బ్యాటరీలు పేలేది అప్పుడే, ఆ బలహీన సమయాన్ని వదిలేయండి
ఇటీవల కాలంలో స్మార్ట్‌ఫోన్లో బ్యాటరీలు పేలుతున్నాయనే వార్తలు ప్రతిరోజూ వింటున్నాం.
ఇటీవల కాలంలో స్మార్ట్‌ఫోన్లో బ్యాటరీలు పేలుతున్నాయనే వార్తలు ప్రతిరోజూ వింటున్నాం. వినియోగదారులు ప్రాణాలు కోల్పోయారని, మరికొందరికి గాయాలు అయ్యాయనే వార్తలు రోజు ఏదో ఓ చోట దర్శనమిస్తూనే ఉన్నాయి. ఈ విసయాలు ఆందోళన కలిగించడంతో పాటు బధ్రత అనేది ప్రధాన అంశంగా మారింది. అయితే దీనికి ప్రధాన కారణం వినియోగదారుల అవగాహన రాహిత్యమేనని నిపుణులు చెబుతున్నారు. అతిగా స్మార్ట్‌ఫోన్‌ను వినియోగించడం, చార్జింగ్ పెట్టి సెల్‌లో మాట్లాడడం, పాటలు వినడం, అదేపనిగా చార్జింగ్ పెట్టడం వంటివి చేస్తుండడంతో నూటికి 99 శాతం మంది ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారని స్పష్టం చేస్తున్నారు.'

ఫోన్ బ్యాటరీ పూర్తిగా వేడెక్కడం వల్ల ..
ఫోన్ బ్యాటరీ పూర్తిగా వేడెక్కడం వల్ల కాని, చేతిలోనుంచి చాలాసార్లు జారడం, బ్యాటరీలో ఏర్పడిన బీటలు, ఫోన్‌లో అతి సున్నితమైన వైర్లు షార్ట్‌సర్క్యూట్ అవడం లాంటి అంశాలు బ్యాటరీలు పేలేందుకు కారణం అవుతున్నాయి.

పెద్దగా రక్షణ చర్యలు లేకుండానే
కొన్ని కంపెనీలు పెద్దగా రక్షణ చర్యలు లేకుండానే ఫోన్లను మార్కెట్లోకి తీసుకువస్తుంటారు. తద్వారా ఫోన్‌లో కాసేపు మాట్లాడినా అది వేడెక్కి పోతుంది. ఈ వేడి వల్ల ఫోన్ లోపల ఉన్న తీగలపై ఒత్తిడి పెరిగి ఫోన్ నుంచి పొగలు వ్యాపించి మంటలు వచ్చే అవకాశం ఉంది.

చార్జింగ్ పెట్టే సమయంలో
బ్యాటరీలో లోపాలుతో చార్జింగ్ పెట్టే సమయంలో అవి వేడెక్కి పేలిపోతున్నాయి. గత ఏడాది ప్రముఖ సంస్థకు చెందిన ఫోన్లు కూడా పేలిపోగా.. మార్కెట్లోకి విడుదల చేసిన ఫోన్లను ఆ కంపెనీ వెనక్కి తీసుకుంది.

tip 1
ఫోన్ల వినియోగంలో చార్జర్ ఎంతో కీలకం. అందుకే చార్జింగ్ పెట్టే సమయంలో కంపెనీ చార్జర్లను వినియోగించాలి.

tip 2
వాస్తవంగా మూడు నుంచి నాలుగు గంటల లోపు ఫోన్ చార్జింగ్ అవుతుంది. ఈ విషయాన్ని వినియోగదారులు గ్రహించాలి.

tip 3
రాత్రి పడుకునే ముందు తలపక్కన ఫోన్ చార్జింగ్ పెట్టరాదు. రాత్రంతా చార్జింగ్ అవడం వల్ల ఫోన్ పేలిపోవచ్చు లేదా.. త్వరగా బ్యాటరీ పాడేపోయే అవకాశం ఉంది.

tip 4
గాలి, వెలుతురు తగిలే ప్రాంతాల్లో ఫోన్‌కు చార్జింగ్ పెట్టాలి. ఇదే సమయంలో బ్యాటరీలకు తొడిగిన తొడుగులు తీసేయాలి. లేదంటే లోపల బ్యాటరీకి గాలి తగలక వేగంగా దెబ్బతింటుంది.

tip 5
బ్యాటరీ చార్జింగ్ 100శాతం అయ్యేవరకూ ఉంచకూడదు. దీనివల్ల బ్యాటరీలో ఉన్న సున్నిత పరికరాలు పాడవుతాయి.

tips 6
ఫోన్‌లో 10శాతానికి బ్యాటరీ చేరుకున్నప్పుడు మాత్రమే చార్జీంగ్ పెట్టాలి.

tips 7
కొన్ని ఫోన్లలో చార్జింగ్ వేగంగా అయిపోతుంది. ఇటువంటి సమయంలో అది బ్యాటరీ సమస్యగా భావించాలి. వెంటనే దానిని తీసేసి కొత్తవి వేసుకోవడం మేలు.


Click it and Unblock the Notifications








