మీ గూగుల్ క్రోమ్‌ బ్రౌజర్ ఎప్పుడూ Incognito Modeలో ఓపెన్ అవ్వాలా..?

|

మీ నెట్ బ్రౌజింగ్‌కు సంబంధించి హిస్టరీ ఇంకా కీవర్డ్స్ ఎవరి కంటా పడకుండా ఉండాలంటే Incognito Modeను ఎంపిక చేసుకోవటం ఉత్తమం. ముఖ్యంగా ప్రైవేట్ బ్రౌజింగ్ ఆప్షన్ అనేది మనం వేరే వాళ్ల కంప్యూటర్ అంటే ఫ్రెండ్స్ లేదా ఇంటర్నెట్ సెంటర్‌లలో వెబ్ బ్రౌజింగ్ చేసే సమయంలో దోహదపడుతుంది. ఇలాంటి సందర్భాల్లో అజ్ఞాత మార్గాన్ని అనుసరించటం ద్వారా మన బ్రౌజింగ్ హిస్టరీని ఇతరులు తెలుసుకునే ఆస్కారం ఉండదు.

Incognito Modeను ఎనేబుల్ చేసుకోవాలంటే..?

Incognito Modeను ఎనేబుల్ చేసుకోవాలంటే..?

గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌లో Incognito Modeను ఎనేబుల్ చేసుకోవాలనుకుంటున్నట్లయితే ఫైల్ మెనూలోకి ప్రవేశించి.. ‘new window' ఆప్షన్ క్రింద కనిపించే ‘new incognito window' ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవల్సి ఉంటుంది. ఈ మోడ్‌లో బ్రౌజింగ్ చేయటం ద్వారా మీరు చూసిన వెబ్‌సైట్‌ల తాలుకా సమాచారం ఏది కంప్యూటర్లో సేవ్ అవ్వదు.

ctrl+Shift+N షార్ట్‌కట్‌ను అప్లై చేయటం ద్వారా కూడా ‘new incognito window'లోకి ప్రవేశించవచ్చు. ఇలా కాకుండా గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసిన ప్రతిసారీ Incognito Mode దానంతటకదే ఎనేబుల్ అయిపోవాలంటే ఈ సింపుల్ ప్రొసీజర్ ను ఫాలో అవ్వండి..

క్రోమ్ బ్రౌజర్‌ను ఓపెన్ చేసి..

క్రోమ్ బ్రౌజర్‌ను ఓపెన్ చేసి..

ముందుగా మీ విండోస్ కంప్యూటర్‌లోకి వెళ్లి గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ను ఓపెన్ చేయండి. బౌజర్ ఓపెన్ అయిన తరువాత టాస్క్‌బార్ పై గూగుల్ క్రోమ్ ఐకాన్ మీకు కనిపిస్తుంది.

propertiesను సెలక్ట్ చేసుకుని...

propertiesను సెలక్ట్ చేసుకుని...

Google Chrome ఐకాన్ పై మౌస్‌తో రైట్ క్లిక్ చేసినట్లయితే properties అనే ఆప్షన్ మీకు కనిపిస్తుంది.

properties ఆప్షన్ పై క్లిక్ చేసినట్లయితే క్రోమ్ బ్రౌజర్‌ ప్రాపర్టీస్‌కు సంబంధించి డైలాగ్ బాక్స్ ఒకటి ఓపెన్ అవుతుంది.

-incognito కోడ్‌ను యాడ్ చేయటం ద్వారా..?

బ్రౌజర్‌ ప్రాపర్టీస్‌కు సంబంధించిన షార్ట్‌కట్‌లో start in అనే సెక్షన్ కనిపిస్తుంది. ఈ సెక్షన్‌లో "C:Program Files (x86)GoogleChromeApplication" అనే కోడ్ ఉంటుంది. ఈ pathకు చివర ‘‘-incognito'' అనే కోడ్‌ను యాడ్ చేసి అప్లై బటన్ పై క్లిక్ చేసినట్లయితే క్రోమ్ బ్రౌజర్‌ను ఇన్‌కాగ్నిటో మోడ్‌లో ఓపెన్ చేసుకునేందుకు అవసరమైన షార్ట్‌కర్ట్ యాడ్ అవుతుంది. ఈ షార్ట్‌కట్ క్రోమ్ ఐకాన్‌ను టాస్క్‌బార్ పై పిన్ చేసుకోవటం ద్వారా గూగుల్ క్రోమ్‌ను ప్రతిసారీ incognito మోడ్ లోనే ఓపెన్ చేసుకునే వీలుంటుంది.

లవ్ గుర్తుతో పాటు ఆఫర్లతో Vivo V7 Plus, ప్రేమికులకు గిఫ్ట్‌గా..లవ్ గుర్తుతో పాటు ఆఫర్లతో Vivo V7 Plus, ప్రేమికులకు గిఫ్ట్‌గా..

Best Mobiles in India

English summary
Steps to Always Open Google Chrome in Incognito Mode

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X