జీమెయిల్ అకౌంట్ పాస్‌వర్డ్ మరచిపోయారా, ఇలా ప్రయత్నించండి
జీమెయిల్, ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి వాటిలో మనకు సంబంధించిన డేటా కోసం వాటికి పాస్‌వర్డ్ పెట్టుకుంటాము. అంతేకాకుండా స్మార్ట్‌ఫోన్, కంప్యూటర్ వంటి వాటికి కూడా పాస్‌వర్డ్‌ను పెట్టుకుంటాము.
జీమెయిల్, ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి వాటిలో మనకు సంబంధించిన డేటా కోసం వాటికి పాస్‌వర్డ్ పెట్టుకుంటాము. అంతేకాకుండా స్మార్ట్‌ఫోన్, కంప్యూటర్ వంటి వాటికి కూడా పాస్‌వర్డ్‌ను పెట్టుకుంటాము. ఇంతవరకూ బాగానే ఉంది కానీ ఒకవేళ ఆ పాస్‌వర్డ్ మరిచిపోతే... గుర్తు తెచ్చుకోవడానికి నానా తిప్పలు పడాల్సిందే. దానికి ఏం పాస్‌వర్డ్ పెట్టామో తెలియక శత విధాలుగా ప్రయత్నించి అలసిపోతాము. ముఖ్యమైన డైటా సమాచారం అర్జంటుగా కావాల్సి వస్తే ఇక అంతే సంగతులు. అయితే జీమెయిల్ అకౌంట్ పాస్‌వర్డ్ మరచిపోతే రికవరీ చేయలేమా అనే సందేహం అందరికీ రావచ్చు. దీనికి సమాధానంగా ఈ క్రింది పద్దతుల ద్వారా మరచిపోయిన పాస్‌వర్డ్ వివరాలను మనం తిరిగి మార్చుకోవచ్చు అని చెబుతాము. అదెలాగో ఓ సారి చూడండి.

స్టెప్ 1
గూగుల్ లాగిన్ పేజీలోకి వెళ్లి Forgot password అనే ఆప్సన్ మీద క్లిక్ చేయండి.

స్టెప్ 2
అక్కడ మీరు లాస్ట్ టైం మీరు ఇచ్చిన passwordని ఎంటర్ చేయండి. అది గుర్తు లేకపోతే అక్కడ కనిపించే Try another way ఆప్సన్ క్లిక్ చేయండి.

స్టెప్ 3
అది ఎంటర్ చేయగానే గూగుల్ వెరిఫికేషన్ నోటిఫికేషన్ ని మీ గూగుల్ అకౌంటుకి లింక్ అయిన మొబైల్ నంబర్ కి పంపాలా అని అడుగుతుంది.

స్టెప్ 4
ఒక వేళ మీ ఫోన్ నంబర్ అందుబాటులో లేకుంటే ఆ నోటిఫికేషన్లను మీరు ఇచ్చిన ఇతర జీమెయిల్ అకౌంటుకి పంపిస్తుంది. ఆ మెయిల్ ఐడీ కూడా లేకుంటే అక్కడ మీకు కనిపించే Try another way ని క్లిక్ చేయండి.

స్టెప్ 5
అక్కడ మీకు గూగుల్ నోటిఫికేషన్ ను పంపేందుకు మెయిల్ ఐడిని అడుగుతుంది. ఆ మెయిల్ ఐడిని మీరు ఎంటర్ చేస్తే వెరిఫికేషన్ కోడ్ ని ఆ జీమయిల్ అకౌంటుకి పంపిస్తుంది.

స్టెప్ 6
ఆ నోటిఫికేషన్ రాగానే అందులో కనిపించే వివరాలను జీమెయిల్ లాగిన్ అకౌంట్ లాగిన్ దగ్గర బాక్సులో నింపాలి. అది పూర్తయిన తరువాత మీ అకౌంట్ యాక్సెస్ చేయబడుతుంది.

సేవ్ పాస్ వర్డ్
మీరు మీ పర్సనల్ డివైస్ లో ఈ లాగిన్ వివరాలు ఎవరికీ కంట కనపడకుండా సేవ్ చేసుకోవడం మంచిది. అన్నీ గుర్తు పెట్టుకోవాలంటే ఒక్కోసారి చాలా కష్టతరమవుతుంది. ఇందుకోసం ధర్డ్ పార్టీ యాప్స్ కూడా ఉపయోగించుకోవచ్చు.


Click it and Unblock the Notifications








