Home
How to

గూగుల్ క్రోమ్‌లో 'నోట్ సెక్యూర్' వార్నింగ్.. మీ బ్యాంక్ ఖాతా సురక్షితమేనా? వెంటనే చేయాల్సిన పనులివే!

ఈ రోజు ఉదయం (అక్టోబర్ 28) నుంచి కొన్ని భారతీయ వెబ్‌సైట్లు గూగుల్ క్రోమ్‌ (Chrome)లో చూస్తున్నప్పుడు ఉన్నట్టుండి 'నోట్ సెక్యూర్' (Not Secure) అని కనిపిస్తున్నాయి. రాత్రికి రాత్రే గూగుల్ తీసుకొచ్చిన ఒక కీలకమైన ట్రస్ట్ చేంజ్ (Trust change) వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. బలహీనమైన ‘ఇంటర్మీడియట్ కీలు’ వెలుగులోకి రావడంతో eMudhra రూట్‌ను గూగుల్ బ్లాక్ చేసింది. దీనికి తోడు సాధారణ HTTP పేజీలపై కూడా క్రోమ్ పటిష్టమైన హెచ్చరికలు జారీ చేస్తుండటంతో, ఈ రోజు నుంచి ఇటువంటి అలర్టులు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

దీని వల్ల ఏమవుతుంది?: మన దేశంలోని అనేక ప్రభుత్వ, బ్యాంకింగ్ పోర్టళ్లు చాలా కాలంగా eMudhra నెట్‌వర్క్ పైనే ఆధారపడి పనిచేస్తున్నాయి. గత వారంలోనే LIC, బంధన్ బ్యాంక్ తో పాటు UIDAIకి చెందిన రెండు డొమైన్లు ఈ పాత చైన్‌ను వాడుతున్నట్లు రీసెర్చర్లు గుర్తించారు. అయితే, భారత్‌లోని డిజిటల్ సిగ్నేచర్ సేవలు దీనికి వేరుగా ఉన్నాయని, వాటికేమీ కాలేదని eMudhra స్పష్టం చేసింది. కాకపోతే, పబ్లిక్-వెబ్ TLS సేవలు వాడుతున్న కస్టమర్లు తమ సర్టిఫికెట్లను వెంటనే అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.

Google Chrome 'Not Secure' Warning: How to Fix and Protect Your Banking Data (2026)

బ్యాంకింగ్, UPI వ్యవహారాల్లో సురక్షితంగా ఉండేందుకు యాండ్రాయిడ్ యూజర్లు చేయాల్సిన పనులు

క్రోమ్‌లో హెచ్చరిక పేజీ (Warning Page) కనిపించినప్పుడు పొరపాటున కూడా 'Proceed' పై క్లిక్ చేయకండి. బదులుగా అధికారిక బ్యాంక్ లేదా UPI యాప్‌లనే వాడండి. గూగుల్ ప్లే స్టోర్ ద్వారా క్రోమ్ యాప్‌ను అప్‌డేట్ చేయండి లేదా క్రోమ్ ఓపెన్ చేసి Settings > About Chrome లోకి వెళ్లి చెక్ చేసుకోండి. అలాగే ప్లే స్టోర్‌లో 'Android System WebView'ని కూడా అప్‌డేట్ చేయండి. ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి Security and privacy > Google Play system update ని అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. శామ్‌సంగ్, షియోమీ (Xiaomi) ఫోన్‌లు వాడేవారు సెట్టింగ్స్‌లో ఈ ఆప్షన్ కోసం సెర్చ్ చేయవచ్చు. ఈ వార్నింగ్‌లను బైపాస్ చేస్తే మీ సమాచారం చోరీకి గురయ్యే ప్రమాదముంది. ఈ అప్‌డేట్స్ అన్నీ చేశాక ఒకసారి ఫోన్‌ను రీస్టార్ట్ చేయండి.

క్రోమ్‌లో ఈ రోజు 'నోట్ సెక్యూర్' వార్నింగ్స్ ఎందుకు వస్తున్నాయి?

బలహీనమైన ఇంటర్మీడియట్ కీల వ్యవహారం బయటపడటంతో క్రోమ్ తన రూట్ స్టోర్ నుంచి 'emSign ECC Root CA–G3'ని తొలగించింది. సోమవారం అర్థరాత్రి (UTC) యాండ్రాయిడ్ డివైజ్‌లకు ప్లే సర్వీసెస్ అప్‌డేట్ కూడా వచ్చింది. మంగళవారం ఉదయానికల్లా (పసిఫిక్ సమయం) ఇది ప్రపంచవ్యాప్తంగా రోలవుట్ పూర్తయింది. భారతదేశంలో ఇది అక్టోబర్ 27 రాత్రి నుంచి అక్టోబర్ 28 కి మారే సమయానికి అమల్లోకి వచ్చింది. దీంతో సరిగ్గా కాన్ఫిగర్ చేయని వెబ్‌సైట్లలో ఉన్నట్లుండి ఈ ఎర్రర్లు రావడం మొదలైంది.

ఒకవేళ ఈ హెచ్చరికలు వస్తూనే ఉంటే, అడ్రస్ బార్‌లో ప్యాడ్‌లాక్ (Padlock) గుర్తుతో పాటు వెబ్‌సైట్ స్పెల్లింగ్ కరెక్ట్‌గా ఉందో లేదో సరిచూసుకోండి. వేరే నెట్‌వర్క్‌కి మారి ప్రయత్నించండి. ఆ తర్వాత HSTS రీసెట్ అయ్యేందుకు క్రోమ్‌లో ఆ వెబ్‌సైట్ సైట్ డేటాను క్లియర్ చేయండి. ఫోన్/సిస్టమ్ రీస్టార్ట్ చేయండి. ఏవైనా ఇతర బ్రౌజర్లు వాడేటట్లయితే, వాటిని అప్‌డేట్ చేసిన తర్వాతే మళ్లీ చెక్ చేయండి. వివిధ కంపెనీలు ఈ ట్రస్ట్ అప్‌డేట్లను విడతలవారీగా అందిస్తున్నాయి, కాబట్టి వేర్వేరు యాప్‌లు, ఫోన్లలో ఈ సమయం మారవచ్చు. పేమెంట్ పేజీలలో ఎట్టిపరిస్థితుల్లోనూ వార్నింగ్‌లను బైపాస్ చేయవద్దు.

వెబ్‌సైట్ అడ్మిన్లు, డెవలపర్లు వెంటనే చేయాల్సిన పనులు

వెబ్‌సైట్ ఆపరేటర్లు వెంటనే తమ సర్టిఫికేట్లను ఆడిట్ చేసుకోవాలి. eMudhra ప్రభావిత రూట్‌కి లింక్ అయిన ప్రతి చైన్‌ను వెంటనే రీప్లేస్ చేయాల్సి ఉంటుంది. ఎక్స్‌టర్నల్ TLS టెస్టింగ్ టూల్స్ ద్వారా ఇన్‌స్టాలేషన్‌ను సరిచూసుకోవాలి, అలాగే సర్టిఫికేట్ ట్రాన్స్‌పరెన్సీ లాగ్‌లను కన్ఫర్మ్ చేసుకోవాలి. స్పూఫింగ్ ప్రమాదాన్ని తగ్గించడానికి యాండ్రాయిడ్ యాప్‌లలో సర్టిఫికేట్ పిన్నింగ్‌ను ఎనేబుల్ చేయాలి. సైట్‌పై తిరిగి సెక్యూర్ ఐకాన్ వచ్చేంత వరకు, చెల్లింపుల కోసం అధికారిక యాప్‌లను మాత్రమే వాడటం శ్రేయస్కరం. భారత్‌లో ఈ అప్‌డేట్ రోలవుట్ అక్టోబర్ 27 నుంచి అక్టోబర్ 28 మధ్య పూర్తయింది.

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X