ఇండియాలో సర్వీస్ ఆర్డర్ ఫీచర్ను రిలీజ్ చేయనున్న షియోమీ!

Posted By: Madhavi Lagishetty

షియోమీ దాని అధికారిక వెబ్ సైట్ Mi.com నుంచి ఇండియాలో ఒక కొత్త mi సర్వీసు ఆర్డర్ ఫీచర్ను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఫీచర్ యూజర్లు వారి డివైసు యొక్క రిపేరింగ్ స్టేటస్ ను ఐదు దశల ట్రాకింగ్ ప్రొగ్రెస్ తో ట్రాక్ చేస్తుంది.

ఇండియాలో సర్వీస్ ఆర్డర్ ఫీచర్ను రిలీజ్ చేయనున్న షియోమీ!

ఈ ప్రకటన గురించి షియోమీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మనుకుమార్ జైన్ స్పందించారు. ఈ ఫీచర్ను ప్రకటించడానికి ముందు ట్వీట్ చేశారు. కొత్త mi సర్వీస్ ఆర్డర్ స్టేటస్ తో, యూజర్లు వారి డివైసు రిపేరింగ్ ట్రాక్ చేయవచ్చు. ఆన్ లైన్ ద్వారా ఒకే స్టేటస్ను తెలుసుకోవచ్చు. రిపేరింగ్ స్టేటస్ను పర్యవేక్షించే ఐదు దశల్లో టెస్ట్, వర్క్ ఇన్ ప్రొగ్రెస్, డెలివరీ కోసం రెడీగా ఉండటం, డెలివరీని క్యాన్సల్ చేయడం వీటన్నింటి కోసం ఫీచర్ను క్రియేట్ చేశారు.

ఇది ఖచ్చితంగా షియోమీ స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు ఒక వరంగా చెప్పవచ్చు. వారి డివైసులు రిపేరింగ్ సర్వీస్ స్టేటస్ను ట్రాక్ చేయడానికి వారి సర్వీస్ సెంటర్ కు కాల్ చేయాల్సి ఉంటుంది. అలాగే షియోమీ కాల్ సెంటర్ల వద్ద సరిగ్గా స్పందించకపోవడం గురించి సోషల్ మీడియాలో కూడా ఎన్నో వీడియోలు వచ్చాయి. దీని తర్వాత యూజర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి ఆన్ లైన్ రిపేర్ ట్రాకింగ్ను సెలక్ట్ చేసుకున్నారు.

షియోమీ ఎప్పుడూ ఇండియాలో ఒక మెరుగైన కస్టమర్ అనుభవాన్ని అందించడం ఇంట్రెస్టింగ్ ఉంది. ఆన్ లైన్ డివైస్ రిపేర్ స్టేటస్ ట్రాకింగ్ తో అనుకున్న లక్ష్యాన్ని సాధించడంలో సంస్థ ఒక అడుగు ముందుకు వేసింది. మీరు mi.comద్వారా మీ షియోమీ ఫోన్ డివైసు రిపేరింగ్ స్టేటస్ ట్రాక్ ఎలా చేయాలో తెలుసుకోండి.

  • అధికారిక వెబ్ పేజిలో సర్వీస్ ఆర్డర్ స్టేటస్ కోసం సంప్రదించడం లేదా నెంబర్ లేదా సర్వీస్ నెంబర్ లేదా ఆర్డర్ నెంబర్ లేదా IMEIనంబర్ లేదా SMS నంబర్ నమోదు చేసుకోవాలి. 
  • ఈ నంబర్ ఎంటర్ అయిన తర్వాత , మీరు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లో OTPను పొందడానికి నిర్థారణ బటన్ను క్లిక్ చేయండి. 
  • ఇప్పుడు వెబ్ సైట్లో అందించబడిన బాక్స్ లో OTP టైస్ చేసి, సబ్ మిట్ బటన్ను నొక్కాలి. 
  • అంతే మీ డివైస్ రిపేర్ స్టేటస్ వెబ్ సైట్లో కనిపిస్తుంది. 

English summary
Xiaomi India has announced the launch of a new Mi Service Order Status feature on its official website Mi.com. This feature will let users track the repair status of their device with a five-stage tracking progress. Let’s take a look at how you can track the device repair status of your Xiaomi phone via Mi.com.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot