Christmas 2020 ప్రత్యేక స్టిక్కర్‌లను తయారుచేసి వాట్సాప్ ద్వారా పంపడం ఎలా?

|

ప్రపంచం మొత్తం ప్రస్తుతం క్రిస్మస్ పండుగ వాతావరణంలో మునిగి తేలుతున్నారు. క్రిస్మస్ అంటేనే ఉల్లాసం, ప్రేమ మరియు శాంతిని పంచుకోవడం. అయితే ప్రస్తుతం కొనసాగుతున్న COVID-19 మహమ్మారి కారణంగా మీరు మీ ప్రియమైనవారికి బహుమతులు పంపించలేకపోతే లేదా ఈ సంవత్సరం వారిని కలవలేకపోతే కనుక వారికి ఆన్‌లైన్‌ ద్వారా హృదయపూర్వక శుభాకాంక్షలు పంపడం ఒకటే మార్గంగా ఉంది. ఆన్‌లైన్‌ ద్వారా మెసేజ్ లను పంపడానికి ఉపయోగించే పాపులర్ మెసేజింగ్ యాప్ లలో వాట్సాప్ అందరి కంటే ముందు వరుసలో ఉంటుంది.

 
Happy Christmas 2020: How to Send Christmas Whatsapp Stickers on Your Mobile

వాట్సాప్‌లో మీ యొక్క భావోద్వేగాలను ప్రియమైనవారికి తెలియజేయడానికి పలు రకాల విధానాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రత్యేక క్రిస్మస్ నేపథ్య స్టిక్కర్లను వాట్సాప్‌లో ఒకరికి లేదా గ్రూపులలో పంపడానికి ఈ క్రిస్మస్ స్టిక్కర్‌లను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి లేదా మరొకరికి ఇలా పంపాలో తెలియజేయడానికి కింద ఉన్న దశలను పాటించండి.

 
Happy Christmas 2020: How to Send Christmas Whatsapp Stickers on Your Mobile

క్రిస్మస్ వాట్సాప్ స్టిక్కర్లను పంపడం ఎలా?

స్టెప్ 1: మీ యొక్క ఫోన్ లో వాట్సాప్ యాప్ ను ఓపెన్ చేయండి.

స్టెప్ 2: క్రిస్మస్ స్టిక్కర్‌లను పంపించాలనుకుంటున్న కాంటాక్ట్ లేదా గ్రూపును ఎంచుకోండి.

స్టెప్ 3: తరువాత యాప్ లోని ఎమోజి విభాగానికి వెళ్లి, 'స్టిక్కర్స్' టాబ్‌ను ఓపెన్ చేయండి.

స్టెప్ 4: అందుబాటులో ఉన్న స్టిక్కర్ ప్యాక్‌లను చూడటానికి స్టిక్కర్ విండో యొక్క కుడి ఎగువ మూలలో ఉన్న '+' బటన్‌ మీద క్లిక్ చేయండి.

స్టెప్ 5: మీకు నచ్చిన మరియు కావలసిన స్టిక్కర్ ప్యాక్‌లను పొందడానికి బ్రౌజ్ చేయండి. మీకు ఆసక్తికరంగా ఏమీ కనిపించకపోతే కనుక జాబితాలోని చివర ఉన్న 'షో మోర్ స్టిక్కర్స్' ఎంపికపై క్లిక్ చేయండి.

స్టెప్ 6: తరువాత మీరు గూగుల్ ప్లే స్టోర్‌కు మళ్ళించబడతారు. అక్కడ మీ ముందు అనేక వాట్సాప్ స్టిక్కర్ యాప్ లు ప్రదర్శించబడతాయి.

స్టెప్ 7: మెరుగైన ఫలితాలను కనుగొనడానికి నిర్దిష్ట యాప్ ను ఎంచుకోవచ్చు లేదా మీ సెర్చ్ ను అనుకూలీకరించవచ్చు. ఉదాహరణకు 'క్రిస్మస్ వాట్సాప్ స్టిక్కర్ యాప్ లు' అని టైప్ చేయడం ద్వారా మీరు మీ సెర్చ్ ను గణనీయంగా ఉపయోగించగలుగుతారు.

స్టెప్ 8: మీరు ఒక నిర్దిష్ట స్టిక్కర్ యాప్ ను ఎంచుకున్న తర్వాత దాన్ని మీ ఫోన్ లో డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేసుకోండి.

స్టెప్ 9: వాట్సాప్‌కు తిరిగి వెళ్లి చాట్ విండోను ఓపెన్ చేసి డౌన్‌లోడ్ చేసిన స్టిక్కర్‌లను మీకు నచ్చిన వారికి పంపవచ్చు.

Happy Christmas 2020: How to Send Christmas Whatsapp Stickers on Your Mobile

క్రిస్మస్ 2020 స్టిక్కర్లలో ప్రత్యేకత కోసం ఈ దశలను పాటించండి.

స్టెప్ 1: గూగుల్ ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి మీ స్మార్ట్‌ఫోన్‌లో ఏదైనా స్టిక్కర్ తయారీ యాప్ ను ఇన్‌స్టాల్ చేయండి.

స్టెప్ 2: బ్రౌజర్‌కు వెళ్లి క్రిస్మస్ ఫోటోల కోసం సెర్చ్ చేసి వాటిని డౌన్‌లోడ్ చేయండి.

స్టెప్ 3: స్టిక్కర్ మేకర్ యాప్ ను ఓపెన్ చేసి 'కొత్త స్టిక్కర్ ప్యాక్‌ని సృష్టించండి' ఎంపిక మీద క్లిక్ చేయండి.

స్టెప్ 4: ఇప్పుడు మీరు తయారుచేయబోయే స్టిక్కర్ ప్యాక్‌కు ఒక పేరు ఇవ్వవలసి ఉంటుంది. ఆ తర్వాత మీకు నచ్చిన విధముగా తయారుచేయడానికి ప్యాక్‌కు స్టిక్కర్‌లను జోడించవచ్చు.

స్టెప్ 5: తరువాత '+' బటన్ పై క్లిక్ చేసి డౌన్‌లోడ్ చేసిన చిత్రాలను జోడించండి.

స్టెప్ 6: మీరు కోరుకునే విధంగా అనుకూలీకరించడానికి మార్పులు చేసిన ప్రతిసారి సేవ్ చేయండి.

స్టెప్ 7: వాట్సాప్ నుండి ఈ స్టిక్కర్లను యాక్సెస్ చేయడానికి 'పబ్లిష్ స్టిక్కర్ ప్యాక్' ఎంపికపై నొక్కండి.

Best Mobiles in India

English summary
Happy Christmas 2020: How to Send Christmas Whatsapp Stickers on Your Mobile

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X