గూగుల్ మ్యాప్ ట్రాకింగ్ ఆటోమేటిగ్గా డిలీట్ చేయడం ఎలా ?

By Gizbot Bureau
|

సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ అందించే సర్వీసుల్లో చాలా ముఖ్యమైని గూగుల్ మ్యాప్స్ సర్వీస్. ప్రపంచవ్యాప్తంగా మీరు ఎక్కడా ఉన్నా సరే ఈజీగా ఈ మ్యాప్స్ ద్వారా లొకేషన్ గుర్తించవచ్చు. అయితే మీరు సరైన పద్ధతిలో గూగుల్ మ్యాప్స్ సెట్ చేయలేదా? అలా సెట్ చేయకుంటే మీరెక్కడన్నారో గూగుల్ ఇట్టే పసిగట్టేస్తుంది. నడిచినా లేదా డ్రైవింగ్ చేసినా గాల్లో ఎగిరినా సరే.. మీ ప్రతి మూమెంట్ గూగుల్ సర్వర్లలో స్టోర్ అవుతుంది జాగ్రత్త. ఇదేలా సాధ్యం అనుకుంటున్నారా? ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతుల్లో స్మార్ట్ ఫోన్లు ఉంది. ఆన్ లైన్ లో ఏదైనా యాక్సస్ చేసుకోవాలంటే లొకేషన్ పర్మిషన్ ఇస్తుంటారు. మీ ఫోన్లలో కూడా లొకేషన్ ఎనేబుల్ చేసి ఉంటే.. గూగుల్ అకౌంట్ ఆధారంగా మీ లొకేషన్ డేటా ఎప్పటికప్పుడూ స్టోర్ అవుతుంది.

గూగుల్ కొత్త ఫీచర్
 

మీరు చేసే ప్రతి పని ఒకరు గమనిస్తున్నారంటే కాస్త ఇబ్బందిగా ఉంటుంది కదా.. అయితే ఈ మధ్య దీని నివారణ కోసం ఈ మధ్య గూగుల్ ఓ కొత్త ఫీచర్ ను రిలీజ్ చేసింది. దీని సాయంతో గూగుల్ మ్యాప్స్ ద్వారా మీ లొకేషన్ డేటా స్టోర్ అయిన తేదీ నుంచి ప్రతి 18 నెలలు లేదా ప్రతి 3 నెలలకు ఆటోమాటిక్ గా డిలీట్ అయ్యేలా సెట్ చేసుకోవచ్చు. గూగుల్ ఇప్పటికే తమ అకౌంట్ పేజీలో సెట్టింగ్ చేసింది. గూగుల్ మ్యాప్స్ ద్వారా ఎలా మ్యాన్యువల్ గా సెట్ చేసుకోవాలో చూద్దాం.

సెట్టింగ్ ఇలా 

మీరు వాడే ఆండ్రాయిడ్/ఐఫోన్ లో Google Maps యాప్ ఓపెన్ చేయండి. యాప్ టాప్ లెఫ్ట్ లో మెనూ బార్ పై Tap చేయండి. Your Timeline పై ఎంచుకోండి. టాప్ రైట్ స్క్రీన్‌లో మూడు (...) డాట్స్‌పై ట్యాప్ చేయండి. Settings, Privacy ఆప్షన్లను ఎంచుకోండి. Automatically Delete లోకేషన్ హిస్టరీని Select చేయండి. Keep untill I delete manually అనే సెట్టింగ్ మార్చుకోండి. Keep for 18 months లేదా Keep for 3 months సెట్ చేసుకోండి.

ఆటోమేటిక్ గా డిలీట్

మీ లొకేషన్ హిస్టరీ మీ నిర్దిష్ట సమయానికి ఆటోమేటిక్ గా డిలీట్ అయిపోతుంది. గూగుల్ మ్యాప్స్ ప్రతి 3 నెలలకు డిలీట్ చేసుకునేలా సెట్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే.. అంతకంటే ఎక్కువ కాలం డేటా ఉండాల్సిన అవసరం ఉండదు కదా. మీ ప్రైవసీకి తగినట్టుగా 18 నెలల వరకు సెట్ చేసుకోవచ్చు.

Most Read Articles
Best Mobiles in India

English summary
Google Maps tracks everywhere you go. Here’s how to automatically delete what it stores

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X