Home
How to

FASTAG ను వెంటనే అప్‌డేట్‌ చేయండి.. లేకుంటే జనవరి 31 తర్వాత డియాక్టివేట్‌ అవుతుంది..!

నేషనల్‌ హైవేస్‌ ఆథారిటీ ఆఫ్‌ ఇండియా (NHAI) .. సులభంగా టోల్ వసూలు చేసేందుకు ఫాస్ట్‌ట్యాగ్‌ పేరిట ఎలక్ట్రానిక్‌ సిస్టమ్‌ను గతంలోనే ఏర్పాటు చేసింది. ఈ విధానంతో తక్కువ సమయంలోనే టోల్‌ వసూలు అవుతుంది. ఫలితంగా వాహనదారులకు గంటల తరబడి క్యూలో ఉండాల్సిన అవసరం లేకుండా తక్కువ సమయంలోనే టోల్‌ చెల్లించవచ్చు. NHAI ఇటీవల 'వన్‌ వెహికల్‌ - వన్‌ ఫాస్ట్‌ట్యాగ్‌' కార్యక్రమాన్ని ప్రారంభించింది.

జనవరి 31 తర్వాత డియాక్టివేట్‌ : టోల్ వసూలు సామర్థ్యం పెంపు సహా ఫాస్ట్‌ట్యాగ్‌ దుర్వినియోగం కాకుండా చూడడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. అయితే ఆర్‌బీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా KYC పూర్తిచేయని ఖాతాలు జనవరి 31 తర్వాత డియాక్టివేట్‌ చేయబడతాయని NHAI వెల్లడించింది.

FASTAG KYC to be updated before 31 january 2024

వినియోగదారులు అంతా వెంటనే తమ ఫాస్ట్‌ట్యాగ్‌ KYC సమాచారాన్ని అప్‌డేట్‌ చేయాలని లేకుంటే.. ఫాస్ట్‌ట్యాగ్‌లో బ్యాలెన్స్‌ ఉన్నాగానీ అకౌంట్‌ డియాక్టివేట్‌ కానున్నాయని హెచ్చరించింది. ఇవాళే ఆఖరు తేదీ కనుక.. వాహనదారులు వెంటనే తమ ఫాస్ట్‌ట్యా్గ్‌ KYC అప్‌డేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు కావాల్సిన పత్రాలు సహా ప్రక్రియ కోసం ఈ ప్రత్యేక కథనం.

ఫాస్ట్‌ట్యాగ్‌ KYC కోసం ఏయే పత్రాలు అవసరం అంటే..
ఫాస్ట్‌ట్యాగ్‌ KYCను అప్‌డేట్‌ చేసే సమయంలో కొన్ని ముఖ్యమైన పత్రాలు దగ్గర పెట్టుకోవాల్సి ఉంటుంది. వాటిలోని వివరాలను అప్‌డేట్‌ సమయంలో నమోదు చేయాల్సి ఉంటుంది.
- వాహనదారుడి గుర్తింపు కార్డు
- వాహన రిజిస్ట్రేషన్‌ సర్టిఫికేట్‌ (RC)
- చిరునామాకు సంబంధించిన పత్రాలు
- పాస్‌పోర్ట్‌ సైజు ఫోటో

FASTAG KYC to be updated before 31 january 2024

ఫాస్ట్‌ట్యాగ్‌ KYC అప్‌డేట్‌ చేసే విధానం
Step 1 : FASTAG అధికారిక వెబ్‌సైట్‌ లోకి వెళ్లండి.
Step 2 : వెబ్‌సైట్‌లోకి వెళ్లిన తర్వాత రిజిస్టర్డ్‌ మొబైల్ నంబర్‌కు వచ్చిన OTP ద్వారా లాగిన్‌ అవ్వండి.
Step 3 : అక్కడ కనిపించే డ్యాష్‌బోర్డు మెనుపైన క్లిక్‌ చేయండి. అనంతరం KYC ట్యా్బ్‌ను ఎంచుకోండి.

Step 4 : KYC ట్యాబ్‌లో అవసరం అయిన సమాచారాన్ని నమోదు చేయండి. అనంతరం సమాచారాన్ని తనిఖీ చేసి, ద్రువీకరించండి. చివరగా సమర్పించు (Submit) పైన క్లిక్‌ చేయండి.
Step 5 : అప్పుడు మీ ఫాస్ట్‌ట్యాగ్‌ KYC అప్‌డేట్‌ పూర్తయినట్లు చూపిస్తుంది.

ఫాస్ట్‌ట్యాగ్‌ బ్యాలెన్స్‌ను ఎలా తనిఖీ చేయాలి :
వాహనదారులు తమ ఫాస్ట్‌ట్యాగ్‌ బ్యాలెన్స్‌ను ఆన్‌లైన్ ద్వారా తెలుసుకోవచ్చు. నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా యాప్‌, వివిధ పేమెంట్ యాప్‌ల ద్వారా కూడా మీ ఫాస్ట్‌ట్యాగ్‌ బ్యాలెన్స్‌ను తెలుసుకోవచ్చు. గూగుల్ ప్లే స్టోర్‌లో My Fastag యాప్‌ను డౌన్‌లోడ్‌ చేయాలి. అందులో లాగిన్‌ చేయండి. ఆ యాప్ ద్వారా ఫాస్ట్‌ట్యాగ్‌ బ్యాలెన్స్‌ను తనిఖీ చేయవచ్చు.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
how to Update FASTAG KYC through online and it is mandatory before 31 january 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X