Home
How to

స్మార్ట్‌ఫోన్‌ నీటిలో పడిందా.. ఇలా మాత్రం చేయవద్దు.. !!

ప్రస్తుతం అనేక రకాలైన స్మార్ట్‌ఫోన్లు విడుదల అవుతున్నాయి. రకరకాల ఫీచర్లను కలిగి ఉంటున్నాయి. కొన్ని వాటర్‌, డస్ట్‌ రెసిస్టెన్స్‌తో కూడా వస్తున్నాయి. అయితే ఫోన్‌ను ఎల్లప్పుడూ చాలా జాగ్రత్తగా వినియోగించాలి. మరియు ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభం అయినందున ఫోన్‌ నీటిలో తడవడం లేదా నీటిలో పడిపోయే అవకాశం కూడా ఉంటుంది. అయితే అలాంటి సమయాల్లో ఏం చేయాలో తెలియక చాలా మంది కంగారు పడుతుంటారు.

మీ స్మార్ట్‌ఫోన్ పొరపాటు నీటిలో పడినా లేక తడిచినా ఏం చేయాలి మరియు ఏం చేయకూడదో తెలుసుకోండి. స్మార్ట్‌ఫోన్‌ నీటిలో పడితే మీరు గుర్తించిన వెంటనే బయటకు తీసి.. ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేయాలి. కొన్ని సార్లు ఫోన్‌ నీటిలో పడగానే ఆటోమేటిక్‌గా ఆఫ్‌ అవుతుంది. లేకుంటే మీరే ఆఫ్‌ చేయండి. అనంతరం సిమ్‌, మెమొరీ కార్డు వంటిని బయటకు తీయాలి.

has your phone fallen into water

నీటిలో పడిన ఫోన్‌ను బయటకు తీశాక వెల్లగా షేక్‌ చేయండి. ఫలితంగా చాలా వరకు నీరు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అనంతరం క్లాటన్‌ క్లాత్‌ లేదా నీటిని త్వరగా పీల్చుకొనే గుణం ఉన్న క్లాత్‌తో ఫోన్‌ను తుడవాలి. ఫలితంగా కొంత నీటి శాతం తగ్గుతుంది.

has your phone fallen into water

స్మార్ట్‌ఫోన్‌ నీటిలో పడిపోయిన సందర్భాల్లో కొంత మంది హెయిర్‌ డ్రైయర్ వినియోగించమని సలహా ఇస్తుంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఫోన్‌లోని నీటిని బయటకు పంపేందుకు హెయిర్‌ డ్రైయర్‌ను వాడొద్దు. ఎందుకంటే హెయిర్‌ డ్రైయర్‌ నుంచి గాలి వేడిగా, కొంచెం వేగంగా బయటకు వస్తుంది. ఫలితంగా స్మార్ట్‌ఫోన్‌లోని చిన్న చిన్న విభాగాలు, విద్యుత్‌ కనెక్షన్లు దెబ్బతినే అవకాశం ఉంటుంది.

స్మార్ట్‌ఫోన్ నీటిలో పడిన వెంటనే స్విట్‌ ఆఫ్‌ అవుతుంది. అలాంటి సమయాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఫోన్‌ను ఛార్జింగ్‌ పెట్టేందుకు ప్రయత్నం చేయవద్దు. ఛార్జింగ్‌ పెడితే విద్యుత్‌ షాక్‌ కొట్టడం లేదా ఫోన్‌ పూర్తిగా డ్యామేజీ అయ్యే అవకాశం ఉంటుంది. నీటిలో పడిన ఫోన్‌కు హెడ్‌ఫోన్‌ సహా ఓ పరికరాన్ని వెంటనే కనెక్ట్‌ చేయకూడదు.

has your phone fallen into water

నీటిలో పడిన ఫోన్‌ను బియ్యం సంచిలో కాసేపు ఉంచమని చాలా మంది సలహా ఇస్తారు. బియ్యం నీటిని పీల్చుకుంటుందని వారి వాదన. అయితే ఇలా చేయడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. మరియు చాలా మంది నీటిలో పడిన ఫోన్‌ను బయటకు తీసి, వెంటనే ఎండలో ఉంచేందుకు ప్రయత్నం చేస్తారు. అయితే అలా చేయడం మంచిది కాదు. ఎండ వేడి కారణంగా ఫోన్‌లోపలి భాగాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది.

ఫోన్‌ కొంచెం నీటిలో పడితే పైన తెలిపిన చిట్కాలను ప్రయత్నించిన తర్వాత ఫోన్‌ ఆన్‌ చేయవచ్చు. అనంతరం యథావిధిగా పనిచేస్తుంది. ఎక్కువ నీటిలో చాలా సమయం ఉంటే మాత్రం సర్వీస్‌ సెంటర్‌ వద్దకు తీసుకెళ్లి స్మార్ట్‌ ఫోన్‌ మరమ్మతు చేయించడం మంచిది.

has your phone fallen into water

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
has your phone fallen into water here are the tips to protect your smartphone
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X