ఫేక్ మొబైల్ చార్జర్ ను గుర్తించడం ఎలా ?

స్మార్ట్ ఫోన్స్ ఎక్కువ అవుతుండడంతో వాటి నకిలీ ఛార్జర్స్ కూడా మార్కెట్లో ఎక్కువ లభిస్తున్నాయి. ఇలాంటి నకిలీ ఛార్జర్స్ వల్ల ఫోన్ కే కాకుండా మనషుల ప్రాణాలుకి కూడా హాని కలుగుతుంది.

By Anil
|

స్మార్ట్ ఫోన్స్ ఎక్కువ అవుతుండడంతో వాటి నకిలీ ఛార్జర్స్ కూడా మార్కెట్లో ఎక్కువ లభిస్తున్నాయి. ఇలాంటి నకిలీ ఛార్జర్స్ వల్ల ఫోన్ కే కాకుండా మనషుల ప్రాణాలుకి కూడా హాని కలుగుతుంది.ప్రతి రోజు ఏదో ఒక చోట ఫోన్ పేలిన సంఘటనలు జరుగుతునే ఉన్నాయి దానికి ముఖ్య కారణం చార్జర్ లోపం వల్లే అయినా కూడా చాల మంది ఈ నకిలీ చార్జర్లనే కొనుగోలు చేసి వాడేస్తున్నారు . ఈ నకిలీ ఛార్జర్లులను తయారు చేసే కంపెనీలు కూడా ఒరిజినల్ చార్జర్ ఎలా ఉంటుందో అలానే తయారు చేసి మార్కెట్ లో అమ్మేస్తున్నారు దీంతో కొందరు అమాయక ప్రజలు నిజమైన చార్జర్ అనుకోని కొనుగోలు చేసి వారి ప్రాణాలు మీదకి తెచ్చుకుంటున్నారు. ఈ శీర్షిక లో భాగంగా మీరు వాడే మొబైల్ చార్జర్ నిజమైనధా లేక నకిలీదో తెలుపుతున్నాము. ఓ సారి చెక్ చేసుకోండి.

Apple చార్జర్

Apple చార్జర్

మీరు Apple చార్జర్ వాడే వారైతే చార్జర్ పైన ఉన్న కొన్ని పదాలు మరియు లోగో ద్వారా తెలుసుకోవచ్చు .ఒరిజినల్ చార్జర్ పైన ‘Designed by Apple in California' అని రాసి ఉంటుంది అలాగే ఆపిల్ యొక్క లోగో కూడా డార్క్ కలర్ లో ఉంటుంది. ఒక వేళా మీ చార్జర్ పై ఏ ఒక్కటి లేకపోయన అది నకిలీ చార్జర్ అని తెలుసుకోండి .

Samsung చార్జర్

Samsung చార్జర్

మీరు Samsung చార్జర్ వాడే వారైతే చార్జర్ పైన ఉన్న కొన్ని అక్షరాలు మరియు లోగో ద్వారా తెలుసుకోవచ్చు. మీ ఛార్జర్ నకిలీ అయినట్లయితే, అడాప్టర్ దానిపై 'A +' మరియు 'మేడ్ ఇన్ చైనా' అనే పదాలను కలిగి ఉంటుంది.

OnePlus చార్జర్

OnePlus చార్జర్

OnePlus దాని అత్యంత డాష్ ఛార్జర్తో వేగంగా ఛార్జింగ్ టెక్నాలజీల్లో ఒకటిగా పేరు పొందింది.మీరు ఎప్పుడు గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు OnePlusఅడాప్టర్ కు కనెక్ట్ చేసిన తర్వాత, మీ ఫోన్ బ్యాటరీ చిహ్నాన్ని ఒక ప్రామాణిక ఛార్జింగ్ చిహ్నంతో కాకుండా ఫ్లాష్ సింబల్ తో పాటు కలుపుతుంది.

Xiaomi Mi చార్జర్

Xiaomi Mi చార్జర్

Xiaomi Mi చార్జర్ నిజమైనదో లేక నకిలీధో చాలా సులువుగా తెలుసుకోవచ్చు . Mi చార్జర్ కేబుల్ యొక్క పొడవు ఐడెంటిఫైయర్లా పనిచేస్తుంది, ఎందుకంటే అసలు కేబుల్ 120cms కంటే ఎక్కువగా ఉంటుంది , ఇది చాలా పెద్ద అడాప్టర్ మాడ్యూల్ తో ఉంటుంది.

Huawei చార్జర్

Huawei చార్జర్

నకిలీ Huawei ఛార్జర్ ను గుర్తించేందుకు, చార్జర్ ఫై ఉన్న బార్ కోడ్ సమాచారాన్ని స్కాన్ చేసి, అడాప్టర్లో ముద్రించిన వివరాలతో సరిపోలుతుందో లేదో తనిఖీ చేయండి.అవి రెండూ అసలు చార్జర్ కి సమానంగా ఉంటాయి.

 

 

Google Pixel చార్జర్

Google Pixel చార్జర్

ఒక పిక్సెల్ స్మార్ట్ ఫోన్ ఛార్జర్ యొక్క వాస్తవికతను తనిఖీ చేయడానికి ఏకైక మార్గం ఒకటే ఫోన్ ని అడాప్టర్ కి కనెక్ట్ చేసినప్పుడు ఛార్జింగ్ చాల ఫాస్ట్ గా ఉంటుంది. Google దాని స్మార్ట్ ఫోన్లలో చాల వేగంగా ఛార్జింగ్ ని అందిస్తుంది ఒకవేళ ఛార్జర్ యూనిట్ నకిలీ అయినట్లయితే ఛార్జింగ్ స్పీడ్ నెమ్మదిగా ఉంటుంది.

 

 

 

Best Mobiles in India

English summary
Fake mobile chargers can be deadly, here’s how to identify them.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X