ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను un-Google చేయటం ఎలా..?
ప్రతి ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌కు గూగుల్ అకౌంట్ అనేది గుండెకాయ లాంటిది. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో ఏ సర్వీసును ఉపయోగించుకోవాలన్నా అది గూగుల్ అకౌంట్‌తోనే ముడిపడి ఉంటుంది. ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లు తమకంటూ ఓ గూగుల్ అకౌంట్‌ను క్రియేట్ చేసుకోవటం ద్వారా, గూగుల్ ఆఫర్ చేసే అన్ని సర్వీసులను వినియోగించుకునే వీలుంటుంది.

ఆండ్రాయిడ్ ఫోన్‌ల కోసం ఇప్పటికే అనేక సర్వీసులను లాంచ్ చేసిన గూగుల్ కాలానుగుణంగా వాటిని అప్‌డేట్ చేస్తూ వస్తోంది. ఈమెయిల్స్ కోసం జీమెయిల్ సౌకర్యాన్ని, డాక్స్ అలానే స్ప్రెడ్‌షీట్స్ కోసం గూగుల్ సూట్ సౌకర్యాన్ని, యాప్స్ కోసం ప్లేస్టోర్ సౌకర్యాన్ని గూగుల్ కల్పిస్తోంది.
గూగుల్ తన ప్లే స్టోర్ సర్వీసెస్ ఆధారంగా ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్ల అభిరుచులను తెలుసుకుంటూ వారికి కావల్సిన కంటెంట్‌ను ప్రొవైడ్ చేస్తూ వస్తోంది. ఇది ఒకింత మంచి పరిణామమే అయినప్పటికి కొన్ని సందర్భాల్లో మాత్రం యూజర్ ప్రైవసీకి ముప్పుగా మారుతోంది.
ఈ తొలనొప్పులు మనకెందుకునుకునేవారు తమ ఆండ్రాయిడ్ డివైస్‌లో గూగుల్ ట్రాకింగ్‌ను పూర్తిగా నిరోధించవచ్చు. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల నుంచి గూగల్ సర్వీసులను తొలగించటం ద్వారా సెక్యూరిటీ పరంగా కొన్ని రిస్కులను ఫేస్ చేయవల్సి ఉంటుంటి.
వీటిని ఎదుర్కొనేందుకు మీరు సిద్ధంగా ఉన్నట్లయితే నిర్భయంగా మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లలో గూగుల్ సర్వీసులను రిమూవ్ చేయవచ్చు. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో గూగుల్ సర్వీసులను తొలగించి వాటి స్థానంలో థర్డ్ పార్టీ యాప్‌లను ఇన్‌స్టాల్ చేసుకునే విధానాన్ని ఇప్పుడు తెలుసుకుందాం...

ముందుగా Pre-installed యాప్‌లను డిసేబుల్ చేయండి
ప్రతి ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో ముందుగానే కొన్ని గూగుల్ యాప్స్ Pre-installed కాబడి ఉంటాయి. ఇతర యాప్స్ మాదిరిగా వీటిని uninstall చేయటం కుదరదు. కాబట్టి వీటిని డిసేబుల్ చేసుకోవల్సి ఉంటుంది. గూగుల్ యాప్‌లను డిసేబుల్ చేసే క్రమంలో ఫోన్ సెట్టింగ్స్‌లోని యాప్స్ విభాగంలోకి వెళ్లి మాన్యువల్‌గా ఒక్కో గూగుల్ యాప్‌ను డిసేబుల్ చేసుకోవచ్చు.
ఒక్క Google Search యాప్ తప్ప మిగిలిన గూగుల్ యాప్స్ అన్నింటిని డిసేబుల్ చేసుకునే వీలు ఉంటుంది. మరొక పద్ధతిలో భాగంగా ఫోన్‌ను రూట్ చేయటం ద్వారా యాప్స్ అన్నింటిని డిలీట్ చేసే వీలుంటుంది. అయితే రూట్ చేయటమేనది మంచి పద్ధతి కాదు. ఇలా చేయటం వల్ల పోన్‌కు వారంటీ అనేది వర్తించదు.

కొత్త యాప్స్‌ను యాడ్ చేసుకోండి
ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ అప్లికేషన్‌లను డిలీట్ చేసిన తరువాత వాటికి ప్రత్యామ్నాయంగా కొత్త యాప్‌లను ఇన్‌స్టాల్ చేసుకోవల్సి ఉంటుంది. గూగుల్ ప్లే స్టోర్‌ను వద్దనుకున్నారు కాబట్టి, ఇక పై మీరు డౌన్‌లోడ్ చేసుకునే ప్రతి యాప్ కూడా థర్డ్ పార్టీ యాప్ స్టోర్ నుంచి పొందవల్సి ఉంటుంది. గూగుల్ ప్లే స్టోర్‌కు ప్రత్యామ్నాయంగా ఇంటర్నెట్‌లో సిద్ధంగా ఉన్న పలు థర్డ్ పార్టీ యాప్ స్టోర్‌ల వివరాలు..

9Apps
9Apps అనేది ఓ థర్డ్ పార్టీ యాప్ స్టోర్. ఈ అప్లికేషన్ స్టోర్ ద్వారా పాపులర్ యాప్స్‌ను యాక్సెస్ చేసుకునే వీలుంటుంది. గూగుల్ ప్లే స్టోర్‌లో కనిపించే WhatsApp, Hike వంటి ప్రముఖ యాప్స్ 9యాప్స్ స్టోర్‌లో లభ్యమవుతున్నాయి.

Amazon App Store
గూగుల్ ప్లే స్టోర్‌కు ప్రత్యామ్నాయంగా లభిస్తోన్న యాప్ స్టోర్‌లలో Amazon App Store ఒకటి. ఈ యాప్ స్టోర్ ద్వారా క్వాలిటీ యాప్‌లకు వేదికగా నిలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ డెవలపర్స్ అభివృద్ది చేసే అన్ని యాప్స్ ఇక్కడ లభిస్తాయి. వీటిని ఉచితంగా లేదా భారీ డిస్కౌంట్ల పై పొందవచ్చు.

F-Droid
F-Droid అనేది ఆండ్రాయిడ్ స్మార్ట్‌పోన్‌ల కోసం రూపొందించబడిన ప్రత్యేకమైన ఓపెన్ సోర్స్ యాప్ స్టోర్. ప్రపంచవ్యాప్తంగా కొత్త డెవలపర్స్‌చే అభివృద్ధి చేయబడిన యాప్స్ ఇక్కడ లభ్యమవుతాయి. థర్డ్ పార్టీ యాప్ స్టోర్‌ల నుంచి డౌన్‌లోడ్ చేసుకునే యాప్స్ మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ అవ్వని పక్షంలో ఫోన్ సెట్టింగ్స్‌ను అడ్జస్ట్ చేసుకోవల్సి ఉంటుంది.
ఫోన్ Settingsలోని Security విభాగంలోకి వెళ్లి Unknown Sources ఆప్షన్స్‌ను ఎనేబుల్ చేసుకోవటం ద్వారా థర్డ్ పార్టీ యాప్స్ సజావుగా మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ కాబడుతాయి.

జీమెయిల్‌కు ప్రత్యామ్నాయంగా Outlook
జీమెయిల్ తరువాత అత్యధిక మంది ఈమెయిల్ క్లయింట్‌లను కలిగి ఉన్న ఈ-మెయిల్ సర్వీసుల్లో Outlook ఒకటి. అత్యాధునిక ఫీచర్లతో అప్‌డేట్ అయిన Outlook మెయిల్ సర్వీసులో inbox management మరింత ఏకాగ్రతతో ఉంటుంది.
మెయిల్ ఇన్‌బాక్స్‌లో ముందుగా important messages మాత్రమే డిస్‌ప్లే అవుతాయి. స్వైప్ గెస్ట్యర్స్, స్మార్ట్ ఫిల్టర్స్ వంటి స్పెషల్ ఫీచర్స్ ఈ మెయిల్ సర్వీసులో ఉన్నాయి. Word, Excel ఇంకా PowerPointలను Outlook సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు Outlook యాప్‌ను 9Apps స్టోర్ ద్వారా పొందవచ్చు.

గూగుల్ మ్యూజిక్‌కు ప్రత్యామ్నాయంగా PowerAMP music player
ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల కోసం అందుబాటలో ఉన్న బెస్ట్ థర్డ్ పార్టీ మ్యూజిక్ యాప్‌లలో PowerAMP మ్యూజిక్ ప్లేయర్ యాప్ ఒకటి. fuid UIతో లభించే ఈ యాప్‌లో అనేక ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ ఉన్నాయి. అన్ని రకాల ఫైల్ ఫార్మాట్‌లను ఈ యాప్ సపోర్ట్ చేస్తుంది.
PowerAMP music player యాప్‌ను ట్రెయిల్ వర్షన్ క్రింద 15 రోజుల పాటు ఉచితంగా వినియోగించుకోవచ్చు. ఆ తరువాత రూ.300 పెట్టి సబ్‌స్క్రైబ్ చేసుకోవల్సి ఉంటుంది.

నేవిగేషన్ కోసం OsmAnd యాప్
గూగుల్ మ్యాప్స్ తరువాత అంతగా నేవిగేషన్ సర్వీసును అందిస్తోన్న బెస్ట్ యాప్‌లలో OsmAnd యాప్ ఒకటి. ఈ యాప్‌ను Amazon App Store ద్వారా పొందవచ్చు. లుక్స్ పరంగా ఈ యాప్ ఆకట్టుకోనప్పటికి పనితీరు పరంగా బాగుంటుంది. ఈ యాప్‌ను AddressToGPS యాప్‌కు పెయిర్ చేసినట్లయితే స్ట్రీట్ అడ్రస్‌లను కూడా తెలుసుకునే వీలుంటుంది.

సెర్చ్‌ఇంజిన్ కోసం DuckduckGO
ప్రైవసీకి పెద్దీపీట వేస్తూ రూపొందించిన సెర్చ్ ఇంజిన్ DuckduckGO యూజర్ బ్రౌజింగ్ హిస్టరీని ఏమాత్రం ట్రాక్ చేయదు. ఈ సెర్చ్ ఇంజిన్ యాప్ ఆండ్రాయిడ్ నిమితం ఓ ప్రత్యేకమైన బ్రౌజర్ యాప్‌ను అందిస్తోంది. ఈ యాప్‌కు సంబంధించిన apk fileను DuckduckGO అఫీషియల్ వెబ్‌సైట్ ద్వారా పొందవచ్చు.


Click it and Unblock the Notifications