జీమెయిల్‌లో ఎస్ఎంఎస్ చాట్ సర్వీస్‌ను ప్రారంభించిన గూగుల్!

Posted By: Super

జీమెయిల్‌లో ఎస్ఎంఎస్ చాట్ సర్వీస్‌ను ప్రారంభించిన గూగుల్!
 

సెర్చ్ ఇంజన్ జెయింట్ గూగుల్ జీమెయిల్ యూజర్ల కోసం ‘ఎస్ఎంఎస్ చాట్ సర్వీస్’ను బుధవారం ప్రారంభించింది. భారత్‌‍తో కలుపుకుని ప్రపంచవ్యాప్తంగా 50 దేశాల్లో ఈ సర్వీస్ అందుబాటులో ఉంది. ఈ సౌలభ్యతతో యూజర్లు తమ జీమెయిల్ విండో నుంచి మొబైల్ ఫోన్‌లకు టెక్స్ట్ సందేశాలను పంపుకోవచ్చు. ఈ జీమెయిల్ ఎస్ఎంఎస్ సర్వీస్ ఇండియాలోని 8 ప్రముఖ నెట్‌వర్క్ ప్రొవైడర్‌లు సపోర్ట్ చేస్తాయి. వాటి వివరాలు.. ఎయిర్ సెల్, ఐడియా, లూప్ మొబైల్, ఎంటీఎస్, రిలయన్స్, టాడా డొకొమో, టాటా ఇండికామ్ ఇంకా వొడాఫోన్.

ఈ సర్వీస్‌లో భాగంగా యూజర్ 50 సందేశాల వరకు పంపుకోవచ్చు. ఎస్ఎంఎస్ చేసిన ప్రతిసారి సంఖ్య తగ్గుతూ వస్తుంది. ఎస్ఎంఎస్ చేసిన మొబైల్ నెంబర్ నుంచి తిరిగి రిప్లై వచ్చినట్లయితే మీ ఖతాలో ఐదు సందేశాలు అదనంగా జతవుతాయి.

సందేశాల సంఖ్య సున్నాకు చేరుకున్న 24 గంటలు తరువాత ఒక మెసేజ్ జత అవుతుంది.

ఎస్ఎంఎస్ చాట్ సర్వీస్‌ను ఉపయోగించటం ఏలా..?

- ముందుగా మీ జెయిల్ మెయిల్‌ను ఓపెన్ చేయండి.

- ‘సెర్చ్ ఆర్ ఇన్వైట్ ఫ్రెండ్స్’ అనే సెర్చ్ బాక్స్‌లో సందేశం పంపాలనుకునే కాంటాక్ట్ ఐడీని టైప్ చేయండి. మీరు టైప్ చేసిన కాంటాక్ట్ ఐడీ కుడి వైపున ప్రత్యక్షమయ్యే ఆప్షన్స్‌లో ‘సెండ్ ఎస్ఎంఎస్’ అనే ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోండి.

- తరువాత ఓపెన్ అయ్యే డైలాగ్ బాక్స్‌లో అవతలి వ్యక్తి ఫోన్ నెంబర్‌ను టైప్ చేసి సేవ్ బటన్ పై క్లిక్ చేయండి.

- వెంటనే ఓ చాట్ విండో స్ర్కీన్ మూలన ప్రత్యక్షమవుతుంది. పంపాల్సిన సందేశాన్ని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేసిన వెంటనే మీ సందేశం సంబంధిత నెంబర్‌కు చేరిపోతుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot