Facebook లోని వీడియోలను డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా?
ప్రముఖ సోషల్ మీడియా యాప్ ఫేస్‌బుక్ గురించి ప్రత్యేకంగా తెలపవలసిన అవసరం లేదు. వినియోగదారులు ఎవరైనా సరే తమ గురించి ప్రపంచానికి తెలియజేయడానికి ఉపయోగించే మొదటి సోషల్ మీడియా యాప్ ఏది అంటే ఫేస్‌బుక్ అని ప్రతి ఒక్కరు అంటారు. అయితే ఇందులో పోస్ట్ చేసే వీడియోలను డౌన్‌లోడ్ చేయడం మరియు యూట్యూబ్ వీడియోలను డౌన్‌లోడ్ చేయడం అంత సులభం కాదు. అయితే ఫేస్‌బుక్ లో పోస్ట్ చేసిన మరియు మీకు నచ్చిన వీడియోలను ఆఫ్‌లైన్‌లో వీక్షించడానికి వీడియోలను డౌన్‌లోడ్ చేసుకోవలసి ఉంటుంది. మీరు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్, ఐఫోన్, ఐప్యాడ్, మాక్ లేదా విండోస్‌లో ఫేస్‌బుక్ వీడియోలను డౌన్‌లోడ్ చేసుకోవాలనుకుంటే కింద ఉన్న సులభమైన పద్దతులను ఉపయోగించవలసి ఉంటుంది. అది ఎలాగో తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

విండోస్, మాక్‌లో ఫేస్‌బుక్ వీడియోలను డౌన్‌లోడ్ చేసే విధానం
ఫేస్‌బుక్ వీడియోలను డౌన్‌లోడ్ చేయడానికి ప్రస్తుతం ఇంటర్నెట్‌లో అనేక వెబ్‌సైట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో fbdown.net వెబ్‌సైట్ అందుబాటులో ఉన్న ఉత్తమ ఎంపికలలో ఒకటి.

- మొదట మీరు డెస్క్‌టాప్‌లో డౌన్‌లోడ్ చేయదలిచిన ఫేస్‌బుక్ వీడియోపై రైట్ క్లిక్ చేయండి.
- తరువాత వీడియో URL ను కాపీ చేయండి.
- తరువాత fbdown.net వెబ్‌సైట్‌కు వెళ్ళండి.
-మీరు అవసరమైన విభాగంలో లింక్‌ను పేస్ట్ చేయండి. తరువాత డౌన్‌లోడ్ ఎంపికపై క్లిక్ చేయండి. తరువాత SD లేదా HD నాణ్యతను ఎంచుకోండి.
-మీరు వీడియోపై రైట్ క్లిక్ చేసి మీ డెస్క్‌టాప్‌లో సేవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది.
Android లో ఫేస్‌బుక్ వీడియోలను డౌన్‌లోడ్ చేసే విధానం

-మీరు డౌన్‌లోడ్ చేసుకోవాలనుకుంటున్న ఫేస్‌బుక్ వీడియోను ఓపెన్ చేయండి.
-షేర్ ఎంపికపై క్లిక్ చేసి ఆపై కాపీ లింక్‌ను ఎంచుకోండి.
-తరువాత fbdown.net వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసి, అవసరమైన విభాగంలో లింక్‌ను పేస్ట్ చేసి డౌన్‌లోడ్ ఎంపికపై క్లిక్ చేయండి.
-మీరు ఫేస్‌బుక్ వీడియోను డౌన్‌లోడ్ చేసుకోవాలనుకుంటున్న వీడియో నాణ్యతను ఎంచుకోండి.
-తరువాత Chrome లో డౌన్‌లోడ్ లింక్‌ను ఎంచుకోండి, ఫైర్‌ఫాక్స్‌లో వీడియోను సేవ్ చేయండి.
-ఫేస్‌బుక్ వీడియో స్వయంచాలకంగా డౌన్‌లోడ్ల ఫోల్డర్‌లో సేవ్ చేయబడుతుంది.


Click it and Unblock the Notifications