భారీ వర్షాలు: మీ ఫోన్ తడిస్తే డేటా మొత్తం పోతుందా? వెంటనే ఈ జాగ్రత్తలు తీసుకోండి!
నేడు (ఆగస్టు 24) పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. ఈ వర్షాల వల్ల పవర్ కట్స్, హఠాత్తుగా వరదలు రావడం, ఫోన్లు తడిసి పాడైపోయే ప్రమాదం ఉంది. ఒకవేళ మీ ఫోన్ ఖరాబైతే.. ముందుగా మీ ఫొటోలు, వాట్సాప్ చాట్‌లు ఎగిరిపోతాయి. అందుకే వెంటనే డేటా బ్యాకప్ చేసుకోండి. అలాగే ఫోన్ తడిస్తే పాటించాల్సిన ముఖ్యమైన చిట్కాలను కూడా తెలుసుకోండి. ఐఎండీ హెచ్చరికలు జారీ చేసిన ప్రధాన రాష్ట్రాల వివరాలు కింద చూడొచ్చు.
కరెంట్ పోయినా లేదా సిగ్నల్ ప్రాబ్లం వచ్చినా క్లౌడ్ బ్యాకప్ ఆగిపోతుంది. అందుకే పవర్, నెట్‌వర్క్ ఉన్నప్పుడే ఈ పని పూర్తి చేయండి. మధ్య, తూర్పు భారతంలోని పలు ప్రాంతాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే ఉత్తర, తూర్పు రాష్ట్రాల్లో వర్షాలు పడే అవకాశం ఉమంది. కేరళలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయగా.. సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు.

నేడు (ఆగస్టు 24) భారీ వర్షాల వివరాలు: IMD అలర్టులు ఇవే!
| ప్రాంతం/రాష్ట్రాలు | IMD అలర్ట్ | వివరాలు |
|---|---|---|
| ఛత్తీస్‌గఢ్, బీహార్, ఒడిశా, తూర్పు మధ్యప్రదేశ్ | ఆరెంజ్ అలర్ట్ | భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు; స్థానికంగా వరదలు, పవర్ కట్స్ అయ్యే అవకాశం. |
| ఢిల్లీ-ఎన్‌సీఆర్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, జమ్మూ & కాశ్మీర్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ | నిఘాలో ఉన్నాయి (వాచ్) | ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు; అక్కడక్కడా భారీ వర్ష సూచన. |
| కేరళ జిల్లాల్లో.. | ఎల్లో అలర్ట్ | అక్కడక్కడా భారీ వర్షాలు; తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు, మత్స్యకారులకు హెచ్చరికలు. |
5 నిమిషాల్లో ఆండ్రాయిడ్/ఐఫోన్ బ్యాకప్ చేసుకునే ప్రాసెస్
ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లు Google One యాప్ ఓపెన్ చేసి.. యాప్స్, SMS, కాల్ హిస్టరీ, సెట్టింగ్స్ కోసం 'Backup now' క్లిక్ చేయండి. Google Photosలో బ్యాకప్ ఆన్ చేసి, ఫొటోలు, వీడియోల కోసం మొబైల్ డేటాను అనుమతించండి. ఐఫోన్ యూజర్లు: iCloud Backup ఆన్ చేసి 'Back Up Now'పై ట్యాప్ చేయండి. దీనివల్ల వాట్సాప్ డేటా కూడా ఐక్లౌడ్‌లోకి బ్యాకప్ అవుతుంది. వీలైతే వాట్సాప్‌లో ఎన్‌క్రిప్టెడ్ బ్యాకప్‌ను కూడా ఆన్ చేసుకోండి.
సిగ్నల్ లేకపోయినా, పవర్ కట్ అయినా ఆఫ్‌లైన్ బ్యాకప్ ఇలా తీసుకోండి
Files by Google లేదా మీ ఫోన్ ఫైల్ మేనేజర్ ద్వారా DCIM, డౌన్‌లోడ్స్, వాట్సాప్ మీడియా ఫైళ్లను SD కార్డ్‌కి లేదా OTG సహాయంతో USB డ్రైవ్‌కి కాపీ చేయండి. టైప్-సి పోర్ట్ ఉన్న ఐఫోన్ యూజర్లు 'Files' యాప్ నుంచి ఎక్స్‌టర్నల్ డ్రైవ్‌లోకి ఫైళ్లను కాపీ చేసుకోవచ్చు. మీ ఫోటోలు, ఫైళ్ల కాపీ ఒకటి ఫోన్ లోపల, మరొకటి బయటి డ్రైవ్‌లో భద్రపరుచుకోవడం మంచిది.
ఫోన్ నీళ్లలో పడితే ఏం చేయాలి? ఏం చేయకూడదు? (ఫస్ట్ ఎయిడ్ టిప్స్)
ఫోన్ నీళ్లలో పడితే వెంటనే స్విచ్ ఆఫ్ చేయండి. ఫోన్ కవర్, సిమ్ కార్డ్‌లను బయటకు తీసి మెల్లగా తుడవండి. ఫోన్‌ను ఛార్జింగ్ పెట్టడం, వేడి చేయడం లేదా పిన్నులతో పోర్ట్‌లను కెదరడం వంటివి అస్సలు చేయొద్దు. ఛార్జింగ్ పోర్ట్ వైపు చల్లటి గాలి వచ్చేలా ఫ్యాన్ పెట్టండి. బియ్యం డబ్బాలో పెట్టడం వల్ల ఏమాత్రం ఉపయోగం ఉండదు సరికాదా దాని ధూళి ఫోన్‌లోకి వెళ్తుంది. కాబట్టి ఆ పని చేయకండి. వీలైతే సిలికా జెల్ వాడండి. కొంత సమయం ఆగిన తర్వాతే ఫోన్ ఆన్ చేయాలా లేదా అనేది చెక్ చేయండి.
నీళ్లలో పడి పాడైన ఫోన్ నుంచి డేటా రికవరీ చేయడం ఎలా?
నీళ్లలో పడ్డ ఫోన్‌ను టెక్నీషియన్లు ఓపెన్ చేసి, ఐసోప్రొపైల్ ఆల్కహాల్ లేదా అల్ట్రాసోనిక్ బాత్‌తో బోర్డులను క్లీన్ చేస్తారు. ఆ తర్వాతే రీబూట్ చేయడం లేదా చిప్ లెవెల్ రిపేర్లు చేసి డేటా రికవరీకి ప్రయత్నిస్తారు. అయితే ఫోన్ తడిగా ఉన్నప్పుడు ఛార్జింగ్ పెడితే డేటా దక్కే అవకాశాలు చాలా తగ్గిపోతాయి. సాధారణ ఫోన్ వారంటీలు నీటి వల్ల జరిగే డ్యామేజ్‌కి వర్తించవు. ప్రొటెక్షన్ ప్లాన్లు ఉంటే మాత్రం క్లెయిమ్ చేసుకోవచ్చు.
ఫోన్‌లో వెంటనే మార్చాల్సిన ముఖ్యమైన సెట్టింగ్స్
ఫోన్‌లో రోజువారీ ఆటోమేటిక్ బ్యాకప్‌ను షెడ్యూల్ చేయండి, అలానే ఇప్పుడే ఒకసారి మ్యాన్యువల్ బ్యాకప్ తీసుకోండి. బ్యాటరీ సేవర్ ఆన్‌లో ఉన్నప్పుడు కూడా అప్‌లోడ్‌లు ఆగకుండా ఉండేందుకు Google Photos, WhatsApp యాప్‌లకు 'Unrestricted Battery' అనుమతి ఇవ్వండి. ఐఫోన్‌లో iCloud Photos సింక్ అవుతున్నప్పుడు 'Low Power Mode' ఆన్ చేయకూడదు. కరెంట్ లేని సమయంలో ముఖ్యమైన ఫైళ్లు అప్‌లోడ్ అయ్యేలా మొబైల్ డేటా బ్యాకప్‌ను తాత్కాలికంగా అనుమతించండి.


Click it and Unblock the Notifications