మీకు తెలుసా? మీ ఆధార్ నెంబర్‌తో గవర్న‌మెంట్ హాస్పటల్‌ అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవచ్చు

ప్రభుత్వం అమలు చేస్తోన్న పథకాలను ప్రతి ఒక్క భారతీయుడికి చేరువచేసే లక్ష్యంతో డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ దూసుకుపోతోంది. మోదీ సర్కార్, ఈ ఆన్-డిమాండ్ గవర్నెన్స్ సర్వీసును అనౌన్స్ చేసి దాదాపు 18 నెలలు కావొస్తోంది. డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్‌లో భాగంగా ఉన్న స్వచ్చ్ భారత్ మిషన్, ఇ-ఎడ్యుకేషన్, ఇ-సంతకం, భీమ్ యాప్ వంటి సర్వీసులు దేశాన్ని పెను మార్పు దిశగా ముందుకు తీసుకువెళుతున్నాయి.

ఆధార్ నెంబర్‌తో గవర్న‌మెంట్ హాస్పటల్‌ అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవచ్చు

డిజిటల్ ఇండియా కార్యక్రమాల్లో ఒకటైన ఆధార్ బేసిడ్ 'Online Registration System' పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చేసింది. ఈ సర్వీస్ ద్వారా, మీ ఆధార్ కార్డ్ నెంబర్‌‌ను ఉపయోగించుకుని ఆన్‌లైన్‌లో గవర్న‌మెంట్ హాస్పటల్‌‌లో మీరు కన్సల్ట్ అవ్వాలనుకుంటున్న డాక్టర్‌ అపాయింట్‌మెంట్‌ను తీసుకోవచ్చు. ఆ ప్రోసీజర్ ను ఇప్పుడు చూద్దాం..

స్టెప్ 1 : ముందుగా 'Online Registration System' అనే వెబ్‌‌సైట్‌లోకి వెళ్లిండి.

స్టెప్ 2 : వెబ్‌‌సైట్‌ ఓపెన్ అయిన తరువాత కుడిచేతి వైపు కనిపించే Aadhaar Number కాలమ్ లో మీ ఆధార్ నెంబర్ ను ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి.

ఆధార్ నెంబర్‌తో గవర్న‌మెంట్ హాస్పటల్‌ అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవచ్చు

స్టెప్ 3 : ఆ తరువాత ఓపెన్ అయ్యే మెనూలో హాస్పటల్‌తో పాటు మీ మెడికల్ హెల్ప్‌కు అవసరమైన డిపార్ట్‌మెంట్‌ను ఎంపిక చేసుకోవల్సి ఉంటుంది.

స్టెప్ 3 :  ఆ తరువాత తారీఖు అలానే సమాయాన్ని సెలక్ట్ చేసుకోండి.

స్టెప్ 4 :  మీరు అపాయింట్‌మెంట్‌ బుక్ చేసుకున్న వెంటనే ఒక కన్ఫర్మేషన్ మెసేజ్ మీకు అందుతుంది. ఆ మెసేజ్‌లో మీ అపాయింట్‌మెంట్‌ తాలుకా బుకింగ్ సమాచారం ఉంటుంది. మీ అపాయింట్‌మెంట్‌‌ను ప్రింట్ రూపంలో కూడా తీసుకోవచ్చు.

స్టెప్ 5 :  ఒకవేళ మీ వద్ద ఆధార్ కార్డ్ అందుబాటులో లేనట్లయితే మీ మొబైల్ నెంబర్‌ను ఉపయోగించుకుని అపాయింట్‌మెంట్‌ను తీసుకోవచ్చు.

English summary
How to book appointment in government hospital using your Aadhar card online. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot