Google Mapsలో స్పీడ్ లిమిట్ హెచ్చరికను ఆన్ చేయడం ఎలా?
గూగుల్ మ్యాప్స్ యాప్‌ని ప్రస్తుత రోజులలో అత్యధికంగా ఉపయోగిస్తున్నారు. తెలియని ప్రాంతాలలో గమ్యస్థానానికి త్వరగా చేరుకోవడానికి అధిక మంది గూగుల్ మ్యాప్స్ మీద ఆధారపడుతున్నారు. వినియోగదారులకు అవాంతరాలు లేని ప్రయాణాన్ని అనుమతించే అనేక కార్యాచరణలను ఇది కలిగి ఉన్నాయి. ఇటువంటి ముఖ్యమైన ఫీచర్లలో స్ట్రీట్ వ్యూ, టోల్ ఎస్టిమేట్స్, ఎస్టిమేట్ అరైవాళ్ టైమ్ (ETA) వంటివి మరిన్ని ఉన్నాయి. వినియోగదారులు ప్రయాణించే నిర్దిష్ట మార్గంలో వేగం అధిగమించబోతున్నట్లయితే వారికి గూగుల్ యాప్ స్పీడ్ లిమిట్ యొక్క హెచ్చరికలను కూడా పంపగలదు. ఈ విధంగా వినియోగదారులు వారి వేగాన్ని తనిఖీ చేయవచ్చు మరియు దానికి అణుగుణంగా స్పీడ్ ని సర్దుబాటు కూడా చేయవచ్చు.

Google Mapsలో స్పీడ్ లిమిట్ హెచ్చరికను ఆన్ చేసే విధానం
స్టెప్ 1: మీ స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ మ్యాప్స్ యాప్‌ను ఓపెన్ చేయండి.
స్టెప్ 2: కుడివైపు ఎగువ మూలలో ఉన్న ప్రొఫైల్ చిహ్నంపై నొక్కండి.
స్టెప్ 3: క్రిందికి స్క్రోల్ చేసి నావిగేషన్ సెట్టింగ్‌ల మీద నొక్కండి.
స్టెప్ 4: ఇప్పుడు స్పీడ్ లిమిట్ ఎంపికను కనుగొని దాని యొక్క టోగుల్‌ని ఆన్ చేయండి
స్టెప్ 5: అలాగే స్పీడోమీటర్ యొక్క టోగుల్‌ని కూడా ఆన్ చేయండి
పైన తెలిపిన దశలను అనుసరించిన తరువాత మీరు ప్రయాణించే రూట్ లో మీరు నిర్దిష్ట వేగ పరిమితిని దాటితే కనుక యాప్ మీకు వెంటనే హెచ్చరికను పంపుతుంది. ఈ ఫీచర్ ఇప్పుడు భారతదేశంలోని వినియోగదారులకు కూడా అందుబాటులో ఉంది.

ఇటీవలి గూగుల్ కంపెనీ బ్లాగ్ లో తెలిపిన వివరాల ప్రకారం దేశంలో రహదారి భద్రతా ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడానికి గూగుల్ మ్యాప్స్ ఇప్పుడు బెంగళూరు మరియు చండీగఢ్ ప్రాంతాలలో స్పీడ్ లిమిట్ ఫీచర్ ప్రారంభించి ట్రాఫిక్ అధికారులు షేర్ చేసిన స్పీడ్ లిమిట్ సమాచారాన్ని యాప్ లో చూపుతుంది. గూగుల్ మ్యాప్స్‌లో స్పీడ్ లిమిట్ సమాచారాన్ని అందించడంలో మరిన్ని నగరాలతో భాగస్వామ్యం కోసం మేము ఎదురుచూస్తున్నాము అని పోస్ట్ చేసింది.

గూగుల్ మ్యాప్స్ తమ యొక్క ట్రాఫిక్ లైట్ టైమింగ్‌లను ఆప్టిమైజ్ చేయడంలో సహాయపడటానికి బెంగళూరు ట్రాఫిక్ పోలీసులతో జట్టుకట్టింది. దీని కారణంగా కొన్ని ఉత్తేజకరమైన ప్రారంభ ఫలితాలను కలిగి ఉన్నట్లు ఇటీవల తెలిపింది. నగరాలు తమ ట్రాఫిక్ లైట్ టైమింగ్‌లను మెరుగ్గా ఆప్టిమైజ్ చేయడంలో సహాయపడటానికి ఇప్పటికే ఉన్న ట్రాఫిక్ ప్యాటర్న్‌లు మరియు మెషిన్ లెర్నింగ్‌ని ఉపయోగిస్తుంది. దీని కారణంగా ట్రాఫిక్ వద్ద వేచి ఉండే సమయం, రహదారి రద్దీ వంటి వివరాలను తెలుసుకోవడమే కాకుండా వాటి యొక్క సమస్యలను తగ్గించడంలో వారికి సహాయపడుతుంది. ఈ పైలట్ ఫలితంగా అన్ని కూడళ్లలో దాదాపు 20 శాతం రద్దీ తగ్గినట్లు కంపెనీ పేర్కొన్నది. అలాగే రాబోయే నెలల్లో కోల్‌కతా మరియు హైదరాబాద్‌లకు కూడా ఈ ఫీచర్ ని విస్తరించాలని గూగుల్ యోచిస్తోంది.

ఆండ్రాయిడ్ లో గూగుల్ మ్యాప్స్ లో స్ట్రీట్ వ్యూను ఉపయోగించే విధానం
స్టెప్ 1: మీ ఆండ్రాయిడ్ ఫోన్ లేదా టాబ్లెట్‌లో గూగుల్ మ్యాప్స్ యాప్‌ని ఓపెన్ చేయండి.
స్టెప్ 2: మీకు కావలసిన ప్లేస్ కోసం సెర్చ్ చేయండి లేదా మ్యాప్‌లో పిన్‌ను డ్రాప్ చేయండి.
స్టెప్ 3: పిన్‌ను డ్రాప్ చేయడానికి మ్యాప్‌లో మీకు కావలసిన ప్లేస్ ని తాకి పట్టుకోండి.
స్టెప్ 3: దిగువ భాగంలో మీ యొక్క ప్లేస్ యొక్క పేరు లేదా చిరునామాను నొక్కండి.
స్టెప్ 4: "స్ట్రీట్ వ్యూ" అని లేబుల్ చేయబడిన ఫోటోను స్క్రోల్ చేసి ఎంచుకోండి లేదా వీధి వీక్షణ చిహ్నం 360 ఫోటోతో థంబ్‌నెయిల్‌ను ఎంచుకోండి.
స్టెప్ 5: మీరు పూర్తి చేసినప్పుడు ఎగువభాగంలో ఎడమవైపున వెనుకకు నొక్కండి.

iPhoneలో గూగుల్ మ్యాప్స్ లో స్ట్రీట్ వ్యూను ఉపయోగించే విధానం
స్టెప్ 1: మీ iPhoneలో గూగుల్ మ్యాప్స్ యాప్‌ని ఓపెన్ చేయండి.
స్టెప్ 2: మీకు కావలసిన ఏదైనా ప్లేస్ కోసం శోధించండి లేదా మ్యాప్‌లో మీకు కావలసిన లొకేషన్ ని తాకి పట్టుకోండి.
స్టెప్ 3: స్ట్రీట్ వ్యూ థంబ్నెల్ ని నొక్కండి.
స్టెప్ 4: స్ట్రీట్ వ్యూలో మీ పరిసరాలను చూపించడానికి స్క్రీన్‌పైకి లాగండి లేదా కంపాస్‌ని నొక్కండి.
స్టెప్ 5: వీక్షణను చుట్టూ తరలించడానికి, ఎడమ లేదా కుడికి స్వైప్ చేయండి. మీరు పైకి లేదా క్రిందికి కూడా స్వైప్ చేయవచ్చు. మ్యాప్‌లో మీ అభిప్రాయాన్ని మార్చడానికి మీరు స్ట్రీట్ వ్యూలోని బాణాలను నొక్కవచ్చు.
స్టెప్ 6: మీరు పూర్తి చేసిన తర్వాత బ్యాక్ బటన్ ని నొక్కండి.


Click it and Unblock the Notifications








