ఒక్క మిస్ట్ కాల్‌తో పీఎఫ్ బాలన్స్, 5 రోజుల్లో పీఎఫ్ డబ్బులు పొందడం ఎలా ?

|

ఉద్యోగులు తమ భవిష్యనిధి ( పీఎఫ్ ) ఖాతా నగదు వివరాలను సులభంగా మిస్ట్ కాల్ ద్వారా లేదా SMS ద్వారా తెలుసుకోవచ్చని ప్రభుత్వం వెల్లడించిన సంగతి అందిరికీ తెలిసిందే. అయితే ఆ ప్రాసెస్ ఎలా అనేది చాలామందికి తెలియదు. కంపెనీ నుంచి వైదొలిగిన తరువాత పీఎఫ్ క్లైం కోసం చాలామంది ఆఫీసుల చుట్టూ తిరిగి అలసిపోతుంటారు. అయితే వారికి అకౌంట్లో బ్యాలన్స్ ఎంత ఉందనే విషయం కూడా తెలియదు. మరి పీఎఫ్ బ్యాలన్స్ ఎంత ఉందో ఎలా తెలుసుకోవాలి. అలాగే దాన్ని ఎలా మన అకౌంట్లో జమ చేసుకోవాలనే దానిపై కొన్ని గైడెన్స్ ఇస్తున్నాం. వీటిని మీరు ఫాలో అయితే మీ పీఎఫ్ బ్యాలన్స్ ని మీరు క్లియర్ చేసుకోవచ్చు.

 

పీఎఫ్ విత్‌డ్రా ఇక ఆన్‌లైన్‌లోనే.. స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్పీఎఫ్ విత్‌డ్రా ఇక ఆన్‌లైన్‌లోనే.. స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్

స్టెప్ 1

స్టెప్ 1

పీఎఫ్ ఖాతాదారులందరికీ యూఎన్ అనే ఒక నంబర్ ను కేటాయించడం జరుగుతుంది. కాబట్టి ముందుగా చందాదారులు యూనివర్సల్ అకౌంట్ నంబర్ ని యాక్టివేట్ చేసుకోవాలి. పీఎఫ్ వెబ్ సైట్లో లాగిన్ అయిన తరువాత మీరు అక్కడ మీ పర్మినెంట్ నంబర్ ఇవ్వాలి.

స్టెప్ 2

స్టెప్ 2

అక్కడ ఏ నంబర్ అయితే ఇస్తారో ఆ రిజిస్టర్ మొబైల్ నంబర్ నుంచి 011 22901406కి మిస్ట్ కాల్ ఇస్తే మీ పీఎఫ్ ఖాతా వివరాలన్నీ మీ మీమొబైల్ SMS ద్వారా క్షణాల్లో అందుతాయి. కాగా ఈ సేవలు పూర్తిగా ఉచితం. మీరు ఖచ్చితంగా మీ మొబైల్ నంబర్ యూఏఎన్ కి రిజిస్టర్ చేస్తేనే ఇది సాధ్యమవుతుంది. వేరే నంబర్ ని ట్రే చేస్తే SMS రాదు.

 SMS కోసం..
 

SMS కోసం..

మీ రిజిస్టర్ మొబైల్ నంబర్ నుంచి 2238299899 నంబర్ కి EPFOHO UAN అని SMS పంపడం ద్వారా పీఎఫ్ ఖాతాలో ఎంత జమయిందో తెలుస్తుంది. ప్రస్తుతం 10 ప్రాంతీయ భాషల్లో ఈ సమాచారం అందుబాటులో ఉంది.

సొంత భాషలో సమాచారం పొందాలంటే..

సొంత భాషలో సమాచారం పొందాలంటే..

మీరు మీ సొంత భాషలో సమాచారం పొందాలంటే ఆ భాషకు సంబంధించి మొదటి మూడు అక్షరాలను టైప్ చేయాలి. ఉదాహరణకు తెలుగులో సమాచారం కావాలనుకుంటే EPFOHO UAN TEL అని టైపు చేసి 7738299899 నంబరుకు SMS చేయాలి. దీంతో మీకు మీ ఖాతాలో ఉన్న సమాచారం గురించి SMS వివరాలు అందుతాయి.

 పీఎఫ్ సొమ్మును 5 రోజుల్లో వెనక్కి తెచ్చుకోవ‌డం ఎలా?

పీఎఫ్ సొమ్మును 5 రోజుల్లో వెనక్కి తెచ్చుకోవ‌డం ఎలా?

పీఎఫ్ ఆన్‌లైన్ క్లెయిం కోసం http://epfindia.gov.in/site_en/ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. మీ ముందు పీఎఫ్ సంబంధిత వివ‌రాల‌ను క‌లిగిన వెబ్‌సైట్ ప్ర‌త్య‌క్ష‌మ‌వుతుంది. ఈ వెబ్‌సైట్ హోం పేజీలోనే కుడి ప‌క్క ఆన్‌లైన్ క్లెయిం అనే ఆప్ష‌న్ ఉంటుంది. మీరు దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేయ‌గానే యూఏఎన్ సాయంతో లాగిన్ అయ్యే విండో వ‌స్తుంది.

యూఏఎన్ లాగిన్‌

యూఏఎన్ లాగిన్‌

మీరు ఇదివ‌ర‌కే పీఎఫ్ ఖాతా క‌లిగి ఉంటే మీ యాజ‌మాన్యం మీకు యూఏఎన్ నంబ‌రు స‌దుపాయం క‌ల్పిస్తుంది. యూఏఎన్ లాగిన్ అయిన త‌ర్వాత ఐదు ఆప్ష‌న్లు క‌నిపిస్తాయి. మేనేజ్ అనే దానిలో మీరు కేవైసీ వివ‌రాల‌ను అప్‌డేట్ చేయ‌వ‌చ్చు. అకౌంట్ అనే చోట పాస్ వ‌ర్డ్ మార్చుకోవ‌చ్చు. ఆన్‌లైన్ స‌ర్వీసు అనేది పీఎఫ్ సొమ్ము సంబంధించిన ముఖ్య‌మైన ఆప్ష‌న్.

ఇలా చేయండి

ఇలా చేయండి

ఆన్‌లైన్ స‌ర్వీసెస్ ఆప్ష‌న్‌లో ఉండే క్లెయిం, ట్రాన్స్‌ఫ‌ర్ రిక్వెస్ట్‌, ట్రాక్ క్లెయిం స్టేట‌స్ ద్వారా మీకు కావాల్సిన ప‌ని చేసుకోవ‌చ్చు. క్లెయిం ఆప్ష‌న్ నొక్కితే మీ ఆధార్ సంఖ్య కేవైసీ వివ‌రాల‌తో పీఎఫ్ వెబ్సైట్ అప్‌డేట్ అయిందో లేదో తెలుస్తుంది. మీ కేవైసీ వివ‌రాల వెరిఫికేష‌న్ పూర్త‌యితే మీరు ఆన్‌లైన్‌లో క్లెయిం నేరుగా చేసుకోవ‌చ్చు.

కేవైసీ వివ‌రాల అప్‌డేట్‌

కేవైసీ వివ‌రాల అప్‌డేట్‌

కేవైసీ వివ‌రాలు స‌రిగా లేక‌పోతే వాటిని మీరు ఆన్‌లైన్‌లోనే అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. దీన్ని కేవైసీ ప్ర‌క్రియ పూర్తి చేయ‌డం అన‌వ‌చ్చు. కేవైసీ పూర్తిచేయ‌కుడా పీఎఫ్ ఆన్‌లైన్ క్లెయిం చేయ‌డం క‌ష్టం. హోం, వ్యూ త‌ర్వాత మేనేజ్ అనే ఆప్ష‌న్ ఉంటుంది. అక్క‌డ కాంటాక్ట్ డీటెయిల్స్‌, కేవైసీ అని ఉంటుంది. అక్క‌డ కేవైసీ పై క్లిక్ చేయండి.

వివ‌రాల‌ను నింపండి

వివ‌రాల‌ను నింపండి

ఇక్క‌డ డాక్యుమెంట్ ర‌కం, డాక్యుమెంట్ నంబ‌రు, మీ పేరు వంటి వివ‌రాల‌ను వెబ్‌సైట్ అడుగుతుంది. బ్యాంకు, పాన్‌, ఆధార్ వివ‌రాల‌ను ఇస్తే వెరిఫికేస‌న్ పూర్త‌వుతుంది. ఇక్క‌డ మీ ఆధార్‌లో ఉన్న పేరు, పుట్టిన తేదీ వెబ్‌సైట్లో ఉన్న వాటితో ప‌రిపోలాలి. త‌ర్వాత సేవ్ ఆప్ష‌న్ నొక్కండి. ఒక‌సారి కేవైసీ ప్ర‌క్రియ పూర్త‌యితే మ‌ళ్లీ ఆన్‌లైన్ స‌ర్వీసెస్‌లోకి వెళ్లి క్లెయిం ఆప్ష‌న్ నొక్కండి. దీన్ని పూర్తి చేస్తే 10 రోజుల్లోపు మీ ఖాతాలోకి పీఎఫ్ సొమ్ము జ‌మ అవుతుంది.

ఒక్క మిస్డ్ కాల్‌తో ఈపీఎఫ్‌ బ్యాలెన్స్ తెలుసుకోండిఒక్క మిస్డ్ కాల్‌తో ఈపీఎఫ్‌ బ్యాలెన్స్ తెలుసుకోండి

Best Mobiles in India

English summary
Good news! Now know your PF balance via missed call, SMS alert More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X