ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఎలా పనిచేస్తుంది..?

ఈ మధ్య లాంచ్ అవుతోన్న స్మార్ట్‌ఫోన్‌లలో ఫింగర్ ప్రింట్ స్కానర్ స్పెసిఫికేషన్‌ను ఎక్కువుగా వింటున్నాం. ఫింగర్‌ప్రింట్ స్కానర్ సపోర్ట్ ద్వారా ఫోన్‌కు అదనపు సెక్యూరిటీని కల్పించుకోవచ్చు. ఫింగర్ ప్రింట్ సెక్యూరిటీ సిస్టం అనేది వేలిముద్ర ఆధారంగా పనిచేస్తుంది.

Read More : దూసుకొస్తున్న జియో కేబుల్ టీవీ, ఆఫర్లే ఆఫర్లు..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫింగర్ ప్రింట్ స్కానర్స్ ఎన్ని రకాలు ఉన్నాయి?

ఫింగర్ ప్రింట్ స్కానర్ ఎనేబుల్ చేసి ఉన్న ఫోన్‌ను, ఫోన్ యజమాని తప్ప వేరొకరు యాక్సిస్ చేసుకునే వీలుండదు. ఫింగర్‌ప్రింట్ స్కానర్‌లనేవి ఒక్క స్మార్ట్‌ఫోన్‌లకు మాత్రమే పరిమితం కాదు, వివిధ చోట్ల వీటిని ఉపయోగించుకుంటున్నారు. ఫింగర్ ప్రింట్ స్కానర్స్ ఎన్ని రకాలు ఉన్నాయి? అవి ఎలా పనిచేస్తాయి..? ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

ఆప్టికల్ స్కానర్ (Optical scanner)

ఆప్టికల్ స్కానర్ పై మీ వేలి ముద్రను ఉంచిన వెంటనే స్కానర్ పై భాగంలో ఓ లైట్ వెలిగి మీ వేలి ముద్రను డిజిటల్ ఫోటోగ్రాఫ్ రూపంలో క్యాప్చుర్ చేస్తుంది. క్యాప్చుర్ కాబడిన ఫోటోను తదుపరి వెరిఫికేషన్ నిమిత్తం కంప్యూటర్‌లోకి చేరవేస్తుంది. ఈ ఆప్టికల్ స్కానర్‌లో నిక్షిప్తం చేసే లైట్-సెన్సిటివ్ మైక్రోచిప్ (అది సీసీడీ లేదా సీఎమ్ఓఎస్ ఇమేజ్ సెన్సార్ కావొచ్చు) యూజర్ వేలిముద్రకు సంబంధించిన డిజటల్ ఇమేజ్‌ను ప్రొడ్యూస్ చేయగలుగుతుంది. క్యాప్చుర్ కాబడిన ఫింగర్ ప్రింట్‌ను కంప్యూటర్ విశ్లేషించి ముందుగానే ఫీడ్ అయిన ఫింగర్ ప్రింట్‌తో సరిపోయిందో లేదో చెక్ చేసుకుని యాక్సిస్ కల్పిస్తుంది.

కెపాసిటివ్ స్కానర్ (Capacitive scanner)

ఆప్టికల్ స్కానర్‌తో పోలిస్తే కెపాసిటివ్ స్కానర్ అడ్వాన్సుడ్ టెక్నాలజీని కలిగి ఉంటుంది. ఈ ఫింగర్ ప్రింట్ స్కానింగ్ డివైస్‌లో కెపాసిటివ్ ప్రాక్సిమిటీ సెన్సార్స్తో పాటు మైక్రోకంప్యూటర్ ఇంకా సిగ్నల్ ప్రాసెసింగ్ సర్క్యూట్స్ ఉంటాయి. కెపాసిటివ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ముందుగానే వేలిముద్రను డిజిటల్ ఇమేజ్ రూపంలో స్టోర్ చేసుకుంటుంది. ఆ తరువాతి నుంచి ఫీడ్ అయిన డేటాతో ఫింగర్ ప్రింట్ మ్యాచ్ అయినపుడే లోపలికి యాక్సిస్ కల్పిస్తుంది.

అల్ట్రాసోనిక్ స్కానర్ (Ultrasonic scanner)

కెపాసిటివ్ స్కానర్‌తో పోలిస్తే అల్ట్రాసోనిక్ స్కానర్‌లు అడ్వాన్సుడ్ ఫింగర్ ప్రింట్ స్కానింగ్ టెక్నాలజీని కలిగి ఉంటాయి. క్వాల్కమ్ రూపొందించిన సెన్స్ ఐడీ టెక్నాలజీతో ఈ స్కానర్ పనిచేస్తుంది. అల్ట్రాసోనిక్ స్కానర్‌లో అల్ట్రాసోనిక్ ట్రాన్స్ మిటర్ అలానే రిసీవర్స్ ఉంటాయి. ఈ స్కానర్ పై వేలిముద్రను ఉంచినపుడు అల్ట్రాసోనిక్ పల్స్ వేలిముద్ర పై ట్రాన్స్ మిట్ అవుతుంది, ఇలా జరిగినపుడు పల్స్ గ్రహించబడి స్కానర్ వర్క్ అవటం జరుగుతుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Fingerprint scanners: How it works and what happens during a scan.Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot