చప్పట్ల ద్వారా పోయిన iphone కనుగొనగలమా ?

Posted By: ChaitanyaKumar ARK

గత 5సంవత్సరాలలో స్మార్ట్ ఫోన్లు నాటకీయంగా అభివృద్ది చెందుతూ మన జీవితాలలో ఒక భాగంగా మారిపోయాయి. ఒకవేళ మీరు వస్తువులను మర్చిపోయే గుణం కలిగిన వారైతే, కనపడనప్పుడు ఏం చేయగలరు? ఐఫోన్ కూడా స్మార్ట్ ఫోన్స్ లో ఒక భాగమే, కానీ చాలా ఖరీదుతో కూడుకున్నవి. కాసేపు కనపడకపోతే పరిస్థితులు నానా హంగామాకు దారితీస్తాయి. ఇలా మిస్ ప్లేస్ కు గురైన ఐఫోన్ ను సులభంగా గుర్తించడానికి,జైల్ బ్రేక్ ఐఫోన్ లలో సరికొత్త ఫీచర్ అందుబాటులో ఉంది. అదే CLAP. ఒకవేళ మీరు ఐఫోన్ ఎక్కడైనా మర్చిపోయిన యెడల, ఈ CLAP ఫీచర్ మీకు ఎంతో ఉపయోగపడుతుంది. మరియు మిమ్మల్ని స్మార్ట్ గా ఆలోచించేవారిలా చూపిస్తుంది. ఐఫోన్ పోయినప్పుడు మాత్రమే కాదు, మనం ఉన్న ప్రదేశాల్లోనే ఎక్కడో ఒక చోట ఫోన్ ఉంచి మరిచిపోతూ ఉంటాము. ఒక్కోసారి ఎంత ఆలోచించినా గుర్తుకు రాదు. అలాంటి సందర్భంలో ఈ CLAP ఫీచర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ క్లాప్ మీ ఇఫోన్ లో పొందడానికి చిన్న ఇన్స్టాలేషన్ ప్రక్రియ చేయవలసి ఉంటుంది. ఆండ్రాయిడ్ ఫోన్స్ కి రూటింగ్ వలె జైల్ బ్రేకింగ్ చేసిన ఐఫోన్ ఈ క్లాప్ కి అవసరం.

సెల్ఫీ స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్‌లో దూసుకొస్తున్న OPPO F7 , మార్చి26న ముహుర్తం

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఐఫోన్ బాటరీ లైఫ్ కాపాడుటకు..

ఈ క్లాప్, మీ ఐఫోన్ బాటరీ లైఫ్ కాపాడుటకు అనువుగా రూపొందించబడి ఉంటుంది. శబ్ధాల మద్య దూరాన్ని సెట్ చేయడం ద్వారా మైక్రోఫోన్ ద్వారా ఆ శబ్ధాలను ఎక్కువగా గ్రహించినప్పుడు ఈ క్లాప్ పనిచేస్తుంది. ఆ విధంగా అనువుగా ఉన్న శబ్ధాన్ని విన్నప్పుడు మీ ఐఫోన్ లో అలారం వినిపించేలా అమర్చబడి ఉంటుంది. తద్వారా మీ ఫోన్ ఎక్కడ ఉన్నది సులువుగా కనుగొనవచ్చు. ఈ క్లాప్ లో ముందుగానే సెటింగ్స్ లో అమర్పులు చేయబడి ఉంటుంది. మన అవసరానికి అనువుగా ఈ అమర్పులను మార్చుకునే వీలు కూడా ఉంటుంది. చార్జింగ్ సమయంలో ఈ అనువర్తనం పనిచేయకుండా డిసేబుల్ చేసుకునే వెసులుబాటు కూడా సెటింగ్స్ లో ఉంటుంది.

మైక్రోఫోన్ మరియు ఆక్సలరోమీటర్ సెటింగ్స్..

దీనిలో మైక్రోఫోన్ మరియు ఆక్సలరోమీటర్ సెటింగ్స్ కూడా మార్పులు చేసుకునే వీలు ఉంటుంది. తద్వారా మీకు అనువుగా ఈ అప్లికేషన్ లో అమర్పులు చేసుకోవచ్చు. కానీ ఒక అవగాహన తోనే సెటింగ్స్ లో మార్పులు చేయవలసి ఉంటుంది. ఈ క్లాప్ మంచి యూసర్ ఇంటర్ఫేస్ కలిగి ఉండడంవలన, వినియోగదారునికి మొబైల్ వెతికిపెట్టుట సులభతరం చేస్తుంది. అత్యద్భుతమైన ఈ అప్లికేషన్ ఐఫోన్ లో అతి తక్కువ మెమొరీని మాత్రమే తీసుకుంటుంది. కేవలం చప్పట్ల ద్వారా మీ ఐఫోన్ ఎక్కడ ఉందో తెలుసుకునే సౌలభ్యం నిజంగా అద్భుతమే.

మీ ఐఫోన్ జైల్ బ్రేక్ చేయండిలా :

Bigboss Repo నుండి $ 0.99 కి ఈ అప్లికేషన్ అందుబాటులో ఉంటుంది. ఈ ప్యాకేజీ iOS 8 నడుస్తున్న జైల్బ్రోకెన్ ఐఫోన్ లో మాత్రమే పనిచేస్తుంది.

మీ ఐఫోన్ జైల్ బ్రేక్ చేయండిలా :

ముందుగా చేయవలసినవి:
•మీ ఐఫోన్ లోని డేటా ను itunes, icloud వినియోగించి బాకప్ తీసుకోండి.

•మీ iphone లో ios 8.1.2 ఉండేలా చూసుకోండి. OTA ద్వారా అప్డేట్ చేసుకుని ఉంటే సరిచూసుకోండి.

•ఐఫోన్ లాక్ స్క్రీన్, టచ్ ఐడి లను ఆపివేయండి. Settings > General > Touch ID & Passcode >Turn Passcode Off.

•Find my ఐఫోన్ ఫీచర్ ను కూడా ఆపివేయండి.

 

 

జైల్ బ్రేక్ విధానం:

•మీ విండోస్ PC లో Taig V . 1.2.0 ను డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోండీ.

•మీ ఐఫోన్ ను USB ద్వారా కనెక్ట్ చేయండి.

•TaiG అప్లికేషన్ లో 3k అసిస్టెంట్ ను అన్ చెక్ చేయండి, cydia ని మాత్రమే చెక్ చేసి , స్టార్ట్ పై క్లిక్ చేయండి.

జైల్ బ్రేకింగ్ జరుగు సమయంలో మీ ఐఫోన్, ipa లేదా ipod టచ్ ను కదిలించవద్దు. ప్రాసెస్ మొత్తం పూర్తయ్యాక సరికొత్త Cydia వర్షన్ తో మీ ఐఫోన్ స్టార్ట్ అవుతుంది.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Find Your Lost iPhone By Simply Clapping Your Hands more news at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot