అలెక్సా పరికరంలో భాషను మార్చడం ఎలా?

|

గూగుల్ సంస్థ ప్రస్తుతం తన గూగుల్ అసిస్టెంట్ కోసం హిందీ భాష మద్దతును విడుదల చేసింది. అమెజాన్ కూడా దీనిని అనుసరించింది. AI- ఆధారిత డిజిటల్ అసిస్టెంట్, అలెక్సాను హిందీ భాష నైపుణ్యాల మద్దతుతో పాటు హిందీని ప్రాధమిక భాషగా సమర్ధించింది. బహుళ భాషా మోడ్ విభాగం వినియోగదారులను హిందీ లేదా ఇంగ్లీషులో ఎకో పరికరాలతో సంభాషించడానికి అనుమతిస్తుంది.

అలెక్సా
 

కాబట్టి మీరు మీ అలెక్సా పరికరాలలో హిందీ భాషకు మద్దతును జోడించాలనుకుంటే దాని కోసం కింద ఉన్న దశల వారీ మార్గదర్శిని పరిశిలించండి.

Reliance Jio Queue Recharge...ఒకే సారి రెండు రీఛార్జిలకు అనుమతి

జాగ్రత్తలు

జాగ్రత్తలు

* ఎకో డివైస్ యొక్క విద్యుత్ సరఫరా కోసం ప్లగ్ చేయబడిందని నిర్ధారించుకోండి

* మీ యొక్క ఇంటిలో ఉన్న ఇంటర్నెట్ కనెక్టివిటీతో ఎకో డివైస్ ను అనుసంధానించాలి.

* అలెక్సా డివైస్ క్రియాశీల అమెజాన్ అకౌంట్ కు కనెక్ట్ అయిందని మొదటగా నిర్ధారించుకోండి.

Vodafone Long Term Plans ధరల పెంపుపై వోడాఫోన్ యూజర్లకు కొంత కాలం ఊరట

రెండు దశలు

-- హిందీ భాషా మద్దతును ప్రారంభించడానికి రెండు దశలు ఉన్నాయి. సరికొత్త సాఫ్ట్‌వేర్ అప్డేట్ తో ఎకో డివైసును అప్డేట్ చేయడం మరియు అలెక్సా యాప్ నుండి మొదటి భాష ఎంపికను మార్చడం.

--- అలెక్సా డివైస్లను అప్డేట్ చేయడం కోసం "అలెక్సా, సాఫ్ట్‌వేర్ అప్డేట్ ల కోసం తనిఖీ చేయండి" అని నేరుగా అలెక్సాను అడగవచ్చు. ప్రస్తుతం నా వద్ద తాజా సాఫ్ట్‌వేర్ ఉందా అని చెప్పడం చాలా సులభం. అలెక్సా ఆటోమ్యాటిక్ గా కొత్త అప్డేట్ కోసం తనిఖీ చేస్తుంది మరియు దానిని పరికరంలో ఇన్‌స్టాల్ చేస్తుంది.

ప్రక్రియ
 

1. సాఫ్ట్‌వేర్ అప్డేట్ ప్రక్రియ పూర్తయిన తర్వాత మీ స్మార్ట్‌ఫోన్‌లో అలెక్సా యాప్ ను ఓపెన్ చేయండి.

2. అప్పుడు యాప్ లో దిగువ బాగాన ఉన్న 'డివైస్లు' ట్యాబ్‌పై నొక్కండి.

3. మీరు భాషను మార్చాలనుకుంటే ఎకో డివైస్ మీద నొక్కండి.

4. ఇక్కడ భాష ఎంపికను ఎంచుకోండి. - హిందీ / ఇంగ్లీష్, ఇంగ్లీష్ / హిందీ లేదా హిందీ.

5. భాషను ఎంచుకోవడం పూర్తయిన తర్వాత ఎకో డివైస్ క్రొత్త భాషతో అప్డేట్ చేయబడుతుంది.

6. ఇప్పుడు మీరు 'బాలీవుడ్ కే లేటెస్ట్ గానా సునావో', ' క్రికెట్ స్కోరు బాటావో ', ' ఎసి చాలు కారో ' మొదలైనవాటిని అడగడం ద్వారా హిందీ బాషలో అలెక్సాతో సంభాషించవచ్చు.

ఇలా చేయడం మీకు కష్టంగా ఉంటే దీనికి ప్రత్యామ్నాయంగా "హిందీని సెటప్ చేయడంలో సహాయం చేయి" అని డివైస్ కు చెప్పడం ద్వారా మీరు అలెక్సాను హిందీని సెటప్ చేయమని అడగవచ్చు. అలా చేయడానికి అవసరమైన దశల ద్వారా అలెక్సా ఆటొమ్యాటిక్ గా మీకు మార్గనిర్దేశం చేస్తుంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Find The Details On How To Set Alexa In Hindi

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X