మీ జియో నెంబర్ కు అనేక స్పామ్ కాల్స్ వస్తున్నాయా..అయితే DNDను ఇలా యాక్టివేట్ చేనుకోండి
ఈ రోజుల్లో అనేకమంది మొబైల్ వినియోగదారులు స్పామ్ కాల్స్ తో బాగా విసుగుచెందుతున్నారన్న సంగతి అందిరీ తెలిసిందే. ఏదో మన పనిలో మనం బిజీలో ఉంటే ఈ స్పామ్ కాల్స్ మనల్ని చాలా ఇబ్బందిపెడుతుంటాయి.
ఈ రోజుల్లో అనేకమంది మొబైల్ వినియోగదారులు స్పామ్ కాల్స్ తో బాగా విసుగుచెందుతున్నారన్న సంగతి అందిరీ తెలిసిందే. ఏదో మన పనిలో మనం బిజీలో ఉంటే ఈ స్పామ్ కాల్స్ మనల్ని చాలా ఇబ్బందిపెడుతుంటాయి. అది కొనండి ఇది కొనడం అంటూ సతాయిస్తుంటాయి. అయితే వీటికి పుల్ స్టాప్ ఎలా పెట్టాలో తెలియక చాలామంది సతమతమవుతుంటారు. ఆ స్పామ్ కాల్స్ తో సతమతమయ్యే వారు ఈ కింది సింపుల్ ట్రిక్స్ పాటించడం ద్వారా మీరు వాటిని తరిమేయవచ్చు.వివిధ రకాల కంపెనీల నుంచి వచ్చే స్పామ్ కాల్స్ ని కోడ్ ఎంటర్ చేయడం ద్వారా వాటిని బ్లాక్ చేయవచ్చు.ఈ శీర్షికలో భాగంగా జియో లో DND(do not disturb)ను ఎలా యాక్టివేట్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ తెలుపుతున్నాము.ఫాలో అయిపోండి

My JIO యాప్‌లో DND ఎలా యాక్టివేట్ చేయాలో తెలుసుకోండి
- మొదట ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ లో My JIO యాప్‌ను ఇన్‌స్టాల్ చేసి ఓపెన్ చేయండి
- లెఫ్ట్ టాప్‌లో Hamburger ఐకాన్ ను క్లిక్ చేయండి
- Settingsను క్లిక్ చేయండి
- Service settingsను క్లిక్ చేయండి
- Do not disturbను క్లిక్ చేయండి
- FULL DNDను సెలెక్ట్ చేసుకోండి
ఇలా చేస్తే మీ జియో నెంబర్ కు DND యాక్టివేట్ అయిపోతుంది.

SMS లేదా కాల్ ద్వారా DNDను ఎలా యాక్టివేట్ చేయాలో తెలుసుకోండి
- START 0 అని చేసి 1909ను SMS చేయండి.ఇలా చేస్తే మీ నెంబర్ కు FULL DND యాక్టివేట్ అయిపోతుంది
- లేదా 1909 నెంబర్ కు కాల్ చేసి ప్రాంపట్స్ ద్వారా మీ నెంబర్ కు FULL DND యాక్టివేట్ చేసుకోవచ్చు

కొన్నింటిని బ్లాక్ చేయడం కుదరదు
అయితే కొన్నింటిని బ్లాక్ చేయడం కుదరదు. bank SMS alerts, bank communications, online bookings, third party personal callingలాంటి వాటిని మీరు బ్లాక్ చేయించుకోలేరు.

దాదాపు 7 రోజులు సమయం
అయితే ఈ ప్రాసెస్ కి దాదాపు 7 రోజులు సమయం తీసుకుంటుంది. కాగా మీరు సర్వీసు రిక్వెస్ట్ కోసం ఓ సారి అప్లయి చేస్తే మళ్లీ మూడు నెలల తరువాతనే అప్లయి చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మొత్తంగా ఉచితంగా జరుగుతుంది. దీని కోసం మీనుంచి ఎటువంటి ఛార్జీలు తీసుకోబడవు.


Click it and Unblock the Notifications








