భారత్.. హెచ్‌పి, ఆన్‌లైన్ గ్యాస్ బుకింగ్ ఏలా?

Posted By:

గృహవినియోగంలో భాగంగా గ్యాస్ నిత్యావసర వస్తువులా మారిపోయంది. ప్రతి ఇంట్లోనే గ్యాస్ సిలెండర్ తప్పనిసరైంది. ప్రస్తుత పరిస్థితులను పరిశీలించినట్లయితే మన రాష్ట్రాన్ని గ్యాస్ కష్టాలు పట్టిపీడిస్తున్నాయి. కేంద్ర సర్కార్ గ్యాస్ సిలిండర్ల పై కోత పెట్టిన నేపధ్యంలో ఈ సమస్య మరింత ఉధృతమైంది.

సాంకేతికత మరింత విస్తరించటంతో ఆన్‌లైన్ గ్యాస్ బుకింగ్ సర్వీస్‌లు అందుబాటులోకి వచ్చాయి. నేటి ప్రత్యేక టెక్ చిట్కా శీర్షికలో భాగంగా భారత్ ఇంకా హెచ్‌పి గ్యాస్ సిలెండర్లను ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకేనే వివిధ మార్గాలను క్రింది స్లైడ్‌షో ద్వారా మీకు వివరిస్తున్నాం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

భారత్.. హెచ్‌పి, ఆన్‌లైన్ గ్యాస్ బుకింగ్ ఏలా?

భారత్ గ్యాస్ ఆన్‌లైన్ బుకింగ్ (Bharat gas Online booking):

భారత్ గ్యాస్ సిలెండర్‌లను ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకోవాలనుకునే వారు ముందుగా www.ebharatgas.comలో రిజిస్టర్ కావల్సి ఉంది. నమోదులో భాగంగా కనెక్షన్ నెంబర్ ఇంకా ఏజన్సీ కోడ్‌ను తెలపాల్సి ఉంటుంది. ఈ సర్వీస్ ద్వారా గ్యాస్ బుకింగ్ ఇంకా డెలివరీ స్టేటస్‌ను తెలుసుకోవచ్చు. లింక్ అడ్రస్:

భారత్.. హెచ్‌పి, ఆన్‌లైన్ గ్యాస్ బుకింగ్ ఏలా?

భారత్ గ్యాస్ ఎస్ఎంఎస్ బుకింగ్ (Bharat gas SMS booking):

భారత్ గ్యాస్ ఎస్ఎంఎస్ బుకింగ్ సర్వీస్ హైదరాబాద్, ఢిల్లీ, బెంగుళూరు, పూణే, చెన్సై వంటి మెట్రో నగరాలు ఇంకా రాష్ట్ర రాజధానులకే పరిమితమయ్యింది. ఈ సేవను ఉపయగించుకునే వారు ముందుగా తమ మొబైల్ నెంబర్‌ను ఆన్‌లైన్ లేదా ఎస్ఎంఎస్ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్ ద్వారా నమోదుచేయదలచిన వారు http://www.ebharatgas.com/pages/Customer_Console/Customer_New_Register.html లింక్‌లోకి లాగిన్ కావాల్సి ఉంటుంది. ఎస్ఎంఎస్ విధానం ద్వారా రిజిస్టర్ చేయదలచిన వారు ఈ క్రింది ఫార్మాట్‌ను అనుసరించాల్సి ఉంటుంది.

REG----space---DistributorSAPCode---space----ConsumerNumber to 57333

వోడాఫోన్, ఎంటీఎన్ఎల్, ఐడియా, ఎయిర్‌టెల్ ఇంకా టాటా యూజర్లు 52725కు ఎస్ఎంఎస్ చేయవచ్చు. మీ రిజిస్ట్రేషన్ విజయవంతమైన వెంటనే మీకో ఎస్ఎంఎస్ అందుతుంది. రిఫీల్ బుకింగ్ సమయంలో ఎల్‌పీజీ అని టైప్ చేసి 57333కు ఎస్ఎంఎస్ చేస్తే సరిపోతుంది. ఎస్ఎంఎస్ ఆధారంగా మీ సిలెండర్ బుక్ అయిన వెంటనే బుకింగ్ రిఫరెన్స్ నెంబర్‌తో కూడిన ఎస్ఎంఎస్ మీకు అందుతుంది.

భారత్.. హెచ్‌పి, ఆన్‌లైన్ గ్యాస్ బుకింగ్ ఏలా?

హెచ్‌పి గ్యాస్ ఆన్‌లైన్ బుకింగ్ (HP gas Online booking):

హచ్‌పి గ్యాస్ సిలెండర్ బుకింగ్‌కు సంబంధించి ఆన్‌లైన్ ఇంకా ఎస్‌ఎంఎస్ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఆన్‌లైన్ బుకింగ్ సేవను పొందలానుకునే హెచ్‌పి వినియోగదారు http://dcms.hpcl.co.in/ConsumerPortal/Logging/SecureLogin.aspx లింక్‌లోకి లాగినై ఐడీ ఇంకా పాస్‌వర్డ్‌ను పొందవల్సి ఉంటుంది. హెచ్‌పి అధికారిక వెబ్‌సైట్‌లో ఖాతాను తెరిచిన వెంటనే మీ అడ్రస్ ప్రూఫ్ ఇంకా ఐడీ ప్రూఫ్ వివరాలను సమీపంలోని హెచ్‌పి గ్యాస్ ఏజన్సీలో సమర్పించాల్సి ఉంటుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot