ఆండ్రాయిడ్ యూజర్‌లకు జీమెయిల్ అప్‌డేట్

Posted By:

 ఆండ్రాయిడ్ యూజర్‌లకు జీమెయిల్ అప్‌డేట్
తమ తమ స్మార్ట్‌ఫోన్ లేదా ట్యాబ్లెట్ పీసీలో జీమెయిల్ అప్లికేషన్‌ను ఉపయోగించుకుంటున్న ఆండ్రాయిడ్ యూజర్‌ల కోసం గూగుల్ సరికొత్త అప్‌డేట్‌ను విడుదల చేసింది. ఈ తాజా అప్‌డేట్‌లో భాగంగా యూజర్‌లు ‘రిప్లై', ‘ఆర్చివ్', ‘సెర్చ్'వంటి ఆప్షన్‌లతో కూడిన ప్రత్యేక బాక్స్‌ను తమ తమ మెయిల్ నోటిఫికేషన్‌‌లలో చూసుకోవచ్చు. తద్వారా సదరు ఈమెయిల్‌కు వేగవంతంగా తిరిగి స్పందించవచ్చు. దింతో సమయాన్ని మరింత ఆదా అవుతుంది. ఈ అప్‌డేట్ ఆండ్రాయిడ్ 4.1 ఇంకా ఆపై వర్సన్ ఆపరేటింగ్ సిస్టంలను కలిగి ఉన్న డివైజ్‌లకు మాత్రమే వర్తిస్తుంది. ఈ లేటెస్ట్ వర్సన్ జీమెయిల్ అప్‌డేట్‌ను గూగుల్‌ప్లే స్టోర్ ద్వారా పొందవచ్చు.

భవిష్యత్ టెక్నాలజీ కోసం క్లిక్ చేయండి:

మీరు పంపిన ఈ-మెయిల్ చదవబడిందో లేదో తెలుసుకునేందుకు ‘రైట్ ఇన్‌బాక్స్'

ముఖ్యమైన సమాచారాన్ని మెయిల్ రూపంలో ఓ క్లయింట్‌కు పంపించారు. ఆ మెయిల్ అందిందో లేదో తెలసుకోవాలంటే సదురు మెయిల్ గ్రహీత ఆ మెయిల్‌ను చెక్ చేసుకుని తిరిగి ప్రత్యుత్తరిమిచ్చే వరకు ఎదురుచూడాల్సిందే. మీరు పంపిన మెయిల్‌కు సంబంధించి ‘రీడింగ్ స్టేటస్'ను క్షణాల్లో తెలిపేందుకు గాను ‘రైట్ ఇన్‌బాక్స్'(RighInbox) అప్లికేషన్ సిద్ధంగా ఉంది.

ఈ అప్లికేషన్ ఫైర్‌ఫాక్స్, క్రోమ్ ఇంకా సఫారీ బ్రౌజర్‌లను సపోర్ట్ చేస్తుంది. డౌన్‌లోడ్ లింక్:

ఈ అప్లికేషన్‌ను తమ తమ పీసీలలో ఇన్స్‌స్టాల్ చేసుకోవటం ద్వారా జీమెయిల్ యూజర్లు తాము పంపిన మెయిల్స్‌కు సంబంధంచి మెయిల్ రీడింగ్ స్టేటస్, ఈ-మెయిల్ షెడ్యూలింగ్, ప్రాక్టికల్ రిమైండర్స్ వంటి ప్రత్యేక సర్వీస్‌లను పొందవచ్చు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot