పోగొట్టుకున్న ఆండ్రాయిడ్ ఫోన్‌ను కనుగొనడానికి కొన్ని సాధారణ చిట్కాలు...

|

ప్రస్తుత స్మార్ట్ ప్రపంచంలో స్మార్ట్‌ఫోన్‌ యొక్క అవసరం ప్రతి చోట ఉన్నది. కొందరు తమ యొక్క అవసరాల కోసం రెండు స్మార్ట్‌ఫోన్‌లను కూడా ఉపయోగిస్తున్నారు. వినియోగదారులు తమ యొక్క స్మార్ట్‌ఫోన్‌లలో పూర్తి సమాచారాన్ని పొందుపరుస్తూ ఉంటారు. అయితే అటువంటి స్మార్ట్‌ఫోన్‌ను మీరు పొరపాటున ఎక్కడైనా పోగొట్టుకుంటే కనుక దానిని తిరిగి పొందడానికి చాలా విధాలుగా ప్రయత్నాలు చేస్తారు. గత రెండు సంవత్సరాలలో టెక్నాలజీ మెరుగ్గా ఉండడంతో పోగొట్టుకున్న స్మార్ట్‌ఫోన్‌ను కనుగొనడానికి సులభతరమైన మార్గాలు చాలానే ఉన్నాయి.

 
పోగొట్టుకున్న ఆండ్రాయిడ్ ఫోన్‌ను కనుగొనడానికి కొన్ని సాధారణ చిట్కాలు..

నేటి గైడ్‌లో మేము పోగొట్టుకున్న ఆండ్రాయిడ్ ఫోన్‌ను కనుగొనడంలో మీకు సహాయపడటమే కాకుండా రిమోట్‌గా దానిని ఎలా లాక్ చేయడం వంటి వివరాలను వివరణాత్మక గైడ్ ద్వారా మీకు తెలియజేస్తాము. ఒకవేళ మీరు స్మార్ట్‌ఫోన్‌ను కనుగొనలేకపోయినా మీ డేటా మొత్తం సురక్షితంగా ఉంటుంది. అలాగే మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మీ స్మార్ట్‌ఫోన్‌ను కనుగొనగలరని నిర్ధారించుకోవడానికి మీరు ముందుగా నిర్ధారించుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. ఇవి మీ ఆండ్రాయిడ్ ఫోన్‌ను త్వరగా కనుగొనడంలో మీకు సహాయపడతాయి. మీరు పోగొట్టుకున్న ఫోన్ యొక్క ఖచ్చితమైన లొకేషన్‌ను పొందడంలో కూడా ఇవి మీకు సహాయపడతాయి. గూగుల్ ద్వారా హైలైట్ చేయబడిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఇవే.

పోగొట్టుకున్న ఆండ్రాయిడ్ ఫోన్‌ను కనుగొనడానికి కొన్ని సాధారణ చిట్కాలు..

** పోగొట్టుకున్న మీ ఫోన్ ఆన్ చేసి ఉండాలి.
** మీరు మీ గూగుల్ అకౌంటులో సైన్ ఇన్ చేసి ఉండాలి.
** మీ ఫోన్ తప్పనిసరిగా మొబైల్ డేటా లేదా Wi-Fiతో కనెక్ట్ చేయబడి ఉండాలి.
** మీ ఫోన్ గూగుల్ ప్లేలో కనిపించాలి.
** మీ ఫోన్‌లోని లొకేషన్ ఆన్ చేయబడి ఉండాలి.
** మీ స్మార్ట్‌ఫోన్‌లో 'ఫైండ్ మై డివైస్' ఫీచర్ ఆన్ చేయబడి ఉండాలి.

పోగొట్టుకున్న ఆండ్రాయిడ్ ఫోన్‌ను కనుగొనే విధానం

పోగొట్టుకున్న ఆండ్రాయిడ్ ఫోన్‌ను కనుగొనడానికి కొన్ని సాధారణ చిట్కాలు..

స్టెప్ 1: ముందుగా android.com/findకి వెళ్లి పోగొట్టుకున్న ఫోన్‌లో ఉన్న మీ గూగుల్ అకౌంటుకు సైన్ ఇన్ చేయండి.

స్టెప్ 2: మీకు ఒకటి కంటే ఎక్కువ ఫోన్‌లు ఉంటే స్క్రీన్ పైభాగంలో పోయిన ఫోన్‌ని క్లిక్ చేయండి.

స్టెప్ 3: ఇప్పుడు మీ పోగొట్టుకున్న ఫోన్‌లో గూగుల్ అకౌంటుకు సైన్ ఇన్ చేయండి. మీ పోగొట్టుకున్న ఫోన్‌లో ఒకటి కంటే ఎక్కువ యూజర్ ప్రొఫైల్‌లు ఉంటే కనుక మెయిన్ ప్రొఫైల్‌లో ఉన్న గూగుల్ అకౌంటుతో సైన్ ఇన్ చేయండి.

స్టెప్ 4: పోగొట్టుకున్న ఫోన్‌కి నోటిఫికేషన్ వస్తుంది. మీరు గూగుల్ మ్యాప్ లో ఫోన్ ఎక్కడ ఉందో సమాచారాన్ని పొందుతారు. ఒకవేళ పోయిన ఫోన్‌ స్విచ్ ఆఫ్ చేయబడి ఉంటే కనుక మీరు ఫోన్ యొక్క చివరిగా యాక్టీవ్ లో ఉన్న స్థానాన్ని చూస్తారు.

స్టెప్ 5: ఇప్పుడు మీరు సౌండ్‌ని సైలెంట్ లేదా వైబ్రేట్‌కి సెట్ చేసినప్పటికీ పూర్తి వాల్యూమ్‌లో ఐదు నిమిషాల పాటు ప్లే చేయవచ్చు. మీకు లాక్ లేకపోయినా కూడా మీరు పరికరాన్ని భద్రపరచవచ్చు. ప్రత్యామ్నాయంగా మీరు పరికరాన్ని శాశ్వతంగా తొలగించవచ్చు.

Best Mobiles in India

English summary
Here are Some Simple Tips to Find Your Lost Android Phone

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X