Home
How to

WhatsApp ద్వారా రక్షా బంధన్ 2021 స్టిక్కర్స్, GIF, స్టేటస్ లను పంపడం ఎలా??

2021 సంవత్సరంలో రాఖీ పండుగ (రక్షా బంధన్) ను ఆగస్టు 22న భారతదేశమంతటా జరుపుకుంటున్నారు. కరోనావైరస్ మహమ్మారి ఇంకా కొనసాగుతున్నందున ఈ సంవత్సరం రక్షా బంధన్ జరుపుకోవడానికి వర్చ్యువల్ మార్గం ఉత్తమంగా ఉంది. ఈ రోజుల్లో స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో కనెక్ట్ కావడానికి WhatsApp అన్నిటికంటే ఉత్తమ మార్గంగా ఉంది. కాబట్టి మీరు మీ సోదరుడు మరియు సోదరికి ఈ రక్షా బంధన్‌కు దూరంగా ఉంటే కనుక ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన త్వరిత మెసేజ్ యాప్ వాట్సాప్ ద్వారా పండుగను జరుపుకోవడానికి లేదా శుభాకాంక్షలను తెలపడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. అవి ఎలాగో తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

రక్షా బంధన్ 2021 WhatsApp స్టిక్కర్‌లను సృష్టించే విధానం

రక్షా బంధన్ 2021 WhatsApp స్టిక్కర్‌లను సృష్టించే విధానం

స్టెప్ 1: మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో WhatsApp యాప్‌ను ఓపెన్ చేయండి.

స్టెప్ 2: చాట్‌బాక్స్‌ను ఓపెన్ చేయండి.

స్టెప్ 3: చాట్‌బాక్స్‌పై క్లిక్ చేయండి మరియు అక్కడ ఉన్న ఎమోజి ఎంపిక మీద నొక్కండి.

స్టెప్ 4: తరువాత "+" ఎంపికపై నొక్కండి.

స్టెప్ 5: క్రిందికి స్క్రోల్ చేయండి మరియు "మరిన్ని స్టిక్కర్లను పొందండి" ఎంపికపై నొక్కండి.

స్టెప్ 6: వాట్సాప్ మిమ్మల్ని గూగుల్ ప్లే స్టోర్‌కు తీసుకెళుతుంది.

స్టెప్ 7: ప్లే స్టోర్‌లో వాట్సాప్ స్టిక్కర్ ప్యాక్ కోసం సెర్చ్ చేయండి.

స్టెప్ 8: తరువాత అనేక థర్డ్ పార్టీ స్టిక్కర్ ప్యాక్ యాప్‌లు కనిపిస్తాయి. ఇందులో ఒక దాన్ని మీ ఫోన్‌లో యాప్‌ని ఇన్‌స్టాల్ చేయండి.

స్టెప్ 9: యాప్‌లో తగిన స్టిక్కర్ ప్యాక్‌లను ఎంచుకోండి. ఈ సందర్భంలో రక్షా బంధన్ లేదా రాఖీ స్టిక్కర్ ప్యాక్‌లను ఎంచుకోండి.

స్టెప్ 10: ఎంచుకున్న స్టిక్కర్ ప్యాక్‌లు వాట్సాప్ యాప్‌లోని మై స్టిక్కర్స్ విభాగానికి జోడించబడతాయి.

స్టెప్ 11: మీరు ఇప్పుడు మీకు తగిన స్టిక్కర్‌ను ఎంచుకుని మీ కాంటాక్ట్స్, ఫ్యామిలీ మరియు స్నేహితులకు పంపవచ్చు.

గమనిక: మీరు మీ మొబైల్ నుండి థర్డ్ పార్టీ స్టిక్కర్ ప్యాక్‌ని తొలగిస్తే కనుక స్టిక్కర్ ప్యాక్ WhatsApp యాప్ నుండి కూడా తీసివేయబడుతుంది.

 

రక్షా బంధన్ 2021 వాట్సాప్ స్టేటస్ ని ఎలా పంచుకోవాలి

రక్షా బంధన్ 2021 వాట్సాప్ స్టేటస్ ని ఎలా పంచుకోవాలి

స్టెప్ 1: మీ స్మార్ట్‌ఫోన్‌లో WhatsApp యాప్‌ను ఓపెన్ చేయండి.

స్టెప్ 2: స్టేటస్ విభాగానికి వెళ్ళండి.

స్టెప్ 3: మీ ఫోన్ గ్యాలరీ నుండి రాఖీ పండుగకు సంబందించిన వీడియోను లేదా ఫోటోను అప్‌లోడ్ చేయండి.

స్టెప్ 4: వాట్సాప్ స్టేటస్ ని పోస్ట్ చేయడానికి 'సెండ్' ఎంపికను క్లిక్ చేయండి.

 

రక్షా బంధన్ 2021 వాట్సాప్ GIF లను పంపడం ఎలా ?

రక్షా బంధన్ 2021 వాట్సాప్ GIF లను పంపడం ఎలా ?

స్టెప్ 1: మీ స్మార్ట్‌ఫోన్‌లో WhatsApp యాప్‌ను ఓపెన్ చేయండి.

స్టెప్ 2: చాట్‌బాక్స్‌ను ఓపెన్ చేయండి.

స్టెప్ 3: GIF చిహ్నంపై క్లిక్ చేయండి.

స్టెప్ 4: రక్షా బంధన్ GIF ల కోసం సెర్చ్ చేయండి.

స్టెప్ 5: రక్షా బంధన్ కు తగిన GIF లను ఎంచుకోండి మరియు 'సెండ్' ఎంపికపై క్లిక్ చేయండి.

 

Best Mobiles in India

English summary
Happy Raksha Bandhan 2021: How to Create and Send Rakhi WhatsApp Stickers, Status Video and GIFs
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X