ఇంటర్నెట్‌లో మీరు క్లిక్ చేస్తున్న URL సురక్షితమో కాదో చెక్ చేయటం ఎలా..?

సోషల్ మీడియా వెబ్‌సైట్‌లలో సెర్చ్ చేస్తున్నప్పుడు మనకు ఇమేజెస్ లేదా కంటెంట్ క్రింద షార్ట్ లింక్స్ కినిపిస్తుంటాయి. వీటి పై క్లిక్ చేయటం ద్వారా నేరుగా ఆ కంటెంట్ పేజీలో ల్యాండ్ అవడం జరుగుతుంది. ఇక్కడి వరకు బాగానే ఉన్నప్పటికి, ఇటీవల కాలంలో పెరిగిపోయిన మాల్వేర్ దాడుల నేపథ్యంలో ఏ లింక్ సురక్షితమో, ఏ లింక్ ప్రమాదకరమో, గుర్తించలేకపోతున్నాం. ముఖ్యంగా షార్ట్ URL లింక్స్ విషయంలో ఈ గందరగోళం విపరీతంగా పెరిగిపోతోంది. షార్ట్ URL లింక్స్ వెనుక దాగి ఉన్న ఒరిజినల్ యూఆర్ఎల్ ఏంటనేది తెలుసుకునేందుకు కొన్ని టూల్స్ అలానే ఎక్స్‌టెన్షన్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిని వినియోగించుకోవటం ద్వారా మీ క్లిక్ చేస్తున్న URL మంచిదో కాదో తెలిసిపోతుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Unshorten.It

Unshorten.It అనేది ఒక బ్రౌజర్ ఎక్స్‌టెన్షన్, ఈ ఎక్స్‌టెన్షన్‌లో మీరు తెలుసుకోవాలనుకుంటున్న షార్ట్ యూఆర్ఎల్‌ను పేస్ట్ చేసినట్లయితే ఆ లింక్‌కు సంబంధించిన పేజీ డిస్‌ప్లే అవుతుంది, క్రోమ్ అలానే ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్‌లో ఈ ఎక్స్‌టెన్షన్ అందుబాటులో ఉంటుంది.

Unfurlr

Unfurlr అనేది ఒక వెబ్‌సైట్‌, ఈ సైట్‌లో మీరు షార్ట్ యూఆర్‌ఎల్‌ను పోస్ట్ చేసినట్లయితే ఒరిజినల్ యూఆర్‌ఎల్‌తో పాటు గూగుల్ సేఫ్ బ్రౌజింగ్ అడ్వైజరీ పేజీ పై డిస్‌ప్లే అవుతుంది.

URL X-ray

URL X-ray టూల్‌ను మీ బ్రౌజర్‌లో బుక్ మార్క్ టూల్ క్రింద ఉపయోగించుకోవచ్చు. యాపిల్ ఐఫోన్ యూజర్లు URL X-ray టూల్‌ను యాప్ క్రింద iOS స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ టూల్ షార్ట్ యూఆర్ఎల్‌ను స్కాన్ చేసి ఒరిజినల్ URLను మీకు చూపిస్తుంది.

URL Manager

URL Manager అనేది ఒక యాప్. ఆండ్రాయిడ్ యూజర్లు ఈ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి పొందవచ్చు. ఈ యాప్ షార్ట్ యూఆర్ఎల్‌ను స్కాన్ చేసి అది మంచిదో కాదో చెప్పేస్తుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

 

 

English summary
Find the orginal URL using these links without clicking on them. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot