సామ్‌సంగ్ ఫోన్‌లతో జాగ్రత్త..?

క్రిందటి ఏడాది వరకు సంచలనాలతో చెలరేగిపోయిన సామ్‌సం‌గ్‌కు ఈ ఏడాది పెద్దగా కలిసొచ్చినట్లు లేదు. గెలాక్సీ నోట్ 7 ఫెయిల్యుర్ కారణంగా వేల కోట్లు నష్టపోయిన సామ్‌‌సంగ్‌కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. గెలాక్సీ నోట్ 7 మిగల్చిన చేదు అనుభవాన్ని మరవక ముందే సామ్‌సంగ్‌కు గెలాక్సీ జే5 రూపంలో మరో షాక్ తగిలింది. ఫ్రాన్స్ దేశంలోని పావ్ నగరంలో గెలాక్సీ జే5 స్మార్ట్‌ఫోన్ పేలినట్లు సోషల్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

Read More : రూ.2000 నోట్లలో జీపీఎస్ చిప్స్, ఎంత వరకు నిజం..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

పొగలు వ్యాపించి కొద్ది నిమిషాల్లోనే..

ఫ్రాన్స్ దేశంలోని పావ్ నగరంలో గెలాక్సీ జే5 స్మార్ట్‌ఫోన్ పేలినట్లు సోషల్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. లమ్యా బౌయిర్డెన్ అనే మహిళకు చెందిన గెలాక్సీ జే5 ఫోన్ నుంచి పొగలు వ్యాపించి కొద్ది నిమిషాల్లోనే అది పేలుడుకు గురైనట్లు తెలుస్తోంది.

మీ సామ్‌సంగ్ ఫోన్‌ సేఫ్‌గా ఉండాలంటే..?

సామ్‌సంగ్ ఫోన్‌లను బ్యాటరీ ఫెయ్యిలుర్స్ చుట్టిముట్టిన నేపథ్యంలో మీ చేతులోని సామ్‌సంగ్ ఫోన్‌ను సేఫ్‌గా ఉంచుకునేందుకు పలు సూచనలు..

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

బ్యాటరీలు బ్లాస్ట్ అవటానికి ప్రధాన కారణం

బ్యాటరీలు బ్లాస్ట్ అవటానికి ప్రధాన కారణం అవి హీటెక్కటమే. మీరు ఫోన్ వాడుతున్నప్పుడుగాని, ఛార్జింగ్‌లో ఉంచినప్పుడు గాని ఫోన్ అమితంగా హీటెక్కుతున్నట్లయితే ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే బ్యాటరీనీ రీప్లేస్ చేయవల్సి ఉంటుంది.

కండీషన్‌లో ఉందో, లేదో..?

మీ సామ్‌సంగ్ ఫోన్‌ బ్యాటరీ మంచి కండీషన్‌లో ఉందో, లేదో..? తెలుసుకోవడానికి స్పిన్ టెస్ట్‌ను నిర్వహించండి. ముందుగా మీ బ్యాటరీ చదునైన నేల పై ఉంచి బొంగరంలో తిప్పండి. బ్యాటరీ చాలా సులువుగా తిరుగుతున్నట్లయితే ఖచ్చితంగా బ్యాటరీ ఉబ్బినట్లే. ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే బ్యాటరీనీ రీప్లేస్ చేయవల్సి ఉంటుంది.

బ్బి ఉన్న బ్యాటరీని వాడటం మంచిది కాదు

మీ సామ్‌సంగ్ ఫోన్‌‌లలో ఓరిజినల్ బ్యాటరీలను మాత్రమే ఉపయోగించండి. నాసిరకం బ్యాటరీల జోలుకు పోకండి. ఉబ్బి ఉన్న బ్యాటరీని వాడటం మంచిది కాదు. కాబట్టి, వీలైనంత త్వరగా బ్యాటరీని మార్చేయండి. ఫోన్ పూర్తిగా చార్జ్ అయిన వెంటనే బ్యాటరీ ప్లగ్ నుంచి ఫోన్ ను తొలగించండి. వేడి ప్రదేశాల్లో ఫోన్‌ను ఉంచొద్దు.

బ్యాటరీ లెవల్స్ త్వరగా డ్రాప్ అవుతున్నట్లయితే

మీ ఫోన్ బ్యాటరీ లెవల్స్ త్వరగా డ్రాప్ అవుతున్నట్లయితే బ్యాటరీ ప్రమాదంలో ఉందని గ్రహించండి. వెంటనే కొత్త బ్యాటరీని ఫోన్ లో రీప్లేస్ చేయండి.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Galaxy J5 Explodes: 5 Ways to Check if your Samsung Phone Battery is Safe or Not. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot