11. 44 లక్షల పాన్ కార్డులు డీయాక్టివేట్, మీది పనిచేస్తుందా..?

Written By:

కేంద్రం పాన్ యూజర్లకు భారీ షాకిచ్చింది. దేశవ్యాప్తంగా 11.44 లక్షల పాన్ కార్డులు పనికిరాకుండా పోయాయి. ఆగష్టు 31 తేదీన ఆధార్ కార్డుతో అనుసంధానం కాని పాన్ కార్డులలో 11.44 లక్షల కార్డులను కేంద్రం డీయాక్టివేట్ చేసింది. మరికొన్నిటిని డిలీట్ కూడా చేసింది. ఆగస్టు నెలాఖరులో పాన్, ఆధార్ లింకు కాబడని పాన్ కార్డులు చెల్లబోవని ఆర్థిక మంత్రిత్వ శాఖ గతంలో స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. మరి మీ కార్డు సంగతి ఓ సారి చూడండి.

మీ మొబైల్ నుంచి ఆధార్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఇ-ఫైళ్ళ వెబ్ సైట్

మీ కార్డు యాక్టివ్ గా వున్నది లేదా డీయాక్టివ్ అయిందో తెలుసుకోవాలంటే, ఆదాయపు పన్ను విభాగం ఇ-ఫైళ్ళ వెబ్ సైట్ ను ఓపెన్ చేయాల్సి ఉంటుంది.

 

నో పాన్ ఆప్షన్ మీద

మీరు నో పాన్ ఆప్షన్ మీద క్లిక్ చేసి, ఆపై వివరాలను సబ్ మిట్ చేస్తే, మీ ఫోన్ నంబర్‌కి ఓ వన్ టైమ్ పాస్ వర్డ్ వస్తుంది.

పాన్ కార్డు డీ యాక్టివేట్

మీరు దానిని ఎన్నుకున్న తరువాత, మీ పాన్ కార్డు డీ యాక్టివేట్ కాకుంటే 'యాక్టివ్' అన్న మెసేజ్ వస్తుంది.

అది రాకుంటే

అది రాకుంటే మీ పాన్ కార్డు డీయాక్టివేట్ ఆయినట్లు. ఒకవేళ డియాక్టివేట్ అయిన కార్డులను తిరిగి యాక్టివేట్ చేయటానికి విధానం మీద కేంద్రం నుండి ఇంకా స్పష్టత రాలేదు.

మరో కార్డు తీసుకోవాలా

వారు మరో కార్డు తీసుకోవాలా? లేక ఆధార్ అనుసంధానం చేసుకుంటే సరిపోతుందా?అన్నది కేంద్రం స్పష్టం చేయాల్సి వుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Govt deactivates 11.44 lakh PAN cards: Is yours still active? Here’s how to check
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot