Home
How to

మీ ఫోన్‌కు e-చలాన్ మెసేజ్ వచ్చిందా? పొరపాటున క్లిక్ చేస్తే మీ బ్యాంక్ ఖాతా ఖాళీ అవ్వొచ్చు!

పండుగల సేల్స్ హడావుడిలో ఫేక్ e‑చలాన్, mParivahan APK లింకుల మోసాలు విపరీతంగా పెరిగిపోయాయి. సైబర్ నేరగాళ్లు వాట్సాప్, ఎస్ఎమ్‌ఎస్‌ల ద్వారా దేశవ్యాప్తంగా ఈ స్కామ్ లింకులను పంపుతున్నారు. ఆండ్రాయిడ్ ఫోన్లలో 'యాక్సెసిబిలిటీ' అనుమతులను హ్యాక్ చేసి, ఓటీపీలను నొక్కేసే ప్రమాదకరమైన APK యాప్‌లను జనాలు డౌన్‌లోడ్ చేసుకునేలా చేస్తున్నారు. దీనివల్ల యూపీఐ ఖాతాలు ఖాళీ అవ్వడమే కాకుండా, వాట్సాప్ ఖాతాలు హ్యాకర్ల చేతికి చిక్కి ఇతరులకు కూడా ఈ లింకులు స్ప్రెడ్ అవుతున్నాయి. మీరు కూడా పొరపాటున ఏదైనా లింక్‌పై క్లిక్ చేసి ఉంటే.. వెంటనే అప్రమత్తమవ్వండి!

ఆర్‌టీఓ, ట్రాఫిక్ పోలీసులు లేదా బ్యాంకుల పేరుతో వచ్చే ఈ మెసేజ్‌లలో చలాన్ లేదా బిల్లుల బాకీ ఉందంటూ, వెంటనే చెల్లించకపోతే ముప్పేనని బెదిరిస్తుంటారు. ZIP లేదా APK ఫైళ్లు ఉండటం, షార్ట్ చేసిన లింకులు పంపడం, 'Unknown Sources' ఆన్ చేయమని కోరడం మోసానికి స్పష్టమైన సంకేతాలు. ఇవి యాక్సెసిబిలిటీ, నోటిఫికేషన్‌లు, SMS పర్మిషన్లను సొంతం చేసుకుంటాయి. నకిలీ "ఇన్‌వాయిస్" లేదా "బ్యాంక్ స్టేట్‌మెంట్" పేర్లతో వచ్చే ఫైళ్ల పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి.

Fake e-Challan and mParivahan APK Scam Alert: How to Protect Your Phone and UPI Account (2026)

ఫేక్ e‑చలాన్/mParivahan APK బారిన పడితే.. వెంటనే ఈ పనులు చేయండి

వెంటనే ఫోన్ ఇంటర్నెట్ బంద్ చేయండి లేదా ఏరోప్లేన్ మోడ్‌ను ఆన్ చేయండి. తెలియని యాప్‌లు, అనుమానాస్పద "Android Services"కి ఇచ్చిన యాక్సెసిబిలిటీ పర్మిషన్లను రద్దు చేయండి. ఇటీవల ఇన్ స్టాల్ చేసిన APK యాప్‌లను అన్ఇన్‌స్టాల్ చేయండి. ఒకవేళ డిలీట్ కాకపోతే, 'Device Admin' హక్కులను తీసేసి మళ్లీ ప్రయత్నించండి. ఫోన్‌ను 'సేఫ్ మోడ్' (Safe Mode)లో రీస్టార్ట్ చేసి అన్ఇన్‌స్టాల్ చేయడానికి ప్రయత్నించండి. గూగుల్ ప్లే ప్రొటెక్ట్ (Google Play Protect) స్కానింగ్ రన్ చేయండి. బ్రౌజర్లలో 'Install unknown apps' ఆప్షన్‌ను డిసేబుల్ చేయండి. ఇవన్నీ చేసినా సమస్య పరిష్కారం కాకపోతే, డేటాను బ్యాకప్ చేసుకుని ఫోన్‌ను 'ఫ్యాక్టరీ రీసెట్' చేయండి.

UPI సేఫ్టీ చెక్‌లిస్ట్: పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి!

సురక్షితమైన వేరే ఫోన్ ద్వారా మీ UPI యాప్‌ని ఓపెన్ చేసి వెంటనే UPI పిన్‌ మార్చండి. ఆటోపే (Autopay) ఆప్షన్‌ను డిసేబుల్ చేసి, అనుమానాస్పద మాండేట్‌లను రద్దు చేయండి. మీరు రిక్వెస్ట్ చేయని ఏ కలెక్ట్ రిక్వెస్ట్‌ను (Collect Request) అంగీకరించవద్దు. ముఖ్యంగా డబ్బులు మీ ఖాతాలోకి రావడానికి (డబ్బులు స్వీకరించడానికి) ఎప్పుడూ యూపీఐ పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదని గుర్తుంచుకోండి. గత 7 నుంచి 30 రోజుల లావాదేవీలను ఒకసారి సరిచూసుకోండి. ఏమైనా తేడా అనిపిస్తే వెంటనే మీ బ్యాంకుకి తెలియజేసి, ఖాతాను హోల్డ్‌లో పెట్టమని కోరండి. అలాగే ఫిర్యాదు సంఖ్యలను భద్రపరుచుకోండి.

వాట్సాప్ సెక్యూరిటీ, ఫోన్ భద్రతా నియమాలు

వాట్సాప్‌లో టూ-స్టెప్ వెరిఫికేషన్ (Two-step verification), పాస్‌కీల (Passkeys)ను వెంటనే ఆన్ చేసుకోండి. డివైజ్ లాగిన్ అలర్ట్‌లు, ఫింగర్‌ప్రింట్ లాక్‌ని యాక్టివేట్ చేయండి. 'Linked Devices' ఆప్షన్‌లోకి వెళ్లి తెలియని సెషన్‌లు ఉంటే 'Unlink' చేయండి. స్కామ్ లింకులు పంపే నంబర్లను బ్లాక్ చేసి రిపోర్ట్ చేయండి. మీడియా/డాక్యుమెంట్ల ఆటో-డౌన్‌లోడ్‌ను ఆఫ్ చేయండి. గూగుల్ ప్లే ప్రొటెక్ట్ ఎప్పుడూ ఆన్‌లో ఉండేలా చూసుకుంటూ, సిస్టమ్ అప్‌డేట్స్‌ ఎప్పటికప్పుడు చేసుకోండి. బయటి వెబ్‌సైట్ల నుంచి యాప్‌లను (Sideloading) డౌన్‌లోడ్ చేయకుండా, కేవలం గూగుల్ ప్లే స్టోర్ మాత్రమే ఉపయోగించండి.

సైబర్ మోసాలపై ఎక్కడ ఫిర్యాదు చేయాలి? చక్షు, 1930, బ్యాంక్ హెల్ప్‌లైన్లు

ఫిషింగ్ లేదా నకిలీ మెసేజ్‌లు వస్తే ట్రాయ్ (TRAI) కి చెందిన 'చక్షు' (Chakshu) పోర్టల్‌లో రిపోర్ట్ చేయండి. దీనివల్ల నకిలీ మెసేజ్‌లు పంపే వారిపై చర్యలు తీసుకోవడం సులువవుతుంది. ఒకవేళ మీ ఖాతా నుంచి డబ్బులు పోయినట్లయితే, ఆలస్యం చేయకుండా '1930' హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయండి. ఆ డబ్బులు నేరగాళ్ల ఖాతాకు చేరకుండా హోల్డ్ చేయడానికి ఇది సహాయపడుతుంది. లావాదేవీకి సంబంధించిన UTR నంబర్లతో నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్‌లో కూడా ఫిర్యాదు చేయండి. మీ బ్యాంక్ ఫ్రాడ్ డెస్క్‌కు సమాచారమిచ్చి ఖాతాను సురక్షితం చేసుకోండి. ఆధారాల కోసం నకిలీ మెసేజ్‌లు, కాల్ లాగ్‌లు, APK ఫైళ్లను డిలీట్ చేయకుండా సేవ్ చేసుకోండి.

ఏదైనా చలాన్ చెల్లించే ముందు అధికారిక వెబ్‌సైట్ లేదా ప్లే స్టోర్‌లోని అధికారిక యాప్‌లోనే వివరాలు సరిచూసుకోండి. బ్రౌజర్‌లు, మెసేజింగ్ యాప్‌లలో 'Install unknown apps' ఆప్షన్‌ను ఎప్పుడూ డిసేబుల్ (Off) చేసి ఉంచండి. నెలకోసారైనా ఫోన్ యాక్సెసిబిలిటీ పర్మిషన్లను చెక్ చేసుకోండి. ఈ ముఖ్యమైన సేఫ్టీ టిప్స్‌ను మీ ఫ్యామిలీ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి. మీరు తీసుకునే ఈ చిన్నపాటి జాగ్రత్తలే మీ యూపీఐ ఖాతాలను, వాట్సాప్‌ను భద్రంగా ఉంచి మోసాల నుంచి కాపాడుతాయి.

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X