ఇక ఇంటర్నెట్ లేకపోయినా జీమెయిల్‌లో వర్క్ చేయవచ్చు!

Posted By: BOMMU SIVANJANEYULU

గూగుల్ అందిస్తోన్న అత్యుత్తమ సర్వీసుల్లో జీమెయిల్ సర్వీస్ ఒకటి. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిచే వినియోగించుకోబోడుతోన్న ఈ ఫీచర్ 2004 నుంచి కొత్త ఫీచర్లతో అప్‌గ్రేడ్ అవుతూనే ఉంది. 2018 గూగుల్ ఐ/ఓ కాన్ఫిరెన్స్‌కు ముందు మేజర్ రీడిజైన్‌ను రిసీవ్ చేసుకున్న జీమెయిల్ సర్వీస్, ఆ కాన్ఫిరెన్స్ తరువాత పలు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఫీచర్లను కూడా గూగుల్ తన జీమెయిల్ సర్వీసుకు జత చేయటం జరిగింది. తాజాగా యాడ్ అయిన మరో అప్‌డేట్‌లో భాగంగా అతిముఖ్యమైన ఆఫ్‌లైన్ సపోర్ట్‌ను కూడా జీమెయిల్ తన యూజర్లకు కల్పిస్తోంది.

ఇకపై ఒక్కొక్కరికీ 18 మొబైల్ కనెక్షన్లు, DoT సంచలన నిర్ణయం

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఇంటర్నెట్ కనెక్టువిటీతో పనిలేకుండా..

ఈ ఆఫ్‌లైన్ సపోర్ట్ ఫీచర్ ద్వారా ఇంటర్నెట్ కనెక్టువిటీ అందుబాటులో లేనప్పటికి జీమెయిల్‌లో వర్క్ చేసుకునే వీలుంటుంది. ఆఫ్‌లైన్‌లో మెయిల్స్‌ను చదవటమే కాకుండా వాటిని ఆర్చివ్ చేయటం, డిలీట్ చేయటం, కొత్త మెయిల్‌ను క్రియేట్ చేయటం, సెర్చ్ చేయటం వంటి పనులన చక్కబెట్టుకునే వీలుటుంది. ఇంటర్నెట్ కనెక్టువిటీ అందుబాటులోకి వచ్చిన తరువాత యూజర్ చేసిన వర్క్ మొత్తం ఆన్‌లైన్‌లో అన్ని డివైస్‌ల మధ్య సింక్ కాబడుతుంది.

క్రోమ్ బ్రౌజర్ వర్షన్ 61..

జీమెయిల్ ఆఫ్‌లైన్ సపోర్ట్ ఫీచర్‌ను పొందాలనుకునే యూజర్లు ముందుగా క్రోమ్ బ్రౌజర్ వర్షన్ 61ను తమ పీసీల్లో డౌన్‌లోడ్ చేసుకోవల్సి ఉంటుంది. బ్రౌజర్ అప్‌డేట్ అయిన తరువాత మీ జిమెయిల్ అకౌంట్‌లోకి వెళ్లి టాప్ రైట్ సైడ్‌లో కనిపించే సెట్టింగ్స్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు ఓపెన్ అయ్యే డ్రాప్‌డౌన్ మెనూలో ‘Settings' టాబ్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు ఓపెన్ అయ్యే మరో మెనూ బార్‌లో ‘Offline' టాబ్‌ను సెలక్ట్ చేసుకుని ‘Enable offline mail' ఆప్షన్‌ను చెక్ చేసుకుని సెట్టింగ్స్‌ను మీకు నచ్చిన విధంగా కస్టమైజ్ చేసుకుంటే సరిపోతుంది.

ఆండ్రాయిడ్ యూజర్లకు..

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు కోసం జీమెయిల్ యాప్ మరిన్ని అప్‌డేటెడ్ ఫీచర్లతో అందుబాటులోకి వచ్చింది. ఈ లేటెస్ట్ ఫీచర్లను మీరు పొందాలంటే ముందుగా గూగుల్ ప్లే స్టోర్‌లోకి వెళ్లి మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లోని జీమెయిల్ యాప్‌ను అప్‌డేట్ చేుసకోండి. లేటెస్ట్ వర్షన్ జీమెయిల్ ఆండ్రాయిడ్ యాప్‌లో భాగంగా ఫైళ్లను మీ గూగుల్ డ్రైవ్ నుంచే నేరుగా అటాచ్ చేసుకునే వీలుంటుంది.

సులువుగా సార్ట్-అవుట్ చేసుకునే వీలు..

లేటెస్ట్ వర్షన్ జీమెయిల్ ఆండ్రాయిడ్ యాప్‌లో భాగంగా సెండర్ ప్రొఫైల్ ఇమేజ్ పై టాప్ చేసి అతనికి సంబంధించిన మల్టిపుల్ ఈమెయిల్స్‌ను ఏకకాలంలో డిలీట్ చేయవచ్చు. లేటెస్ట్ వర్షన్ జీమెయిల్ ఆండ్రాయిడ్ యాప్‌లో ఈమెయిల్స్‌ను సులువుగా సార్ట్-అవుట్ చేసుకునేందుకు రకరకాల ఇన్-బాక్స్ ఆప్షన్‌లను జీమెయిల్ అందిస్తోంది.

 

 

మెర్జ్ ఇన్‌బాక్సెస్ ఫీచర్ ఎంతో ఉపయోగకరం...

లేటెస్ట్ వర్షన్ జీమెయిల్ ఆండ్రాయిడ్ యాప్‌లోని సెర్చ్ బాక్సులో పాత మెయిల్స్‌ను సైతం సునాయాసంగా శోధించవచ్చు. లేటెస్ట్ వర్షన్ జీమెయిల్ ఆండ్రాయిడ్ యాప్‌లోని మెర్జ్ ఇన్‌బాక్సెస్ ఫీచర్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ఫీచర్ చూపించే యునిఫైడ్ బాక్స్ వ్యూలో వివిధ గూగుల్ అకౌంట్‌లకు సంబంధించిన మెసేజ్‌లను ఒకేసారి చూడొచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Gmail, Google’s one of the most widely used emailing service, has been witnessing a slew of upgrades lately.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot