గూగుల్ కొత్త సర్వీస్ ‘Plus Codes’, ఎలా పనిచేస్తుంది..?

Posted By: BOMMU SIVANJANEYULU

మొబైల్ ఇంకా డెస్క్‌టాప్‌లలో అడ్రస్‌లను మరింత సులువుగా షేర్ చేసుకునేందుకుగాను గూగుల్ మ్యాప్స్ మూడు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. వాటిలో ఒకటైన ప్లస్ కోడ్స్ (Plus Codes) ద్వారా క్లిష్టతరమైన అడ్రస్‌లను సునాయాశంగా షేర్ చేసుకునే అవకాశాన్ని గూగుల్ కల్పిస్తోంది.ఓ ప్రత్యేకమైన వ్యవస్థ ఆధారంగా స్పందించగలిగే ప్లస్ కోడ్స్ భూమికి సంబంధించిన జియోగ్రాఫికల్ సర్‌‌ఫేస్‌ను చిన్న చిన్న 'tiled areas'గా డివైడ్ చేసి చూపిస్తుంది. వీటికి ప్రత్యేకమైన 4 డిజిట్ల ఏరియా కోడ్‌లను కూడా గూగుల్ మ్యాప్స్ కేటాయించింది. గూగుల్ మ్యాప్స్‌లోకి వెళ్లి మీ ల్యాండ్ మార్కును సెలక్ట్ చేసుకున్నట్లయితే ఏరియాను బట్టి ప్లస్ కోడ్ జనరేట్ అయిపోతుంది. ఈ లాంగ్ కోడ్‌ను మిత్రులకు షేర్ చేయటం ద్వారా సునాయశంగా వారు మీ లొకేషన్‌ను తెలసుకోగలుగుతారు.

క్రోమ్ బ్రౌజర్ వేగంగా రన్ అవ్వాలంటే..? సింపుల్ ట్రిక్స్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Plus Codesను జనరేట్ చేయటం ఎలా..?

ప్లస్ కోడ్‌లను జనరేట్ చేయాలనుకునే వారు ముందుగా గూగుల్ మ్యాప్స్‌లోకి వెళ్లి వారికి అవసరమైన లొకేషన్ పై ట్యాప్ చేయాలి. లొకేషన్ పై టాప్ చేసిన వెంటనే ఓ ఇన్ఫర్మేషన్ బార్ క్రింద చూపించబడుతుంది. ఆ బార్ వ్యూను ఎక్స్‌ప్యాండ్ చేసినట్లయితే లొకేషన్‌కు సంబంధించిన ప్లస్‌కోడ్ కనిపిస్తుంంది. ఈ కోడ్‌ను కాపీ చేసుకుని ఇన్‌స్టెంట్ మెసేజింగ్ యాప్స్‌లో షేర్ చేసుకోవచ్చు.

మీకు వచ్చిన Plus Codesను ఓపెన్ చేసి చూడాలంటే..?

ఒకవేళ మీకు ఎవరైనా ప్లస్ కోడ్‌ను పంపించినట్లయితే ముందుగా ఆ ప్లస్‌కోడ్‌ను క్లిప్‌బోర్డ్‌లోకి కాపీ చేసుకని గూగుల్ సెర్చ్ ను ఓపెన్ చేయండి. గూగుల్ సెర్చ్ బార్ ఓపెన్ అయిన తరువాత ఈ కోడ్‌ను అక్కడ పేస్ట్ చేసినట్లయితే గూగుల్ మ్యాప్స్ లొకేషన్ ఖచ్చితమైన అడ్రస్‌తో మీకు కనిపిస్తుంది.

మరో రెండు ఫీచర్లు...

ప్లస్‌కోడ్ ఫీచర్‌తో పాటు మరో రెండు ఫీచర్లను కూడా గూగుల్ మ్యాప్స్ పరిచయం చేసింది. ‘యాడ్ యాన్ అడ్రస్', ‘స్మార్ట్ అడ్రస్ సెర్చ్' పేర్లతో ఈ ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. యాడ్ యాన్ అడ్రస్ ఫీచర్ ద్వారా మిస్సింగ్ అడ్రస్‌లను గూగుల్ మ్యాప్స్‌లో యాడ్ చేసుకునే వీలుంటుంది. ఇదే సమయంలో స్మార్ట్ సెర్చ్ అడ్రసెస్ ఆప్షన్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ సహాయంతో సమీపంలోని ల్యాండ్ మార్క్స్‌ను గుర్తించగలుగుతుంది.

మొత్తం ఆరుభాషల్లో సపోర్ట్

కాగా ఇది మొత్తం ఆరుభాషల్లో సపోర్ట్ చేస్తుంది. Bengali, Gujarati, Kannada, Telugu, Tamil and Malayalam గూగుల్ నేవిగేషన్ కీ ద్వారా మీరు ఈ ఫీచర్ పొందవచ్చు. కాగా హిందీ, ఇంగ్లీష్ లకు ఇవి అడిషనల్ లాంగ్వేజీలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Google Maps has introduced three new features, making it easier for Indians to share what usually are long addresses, on mobile and web.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot