపరిదాన్ని చూస్తారు. మీ రీల్స్‌లో 20 వీడియోలు ఒక్కొక్కటి 500 ప్లేలను చేరుకున్నప్పుడు $100 సంపాదించవచ్చు.

** ప్రతి 30 రోజుల బోనస్ వ్యవధి ప్రారంభంలో ఛాలంజెస్ పై సృష్టికర్తల పురోగతి #1కి రీసెట్ చేయబడుతుంది.

ఫేస్‌బుక్ గత ఏడాది 150కి పైగా దేశాలలో రీల్స్ షార్ట్-వీడియో షేరింగ్ ఫీచర్‌ను ప్రకటించింది. మెటా సంస్థ ఫేస్‌బుక్‌లో రీల్స్ సృష్టికర్తల కోసం కొత్తగా ఎడిటింగ్ టూల్స్ లను కూడా ప్రకటించింది. జాబితాలో రీమిక్స్, డ్రాఫ్ట్‌లు మరియు వీడియో క్లిప్పింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఫేస్‌బుక్ రీల్స్‌ 'ఛాలంజెస్' ద్వారా నెలకు రూ.3.6 లక్షలు సంపాదించవచ్చు!

ఫేస్‌బుక్ యొక్క న్యూస్ ఫీడ్ ర్యాంకింగ్ అల్గారిథమ్‌లోని బగ్ వినియోగదారుల న్యూస్ ఫీడ్‌లో అకస్మాత్తుగా 'తప్పుడు సమాచారం'కి కారణమైందని ఇటీవల నివేదించబడింది. ది వెర్జ్ యొక్క అంతర్గత మెమో నివేదిక ప్రకారం ఫేస్‌బుక్ యొక్క న్యూస్ ఫీడ్ ర్యాంకింగ్ అల్గోరిథం నకిలీ వార్తలను పదేపదే షేర్ చేసే అకౌంటుల నుండి పోస్ట్‌లను అణిచివేసేందుకు బదులుగా వాటిని మరింత పంపిణీ చేసింది. ఇది ప్రపంచవ్యాప్తంగా 30 శాతం వరకు తప్పుడు సమాచారాన్ని కలిగి ఉన్న పోస్ట్‌ల వీక్షణల పెరుగుదలకు దారితీసింది.

Best Mobiles in India

English summary
Facebook Reels "Challenges" Given The Chance to Earn Rs.3.6 Lakh Per Month

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X