మీ స్మార్ట్‌ఫోన్‌లోని కాంటాక్ట్‌లను బ్యాకప్ చేసుకోవటం ఏలా..?

Posted By:

మనిషిన్నాక పొరపాట్లు చేయటం సహజం. స్మార్ట్‌ఫోన్‌లను వినియోగిస్తోన్న చాలా మంది మిత్రులు ఏదో ఒక సందర్భంలో ఎదుర్కొనే సమస్య ‘తమ ఫోన్‌లోని కాంటాక్ట్స్ పూర్తిగా తొలగిపోవటం'. స్ర్కీన్ పై పొరపాటున రాంగ్ బటన్ నొకట్టం కారణంగానో, యాదాలాపంగా ఫోన్‌ను ఫార్మాట్ చేసే సందర్భంలోనో, దురదృష్టవశాత్తూ ఫోన్ ఏదైనా ప్రమాదానికి గురికావటం కారణంగానే ఈ రకమైన సమస్యలు తలెత్తుతుంటాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా మీరు ఉపయోగిస్తోన్న స్మార్ట్‌ఫోన్‌లోని కాంటాక్ట్‌లను సురక్షితంగా బ్యాకప్ చేసుకునేందుకు పలు చిట్కాలను మీతో షేర్ చేసుకుంటున్నాం....

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫోన్‌లోని కాంటాక్ట్‌లను బ్యాకప్ చేసుకోవటం ఏలా..?

మీరు ఐఫోన్‌ను వాడుతున్నట్లయితే ఫోన్ కాంటాక్ట్‌లను చాలా సులువుగా ఐక్లౌడ్‌లోకి బ్యాకప్ చేసుకోవచ్చు. ఈ ప్రక్రియలో భాగంగా మీ ఐఫోన్ తప్పనసరిగా ఇంటర్నెట్‌కు కనెక్ట్ అయి ఉండాలి.

ఐక్లౌడ్ స్టోరేజ్‌లోకి కాంటాక్ట్‌లను బ్యాకప్ చేసుకునేందుకు... ముందుగా మీ ఐఫొన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఐక్లౌడ్ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీ ఐక్లౌడ్ అకౌంట్‌లో కనిపించే ‘Contacs' ఆప్షన్‌ను ‘ON' మోడ్‌లో ఉంచినట్లయితే ఫోన్‌లోని కాంటాక్ట్స్ అన్నీ మీ ఐక్లౌడ్ అకౌంట్‌లోకి బ్యాకప్ కాబడతాయి.

 

ఫోన్‌లోని కాంటాక్ట్‌లను బ్యాకప్ చేసుకోవటం ఏలా..?

మీరు ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నట్లయితే....

ముందుగా మీ ఫోన్‌లోని Contactsలోకి వెళ్లండి.
ఆ తరువాత కాంటాక్ట్స్ మెనూ పై క్లిక్ చేసినట్లయితే వివిధ రకాల ఆప్షన్‌లు మీకు కనిపిస్తాయి.

ఇంకా ఉంది.. తరువాతి స్లైడ్‌లో చూడండి.

 

మీ స్మార్ట్‌ఫోన్‌లోని కాంటాక్ట్‌లను బ్యాకప్ చేసుకోవటం ఏలా..?

వాటిలో Import/export ఆప్షన్ పై క్లిక్ చేసి, Export to storageను సెలక్ట్ చేసుకోండి.

ఇప్పుడు మీ కాంటాక్స్ ఎక్స్‌పోర్ట్ అవుతున్నట్లు ఓ పాపప్ మెనూ స్ర్కీన్ పై ప్రత్యక్షమవుతుంది. దాన్ని OK చేయండి.

ఆ తరువాత మీ ఫోన్‌లోని ఫైల్ మేనేజర్ అప్లికేషన్‌ను ఓపెన్ చేసి మీ కాంటాక్ట్స్ ఫోల్డర్ ఎక్కడ ఉందో చూసుకోండి. ఆ కాంటాక్ట్స్ ఫైల్‌ను కాపీ చేసుకుని సురక్షితమైన ప్రదేశంలో స్టోర్ చేసుకోండి.

 

మీ స్మార్ట్‌ఫోన్‌లోని కాంటాక్ట్‌లను బ్యాకప్ చేసుకోవటం ఏలా..?

మీరు బ్లాక్‌బెర్రీ 10 ఫోన్ వాడుతున్నట్లయితే....

ముందుగా ఫోన్ సెట్టింగ్స్‌లోని అకౌంట్స్ ఆప్షన్‌లోకి వెళ్లండి.
స్ర్కీన్ క్రింది భాగంలో కనిపించే ‘Add Account' ను సెలక్ట్ చేసుకోండి.

ఆ తరువాత Email, Calendar and Contacts ను సెలక్ట్ చేసుకోండి.ఇప్పుడు మీ జీమెయిల్ అడ్రస్‌ను టైప్ చేసి ‘Next' ఆప్షన్ పై క్లిక్ చేయండి. ఆ తరువాత మీ పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేసి ‘Signin' కండి. ఇప్పుడు మీ బ్లాక్‌బెర్రీ 10 ఫోన్‌‌లోని కాంటాక్ట్స్ మీ గూగుల్ అకౌంట్‌లోకి బ్యాకప్ కాబడతాయి. ‘Sync Contacts'ను ‘On' చేయటం మరవకండి.

 

 

మీ స్మార్ట్‌ఫోన్‌లోని కాంటాక్ట్‌లను బ్యాకప్ చేసుకోవటం ఏలా..?

మీరు విండోస్ ఫోన్ వాడుతున్నట్లయితే....

మీ విండోస్ ఫోన్‌లోని కాంటాక్ట్స్ అన్ని మీరు ముందుగా ఓపెన్ చేసే మైక్రోసాఫ్ట్ అకౌంట్‌లోకి ఆటోమెటిక్‌గా బ్యాకప్ కాబడతాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
How to Backup Contacts on Your Smartphone. Read more in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot