యూట్యూబ్ హిస్టరీని ఆటో డిలీట్ చేయడం ఎలా ?

By Gizbot Bureau
|

టెక్ ప్రపంచంలో దూసుకుపోతున్న ఆన్‌లైన్ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం యూజర్ల కోసం గూగుల్ కొత్త టూల్ ను ప్రవేశపెట్టింది. ఇకపై గూగుల్ సెర్చ్ లో వెతికిన యూజర్ల డేటాను వారు మ్యానువల్ గా డిలీట్ చేయాల్సిన అవసరం లేదు. ఆటో డిలీట్ ఆప్షన్ ద్వారా దానికదే డిలీట అవుతుంది.గూగుల్ సెర్చ్ యూజర్ల కోసం ప్రత్యేకించి గూగుల్ Auto-Delete Toolను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్ ద్వారా గూగుల్ ప్లాట్ ఫాంపై సెర్చ్ చేసే యూజర్ లొకేషన్ ట్రాకింగ్,వెబ్, యాప్ యాక్టివిటీ హిస్టరీని మ్యానువల్ గా డిలీట్ చేసుకోవచ్చు. లేదంటే.. ఆటోమాటిక్ గా డిలీట్ అవుతుంది. అయితే ఈ ఫీచర్ ని ఇప్పుడు గూగుల్ యూట్యూబ్ కి కూడా తీసుకువచ్చింది. ఈ ఫీచర్ ద్వారా మీరు యూట్యూబ్ లో సెర్చ్ చేసిన హిస్టరీ అంతా ఆటోమేటిగ్గా డిలీట్ అవుతుంది. అలా కాని పక్షంలో యూజర్లకు గూగుల్ మూడు ఆప్సన్లను ఇచ్చింది. వాటి ద్వారా డిలీట్ చేసుకోవచ్చు.

యాప్ లో ఎలా ?

యాప్ లో ఎలా ?

మీ స్మార్ట్ ఫోన్ లో సెట్టింగ్స్ ఓపెన్ చేయండి, గూగుల్ కెళ్లండి. దాన్ని ట్యాప్ చేయండి. అక్కడ మీకు డేటా పర్సనల్ కనిపిస్తుంది. అందులో యూట్యూబ్ హిస్టరీని ట్యాప్ చేయండి. తరువాత మేనేజ్ యాక్టివిటినీ ప్రెస్ చేయండి. ఆ తరువాత గూగుల్ పేజీని రీడైరక్ట్ చేయండి. గూగుల్ మైయాక్టివిటీ పేజీలోకి వెళ్లండి. అక్కడ మీ యూట్యూబ్ హిస్టరీ ఆన్ లో ఉంటే వెంటనే అక్కడ కనిపించే Choose to delete automatically అనే ఆప్సన్ సెలక్ట్ చేసుకోండి.

మూడు ఆప్సన్లు 

మూడు ఆప్సన్లు 

అందులో మీకు మూడు ఆప్సన్లు కనిపిస్తాయి. Keep until I delete manually,Keep for 18 months' and ‘Keep for 3 months'. ఇందులో మీకు నచ్చిన ఆప్సన్ సెలక్ట్ చేసుకుంటే సరిపోతుంది.

వెబ్ లో ఎలా ?

వెబ్ లో ఎలా ?

గూగుల్ లో కనిపించే మైయాక్టివిటీని ఓపెన్ చేయండి. 

లింక్ ఇదే : https://myactivity.google.com/activitycontrols/youtube

ఆ తరువాత

ఆ తరువాత

Keeping activity until you delete it manually అనే ఆప్సన్ సెలక్ట్ చేసుకోండి. అందులో click on ‘Choose to delete automatically అనే ఆప్సన్ ఎంచుకోండి. తర్వాత కనిపించే ప్రిపరెన్స్ సెలక్ట్ చేసుకుని కన్ఫర్మ్ బటన్ నొక్కండి. 

Best Mobiles in India

English summary
Here's how to auto-delete your YouTube history

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X